ఉండి.సెప్టెంబరు.06,(ప్రజా అమరావతి);
గ్రామ సచివాలయాలు, 24×7 పిహెచ్సి లు ప్రజలకు అందుబాటులో ఉండి మంచి సేవలు అందించాల
ని, ఎక్కడా ఎటువంటి పిర్యాదు వచ్చినా అయా అధికారులు భాధ్యత వహించాలని జిల్లా కలెక్టరు శ్రీమతి పి.ప్రశాంతి అన్నారు.
మంగళ వారం ఉండి మండలం ఉండి గ్రామ సచివాలయం, 24×7 పిహెచ్సి ని జిల్లా కలెక్టరు అస్మిక తనిఖీ చేశారు.
సచివాలయం సిబ్బంది, వాలంటీర్ల హాజరును, ప్రభుత్వ పథకాలు అమలు తదితర అంశాలను జిల్లా కలెక్టరు పరిశీలించారు. ప్రభుత్వం అమలు చేస్తున్న వివిధ పథకాలకు సంబంధించి సమాచారం సక్రమంగా ప్రదర్శిస్తున్నారు లేదా వాటిని పరిశీలించారు. వివిధ సమస్యలు పై వచ్చిన ధరఖాస్తులు ఎప్పటికప్పుడు పరిశీలించి పరిష్కరించాలని ఆమె ఆదేశించారు.సచివాలయం బయట డిస్ప్లే చేసిన బోర్డులను పరిశీలించి ,ప్రభుత్వ వివిధ పథకాలు ,లబ్ధిదారుల జాబితా తప్పనిసరిగా డిస్ప్లే చేయాలని జిల్లా కలెక్టరు శ్రీమతికి పి. ప్రశాంతి అధికారులకు సూచించారు.
పీహెచ్సీలలో వైద్య సేవలు విస్తృతంగా అందించాలని అధికారులను ఆదేశించారు. హాజరు పట్టీని పరిశీలించి ,రోజుకు ఎంత మంది పేషెంట్లు వస్తున్నారు ఈ నెలలో ప్రసూతి కేసులు ఎన్ని వచ్చాయి అని జిల్లా కలెక్టరు అడిగి తెలుసుకున్నారు. అర్బన్ హెల్త్ సెంటర్లలో డాక్టర్లు సక్రమంగా రావడం లేదని ప్రజలకు సక్రమమైన వైద్య సేవలు అందడం లేదని పిర్యాదులు వస్తున్నాయని ,
డాక్టర్లు , సిబ్బంది ఖచ్చితంగా సమయానికి హాజరై ప్రజలకు వైద్య సేవలు అందించాలని కలెక్టరు శ్రీమతి పి.ప్రశాంతి ఆదేశించారు.
జిల్లా కలెక్టరు వెంట వివిధ శాఖలు అధికారులు,సచివాలయం సిబ్బంది, పి హెచ్ సి సిబ్బంది, తది తరులు పాల్గొన్నారు.
addComments
Post a Comment