ప్రజల ఆరోగ్యం కోసం గాలి కాలుష్యంను నియంత్రించాలి- సచివాలయం 5వ బ్లాక్ లో నేషనల్ క్లీన్ ఏయిర్ ప్రోగ్రాంపై సమీక్ష

- సమీక్షలో పాల్గొన్న మంత్రులు శ్రీ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, శ్రీ ఆదిమూలం సురేష్

- నేషనల్ క్లీన్ ఏయిర్ ప్రోగ్రామ్ లో మన రాష్ట్రం ముందుంజలో ఉండాలి

- నగరాలు, పట్టణాలకు ఎక్కువగా వలసలు వస్తున్నాయి.

- ప్రజల ఆరోగ్యం కోసం గాలి కాలుష్యంను నియంత్రించాలి- కాలుష్య నియంత్రణ మండలి నిర్ధేశించే అంశాలను పాటించాలి

- క్లీన్ ఎయిర్ ప్రోగ్రామ్ ను సద్వినియోగం చేసుకోవాలి

- మున్సిపల్ కమిషనర్లపై ప్రత్యేక బాధ్యత ఉంది

- నోడల్ ఆఫీసర్లు పూర్తి స్థాయిలో దృష్టి సారించాలి

- ప్రతి సిటీ, టౌన్ సోర్స్ స్టడీ యాక్షన్ ప్లాన్ సిద్దం చేసుకోవాలి

- కాలుష్యకారక హాట్ స్పాట్ లను గుర్తించాలి


: మంత్రులు శ్రీ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, శ్రీ ఆదిమూలం సురేష్


అమరావతి (ప్రజా అమరావతి):


 సచివాలయం 5వ బ్లాక్ లో నేషనల్ క్లీన్ ఏయిర్ ప్రోగ్రాంపై రాష్ట్ర పర్యావరణ శాఖ మంత్రి శ్రీ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, పట్టణాభివృద్దిశాఖ మంత్రి శ్రీ ఆదిమూలం సురేష్ లు బుధవారం సమీక్షా సమావేశం నిర్వహించారు. కాలుష్య నియంత్రణ మండలి, పట్టణాభివృద్ది శాఖ అధికారులతో పాటు వివిధ నగరాలు, పట్టణాలకు చెందిన మున్సిపల్ కమిషనర్ లు వీడియో కాన్ఫెరెన్స్ ద్వారా సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రులు  శ్రీ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, శ్రీ ఆదిమూలం సురేష్ లు మాట్లాడుతూ...


కేంద్రం ప్రభుత్వం గాలి కాలుష్యాన్ని తగ్గించడం, గాలిలో స్వచ్ఛతను పెంచేందుకు నిర్ధేశించిన నేషనల్ క్లీన్ ఎయిర్ ప్రోగ్రామ్ ను సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. దేశంలోనే క్లీన్ ఎయిర్ ప్రోగ్రామ్ లో మన రాష్ట్రం ముందంజలో ఉండేలా పనిచేయాలని పిలుపునిచ్చారు. 15వ ఆర్థిక సంఘం క్లీన్ ఎయిర్ ప్రోగ్రామ్ కోసం రాష్ట్రంలోని 13 నగరాలు, పట్టణాలను గుర్తించిందని అన్నారు. గ్రామాల నుంచి అర్భన్ ప్రాంతాలకు వివిధ కారణాల వల్ల వలసలు అధికంగా ఉంటున్నాయని, దీనివల్ల పట్టణాలు, నగరాల్లో జనాభా పెరుగుతోందని అన్నారు. అదే క్రమంలో అటు పరిశ్రమలు, ఇటు రవాణా సాధనాల వల్ల గాలిలో కాలుష్యం స్థాయిలు పెరుగుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. గ్రామీణ ప్రాంతాలతో పోలిస్తే నగరాల్లో గాలి కాలుష్యం అధికంగా ఉంటోందని, దీనిని నియంత్రించడానికి కేంద్రం ప్రభుత్వం ప్రత్యేకంగా చర్యలు చేపట్టిందని అన్నారు. కేంద్రం ద్వారా వస్తున్న నిధులను వినియోగించుకుంటూ, నగరాలు, పట్టణాల్లో కాలుష్య నియంత్రణకు అవసరమైన స్టేషన్లను ఏర్పాటు చేయాలని అన్నారు. నగరాల్లో హాట్ స్పాట్ లను గుర్తించాలని, అలాగే పారిశ్రామిక కాలుష్యంను కూడా సాధ్యమైనంత వరకు నియంత్రించే చర్యలు చేపట్టాలని ఆదేశించారు. నగరాల్లో సిటీ సోర్స్ స్టడి యాక్షన్ ప్లాన్ లను సిద్దం చేసుకోవాలని, మైక్రో లెవల్ లో దీనిని అమలులోకి తీసుకురావాలని కోరారు. అర్బన్ ప్రాంతాల్లో ప్రజల ఆరోగ్యానికి అధిక ప్రాధాన్యత ఇవ్వాలని, కాలుష్యాన్ని తగ్గించుకునే చర్యలు తీసుకోవాలని, అందుకు మున్సిపల్ కమిషనర్లు పూర్తి బాధ్యత వహించాలని కోరారు. 


ఈ సమావేశంలో కాలుష్య నియంత్రణ మండలి చైర్మన్ శ్రీ ఎకె ఫరిడా, స్పెషల్ సీఎస్ (పర్యావరణం) నీరబ్ కుమార్ ప్రసాద్, శ్రీలక్ష్మి (పట్టణాభివృద్ధి), పిసిబి మెంబర్ సెక్రటరీ విజయ్ కుమార్, వీడియో కాన్ఫెరెన్స్ ద్వారా పాల్గొన్న పలువురు మున్సిపల్ కమిషనర్లు పాల్గొన్నారు. 


Comments