జాతీయ భావం పెంపొందించే విధంగా జండా వందనం కార్యక్రమం జరుపుకోవడం ఆనందంగా ఉంది.


 రామచంద్ర పురం, ఆగస్టు 11 (ప్రజా అమరావతి);


హర్ ఘర్ పే తిరింగా కార్యక్రమం లో భాగంగా జాతీయ భావం పెంపొందించే విధంగా జండా వందనం కార్యక్రమం జరుపుకోవడం ఆనందంగా ఉంద


ని రాష్ట్ర బీసీ, సినిమాటోగ్రఫీ, సమాచార పౌర సంబంధాల శాఖ మాత్యులు చెల్లు బోయిన శ్రీనివాస్ వేణు గోపాల కృష్ణ తెలిపారు.

గురువారం రామచంద్రపురం వి యస్ ఎం కళాశాల నుండి రాజగోపాల్ సెంటర్ వరకు మంత్రి నేతృత్వంలో 350 అడుగుల జాతీయ జెండా ను 3000 మందితో  కలిసి ర్యాలీ నిర్వహించారు.


ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ప్రతి ఒక్కరిలో జాతీయ భావం పెంపొందించాలనే ఉద్దేశ్యంతో ఆజాద్ కా అమృత మహోత్సవం 75 సంవత్సరాలు, ఘర్ ఘర్ పే తిరంగా కార్యక్రమం జరుగుతుంది అన్నారు.భారతీయ స్త్రీ నడివీధిలో అర్ధరాత్రి ఒంటరిగా నడవగలిగినప్పుడే అసలైన స్వతంత్రం వచ్చిందని ఆనాడు మహాత్మా గాంధీ అన్నారని తెలిపారు.

రాఖీ పౌర్ణమి, రక్షాబంధన్ సందర్భంగా ఈరోజు రామచంద్రాపురంలో మహిళా స్వాతంత్రానికి మహిళా స్వేచ్ఛకి, మహిళా రక్షణకి మరియు మహిళా అభ్యున్నతికి ఏమాత్రం కొరవలేదని తెలుపుతూ వేలాదిగా తరలివచ్చి ఈ ఆజాదిక అమృత మహోత్సవ కార్యక్రమంలో పాలుపంచుకోవడం అభినందనీయమన్నారు. ఈ 75 సంవత్సరాల స్వాతంత్రం  ఇల్లు లేని వాళ్ళకి ఇల్లు ఇచ్చింది అని చదువు లేని వాళ్ళకి చదివించింది అని మన బిడ్డలకు తినడానికి తిండినిచ్చింది అని ఇవన్నీ కూడా స్వాతంత్రం మనకు ఇచ్చినటువంటి ఫలాలు అని మంత్రి  అన్నారు .అదేవిధంగా ఈనాడు రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మహాత్మా గాంధీ ఆశయాల సాధన కోసం మన రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి ఆలోచన విధానంతో రాష్ట్రంలో పేదరికం అనే దీర్ఘకాలిక రోగాన్ని అంతం చేయాలని, పేదరికం అనే శాపంతో ఏ ఒక్క కుటుంబం కూడా బాధపడకూడదు అని పేదరికం అంతమైనప్పుడే నిజమైన స్వాతంత్రం వచ్చినట్టని అప్పుడే స్వతంత్ర ఫలాలు అందుతాయని ఆలోచన చేశాడు కాబట్టి నవరత్నాలు అనే పథకాలు ప్రవేశపెట్టి ప్రజలకు స్వాతంత్ర ఫలాలు  అందిస్తున్నారని తెలిపారు.

అదే విధంగా మహిళా సంరక్షణ కోసం ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి ఎనలేని కృషి చేస్తున్నారని అందులో భాగంగానే రాఖీ పౌర్ణమి సందర్భంగా కృతజ్ఞతాభావంతో పెద్ద ఎత్తున  పాల్గొని ముందుకు రావడం గొప్ప విషయమన్నారు.

ప్రజల మనోభావాలను కించపరిచే విధంగా, ప్రభుత్వ ప్రతిష్ఠకు భంగం కలిగించే విధంగా తప్పుగా వస్తున్న వదంతులను నమ్మవద్దని, జాతీయ భావం పెంపొందించే విధంగా సంఘీభావం తెలుపుతూ ముందుకు వచ్చిన మహిళా ప్రతినిధులకు మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ కృతజ్ఞతలు తెలిపారు

ఈ సందర్భంగా మహిళ ప్రతినిధులు మంత్రి వర్యులకు రాఖీ పౌర్ణమి సందర్భంగా రాఖీ కట్టారు.

 ఈ కార్యక్రమంలో రామచంద్రపురం పురపాలక సంఘం చైర్పర్సన్ గాదం శెట్టి శ్రీదేవి, ఆర్ డి ఓ సింధు సుబ్రహ్మణ్యం,కమీషనర్ శ్రీకాంత్ రెడ్డి, మునిసిపల్ కౌన్సిలర్లు మరియు వార్డు సచివాలయ సిబ్బంది వాలంటీర్లు పెద్ద ఎత్తున పాల్గొన్నారు

      Comments
Popular posts
అర్హులైన వారందరికీ వర్తించేలా వైయస్సార్‌ కళ్యాణమస్తు, వైయస్సార్‌ షాదీ తోఫా.
Image
శరన్నవరాత్రి మహోత్సవాల్లో ఆరవ రోజున శ్రీ కనకదుర్గమ్మ వారు శ్రీ మహాలక్ష్మి గా దర్శనమిస్తారు.
Image
శరన్నవరాత్రి మహోత్సవాల్లో ఏడవ రోజున శ్రీ కనక దుర్గమ్మ వారు శ్రీ సరస్వతి దేవి అలంకారంలో దర్శనం ఇస్తారు.
Image
అక్టోబరు 25న ఇ–క్రాపింగ్‌ జాబితాలు సచివాలయాల్లో ప్రదర్శన, షెడ్యూల్‌ వివరించిన సీఎం.
Image
భోగాపురం గ్రీన్‌ఫీల్డ్‌ అంతర్జాతీయ విమానాశ్రయం అభివృద్ధికి సహకరించాలని కేంద్ర మంత్రిని కోరిన ముఖ్యమంత్రి.
Image