త్యాగధనుల చరిత్ర అధ్యయనంచేయండి.

 తాడేపల్లి (ప్రజా అమరావతి);


*త్యాగధనుల చరిత్ర అధ్యయనంచేయండి*



*తాడేపల్లి మాజీ సర్పంచ్ దొంతిరెడ్డి శ్రీనివాసకుమారి*


తాడేపల్లి త్యాగధనుల చరిత్రను అధ్యయనం చేయడంతోపాటు వారి జీవితాలను స్ఫూర్తిగా తీసుకొని 75వస్వాతంత్ర్యోద్యమ స్ఫూర్తితో ముందుకు సాగాలని 

తాడేపల్లి మాజీ సర్పంచ్ దొంతిరెడ్డి శ్రీనివాసకుమారి పిలుపునిచ్చారు. స్ఫూర్తి ఉత్సవాల్లో భాగంగా తాడేపల్లి భగవాన్ హైస్కూల్లో నిర్వహించిన వ్యాసరచన,వక్త్రత్వం, దేశభక్తి గీతాల్లో గెలుపొందినవారికి గోల్డ్,సిల్వర్,రజత బహుమతులు, సర్టిఫికెట్లు బుధవారం అందజేశారు.అల్లూరి సీతారామరాజు 125వ జయంతి,

75వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా తాడేపల్లిలోని 12 పాఠశాలల్లో ఈ పోటీలు జరిగాయి. 

ఈ సందర్భంగా జరిగిన సభకు సుందరయ్య సేవా సమితి కన్వీనర్ గాదె సుబ్బారెడ్డి అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా శ్రీనివాసకుమారి మాట్లాడుతూ దేశ స్వాతంత్ర్యంకోసం ఎందరోమహనీయులు ఉరికంభాలు ఎక్కా

రని...చెరసాలలో మగ్గారని పేర్కొన్నారు. ఆవీరులత్యాగఫలాలు ఎవరికిఅందుతున్నాయో ఆలోచించాలని కోరారు.మనిషి తినడానికి తిండి, కట్టుకోవడానికి బట్ట, ఉండటానికి ఇల్లు, స్వాతంత్ర్యం వస్తే వస్తాయని, ప్రజలందరూ భావించి కులమతాలకు అతీతంగా స్వాతంత్ర్యోద్యమంలో పాల్గొన్నారని చెప్పారు.నేటికి అవి

నెరవేరలేదని ఆవేదన వ్యక్తంచేశారు.అలాగే నేటికి వైద్యం పేదవాడికి అందుబాటులో లేకుండా పోయిందని చెప్పారు.స్వాతంత్ర్యోద్యమంలో ప్రధానపాత్ర పోషించిన గాంధీని చంపిన గాడ్సే వారసులు నేడు పాలన చేస్తున్నారని విమర్శించారు. వివిధ జాతులు, మతాలు కలగలిసిన వైవిధ్యం గల భారతదేశంలో కులాలమధ్య కుంపటి పెట్టి మతాల మధ్య చిచ్చుపెడుతున్నారని మండిపడ్డారు. స్వార్థం కొంత మానుకొని త్యాగనిరతిని అలవాటు చేసుకోవాలని కోరారు.

సుందరయ్య సాంస్కృతిక సేవా సమితి కన్వీనర్ గాదె సుబ్బారెడ్డి మాట్లాడుతూ విద్యార్థులు ప్రశ్నించేతత్వం అలవరచుకోవాలని కోరారు.కరోనా సమ

యంలో సుందరయ్య సేవా సమితి చేసిన సేవలనువివరించారు. సాంస్కృతిక రంగంలో కూడా తమవంతు సేవలుఅందజేయడానికి సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు రేపు శుక్రవారం తాడేపల్లి సెంటర్లో జరిగే ప్రదర్శనకు భగవాన్ స్కూల్ నుండి విద్యార్థినీ విద్యార్థులు తరలి రావాలని కోరారు.భవిష్యత్తులో బాలానందం లాంటి కార్యక్రమాలు సుందరయ్య సాంస్కృతిక సేవా సమితి నిర్వహిస్తుందని అందుకు తమ సంపూర్ణ సహకారాలు అందించాలని ఉపాధ్యాయినీ ఉపాధ్యాయులు

విద్యార్థులను కోరారు.

శారద కళాశాల విశ్రాంత లెక్చరర్ పలగాని గాంధీ మాట్లాడుతూ తరగతి గదుల్లోనే దేశభవిష్యత్తు నిర్మాణమవుతుందని చెప్పారు.

అంకితభావంతో 

చదివి మంచి పౌరులుగా ఎదగాలని కోరారు.భగవాన్ స్కూల్ ప్రిన్సిపల్ కానూరు శ్రీనివాసరావు మాట్లాడుతూ సుందరయ్య సాంస్కృతిక సేవా సమితి చేస్తున్న కార్య

క్రమాలను అభినందించారు. భవిష్యత్తులో సమితి నిర్వహించే కార్యక్రమాలకు తమ సంపూర్ణ మద్దతు ఉంటుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో భగవాన్ స్కూల్

ఉపాధ్యాయినీ ఉపాధ్యాయులు విద్యార్థులు పాల్గొన్నారు.

Comments