హైదరాబాద్ (ప్రజా అమరావతి);
*ఆజాదీకా అమృత్ మహోత్సవ్ కార్యక్రమంలో భాగంగా టిడిపి కార్యాలయంలో జాతీయ జెండాను ఆవిష్కరించిన పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు*
*స్వాతంత్ర్య సమరయోధుల చిత్రపటాలకు పూలువేసి నివాళులు అర్పించిన టిడిపి అధినేత*
*చంద్రబాబు నాయుడు, టిడిపి అధినేత ప్రసంగం*
• ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ సందర్భంగా ప్రజలకు శుభాకాంక్షలు, అభినందనలు
• స్వాతంత్ర్య పోరాటంలో ప్రాణాలు అర్పించిన సమర యోధులకు నివాళి అర్పిద్దాం
• హర్ ఘర్ తిరంగా ఒక మంచి కార్యక్రమం.
• భారత దేశం ఎంతో గొప్ప చరిత్ర కలిగిన దేశం.
• ఇప్పుడు గర్వంగా జెండా చేతపట్టుకుని తిరుగుతున్నాం అంటే ఎందరో చేసిన త్యాగాలే కారణం
• జాతిపిత మహాత్మాగాంధీ నుంచి కొమరం భీం వరకు అందరినీ స్మరించుకుందా.
• ప్రతి భారతీయుడు గర్వంగా జెండా పట్టుకుని తిరిగాల్సిన సమయం ఇది
• ప్రతి ఇంటిపై జాతీయ జెండా...ప్రతి వారి గుండెలో జాతీయ భావం రావాలి
• దేశం నాకు ఏమి ఇచ్చింది అని కాదు....నేను దేశానికి ఏమి ఇచ్చాను అనేది చూడాలి
• ఈ 75 ఏళ్లలో దేశం ఎన్నో విజయాలు సాధించింది.
• విదేశీయుల దాడులు, పాలన కారణంగా దేశం చాలా కోల్పోయింది.
• నాటి నెహ్రూ నుంచి నేటి మోదీ వరకు చేసిన పాలనను మనం గుర్తు చేసుకోవాలి.
• రాజకీయ నాయకులు ప్రభుత్వాలలో ఉండి తీసుకువచ్చే పాలసీలు ప్రజల జీవితాలను మార్చాలి.
• క్రీడల్లో విజయాలతో క్రీడాకారులు మన కీర్తి చాటుతున్నారు.
• స్వాంతంత్ర్యం వచ్చిన తరువాత కూడా తిండి లేక ఆకలితో జనం చనిపోయారు.
• ఆ సమయంలో వచ్చిన హరత విప్లవం, పాల విప్లవంతో పెనుమార్పులు వచ్చాయి.
• తెలుగు బిడ్డ పివి నరసింహారావు ప్రధానిగా ఆర్థిక సంస్కరణలు తీసుకువచ్చారు.
• తెలుగు బిడ్డ పింగళి వెంకయ్య జాతీయ జెండాను రూపొందించారు.
• స్వాతంత్ర్యానికి ముందు...తరువాత తెలుగు వారు దేశ నిర్మాణంలో కీలక పాత్ర పోషించారు.
• 75 ఏళ్ల ఉత్సవాల సందర్భంగా...వచ్చే 25 ఏళ్లు ఏం చెయ్యాలి అనే లక్ష్యాలు పెట్టుకోవాలి
• ఒక వ్యక్తి కావచ్చు...ఒక వ్యవస్థ కావొచ్చు....వచ్చే 25 ఏళ్లు ఏమి చెయ్యాలి అని నిర్ధిష్టమైన లక్ష్యం పెట్టుకోవాలి.
• పాలకులు తీసుకున్న నిర్ణయాలతో దేశంలో పెను మార్పులు వచ్చాయి.
• విద్య, వ్యవసాయం, ఆరోగ్య విషయంలో మార్పులు వచ్చాయి.
