మహిళల స్వయం ఉపాధే లక్ష్యంగా ''స్త్రీ శక్తి'' కార్యక్రమం.

 ''స్త్రీ శక్తి'' 


- మహిళల స్వయం ఉపాధే లక్ష్యంగా ''స్త్రీ శక్తి'' కార్యక్రమం. 


- 45 రోజుల శిక్షణ పూర్తి చేసుకున్న మొదటి బ్యాచ్. 

- టైలరింగ్, బ్యూటీషియన్ కోర్సులు పూర్తిచేసుకున్న మహిళలకు సర్టిఫికెట్లు అందజేత. 

- స్వయం ఉపాధి కోసం ఉచితంగా టైలరింగ్ మెషిన్లు పంపిణీ. 

- ప్రోత్సాహం, అవకాశం కల్పిస్తే మహిళల ఎదుగుదల కు ఆకాశమేహద్దన్న లోకేష్. 

మంగళగిరి (ప్రజా అమరావతి);

మంగళగిరి నియోజకవర్గంలో మహిళలకు స్వయం ఉపాధి కల్పించడమే లక్ష్యంగా టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి ''స్త్రీ శక్తి'' కార్యక్రమాన్ని ప్రారంభించారు. మంగళగిరి టిడిపి కార్యాలయం ఎంఎస్ఎస్ భవన్ కేంద్రంగా నిపుణుల పర్యవేక్షణలో టైలరింగ్, బ్యూటీషియన్ కోర్సులు ఉచితంగా అందించారు. 45 రోజుల పాటు మొదటి బ్యాచ్ లో 70 మంది మహిళలు శిక్షణ పూర్తి చేసుకున్నారు. 30 మంది టైలరింగ్ కోర్సు లో శిక్షణ పొందగా 40 మంది బ్యూటీషియన్ కోర్సు లో శిక్షణ పొందారు. బుధవారం పార్టీ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ శిక్షణ పూర్తిచేసిన మహిళలకు సర్టిఫికెట్లు అందజేసి అభినందించారు. వారి స్వయం ఉపాధి కోసం ఉచితంగా టైలరింగ్ మెషీన్లు అందజేసారు. తమ కాళ్ళ పై తాము నిలబడేందుకు నారా లోకేష్ ఇస్తున్న సహకారం ఎప్పటికీ మర్చిపోలేమని మహిళలు తమ ఆనందాన్ని వ్యక్తం చేసారు. 45 రోజుల పాటు నిపుణులు ఇచ్చిన శిక్షణ తమకు ఎంతగానో ఉపయోగపడుతుందని మహిళలు అన్నారు. స్వయం ఉపాధి కోసం లోకేష్ ఉచితంగా అందజేసిన టైలరింగ్ మెషీన్లు తమకు జీవనాధారంగా ఉంటాయని వారు అన్నారు. మొదటి బ్యాచ్ విజయవంతంగా కోర్సు పూర్తి చేసుకోవడం చాలా ఆనందంగా ఉందని, మహిళలకు అవకాశాలు, సహకారం అందిస్తే ఆకాశమేహద్దుగా దూసుకుపోతారని లోకేష్ అన్నారు. ఎవరిపైనా ఆధారపడకుండా స్వయం శక్తి పై ఆధారపడి జీవించే విధంగా మహిళలకు అవకాశం కల్పించాలనే ఉద్దేశంతోనే స్త్రీ శక్తి కార్యక్రమం ప్రారంభించినట్టు ఆయన పేర్కొన్నారు. భవిష్యత్తు లో ఈ కార్యక్రమాన్ని మరింత మంది మహిళలకు అందించే విధంగా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామని ఆయన అన్నారు. టైలరింగ్, బ్యూటీషియన్ కోర్సులు  నేర్చుకోవడానికి నియోజకవర్గంలోని మహిళల నుండి విశేష స్పందన లభిస్తుందని రెండొవ బ్యాచ్ శిక్షణ కూడా ప్రారంభమయ్యిందని లోకేష్ అన్నారు. వివిధ విభిన్నమైన కోర్సుల్లో మహిళలకు శిక్షణ ఇవ్వడం ద్వారా అందరికి స్వయం ఉపాధి కల్పించాలని ఆలోచన చేస్తున్నట్టు లోకేష్ తెలిపారు. ఈ కార్యక్రమాన్ని ఇంత పెద్ద ఎత్తున విజయవంతం చెయ్యడం, మహిళల్లో అవగాహన కల్పించడంలో సహకరిస్తున్న మహిళా మిత్ర సభ్యులు, నియోజకవర్గం టిడిపి నేతలు, కార్యకర్తలను లోకేష్ ప్రత్యేకంగా అభినందించారు. వివిధ కోర్సుల్లో శిక్షణ అందించడం, సంబధించిన పనిముట్లు అందజేయడం ఒక ఎత్తు అయితే వారంతా వారి కాళ్ళ పై వాళ్ళు నిలబడేలా సహకారం అందించడం మరో ఎత్తని లోకేష్ అభిప్రాయపడ్డారు. శిక్షణ పొందిన వారికి వివిధ సంస్థలతో మాట్లాడి జాబ్ వర్క్స్ ఇప్పిస్తే బాగుంటుందని కొంతమంది సలహా ఇచ్చారు. దాని పై ద్రుష్టి పెట్టామని లోకేష్ అన్నారు.

బ్యూటీషియన్ కోర్సులు పూర్తి చేసి త్వరలోనే వృత్తి ప్రారంభించే వారికి కిట్స్ కూడా అందజేస్తామని లోకేష్ అన్నారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గానికి చెందిన టిడిపి ముఖ్యనేతలు, మహిళా నేతలు పాల్గొన్నారు.

Comments