• హైదరాబాద్ నాలెడ్జ్ ఎకానమీకి అడ్రస్ గా ఉంది.
• దేశంలో ఉన్న యువశక్తిని ఉపయోగించుకుంటే దేశం అత్యున్నత స్థితికి చేరుతుంది.
• ఐటి రంగంలో, టెలికాం రంగంలో నాడు కీలక నిర్ణయాలు అమలు చేశాను. ఆ ఫలితాలు ఇప్పుడు కనిపిస్తున్నాయి.
• ఈ రోజు ప్రపంచ వ్యాప్తంగా తెలుగు వారు ఉండడానికి నాడు చేసిన సంస్కరణలే కారణం.
• ఇప్పుడున్న ఆర్థిక వ్యవస్థను మరింత బలోపేతం చెయ్యాలి. ప్రపంచంలో అగ్రగామి చెయ్యాలి.
• ప్రాణ త్యాగాలు చేసిన సమర యోధుల కలలు నిజం చెయ్యాలి అంటే దేశం ఒక సంకల్పంతో పని చెయ్యాలి
• విలువలతో కూడిన సమాజం ఆవిష్కృతం చెయ్యాలి.
• ఎంతో అభివృద్ది చెందినా ఇప్పటికీ పేదరికం ఉంది...నిరుద్యోగం ఉంది.
• ఆర్థిక అసమానతలను తొలగించే ఆర్థిక వ్యవస్థ రావాలి. పాలసీలు మార్చుకోవాలి
• దేశంలో సంపద సృష్టించాలి. అందరికీ సమాన అవకాశాలు లభించేలా కార్యక్రమాలు చేపట్టాలి.
• రైతులు ఇప్పటికీ ఆత్మహత్యలు చేసుకుంటున్నారు...దీనికి చాలా బాధ పడాలి. ఆలోచించాలి.
• దేశానికి అన్నంపెట్టే రైతు కుటుంబానికి అన్నం పెట్టలేకపోతున్నాడు.
• దేశంలో 57 శాతం మంది రైతులు అప్పుల్లోనే ఉన్నారు. తెలుగు రాష్ట్రాల్లో పరిస్థితి దారుణంగా ఉంది.
• సరైన దిశగా ప్రయాణం సాగిస్తే రానున్న రోజుల్లో అమెరికా, చైనాల కంటే భారత దేశం ముందు ఉంటుంది. ఆ సామర్థ్యం దేశానికి ఉంది.
• రక్షణ రంగంలో మూడో స్థానంలో ఉన్నాం.....దేశానికి ఆహార ధాన్యాలు ఇవ్వగలుగుతున్నాం.
• దేశ రక్షణలో ఉన్న సైనికులను, ఇక్కడ మనం కోసం పని చేస్తున్న పోలీసులను గౌరవించుకోవాలి.
• ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ కార్యక్రమం సందర్భంగా ప్రతి ఇంటిపై జాతీయ జెండా ఎగురవెయ్యాలి
• జెండా ఎగురవెయ్యడం ద్వారా ప్రజల్లో ఒక స్ఫూర్తి రావాలి.
• తెలుగు దేశం దేశ అభివృద్దిలో భాగస్వామిగా ఉంది.
• టిడిపి ప్రభుత్వాలు తీసుకున్న పాలసీలు దేశానికి ఆదర్శంగా నిలుస్తున్నాయి.
• నాడు వాజ్ పేయి నా మాట మేరకు స్వర్ణ చతుర్భుజి ప్రాజెక్ట్ చేపట్టారు. దేశంలో రోడ్ కనెక్టివీకి ఇదే కారణం.
• మైక్రో ఇరిగేషన్ పై నాడు ఇచ్చిన సూచనలు ఇప్పుడు అమల్లోకి వచ్చాయి.
• దేశంలో నదుల అనుసంధానం జరగాలి. రైతులకు సాగు నీటి కరువు పోలవాలి.
addComments
Post a Comment