తిరుమల తిరుపతి దేవస్థానముల ఆధ్వర్యంలో యూకే మరియు యూరప్ దేశాలలో శ్రీనివాస కళ్యాణోత్సవాలు



తిరుమల (ప్రజా అమరావతి);



*తిరుమల తిరుపతి దేవస్థానముల ఆధ్వర్యంలో యూకే మరియు యూరప్ దేశాలలో శ్రీనివాస కళ్యాణోత్సవాలు




*



*పత్రికా ప్రకటన విడుదల చేసిన APNRTS అధ్యక్షులు శ్రీ వెంకట్ ఎస్. మేడపాటి* 


యూకే మరియు యూరప్ దేశాలలో స్థిరపడిన  తెలుగు, భారతీయుల కోసం అక్టోబర్ 15 నుండి నవంబర్ 13వ  తేదీ వరకు పది (10) నగరాల్లో శ్రీనివాస కళ్యాణములు నిర్వహించనున్నట్లు టీటీడీ చైర్మన్ శ్రీ  వై.వి. సుబ్బారెడ్డి గారు వెల్లడించారు.  యూకే మరియు యూరప్ దేశాలలో  “శ్రీనివాస కళ్యాణోత్సవం” పోస్టర్లను తితిదే అధ్యక్షులు శ్రీ వై.వి. సుబ్బారెడ్డి, APNRTS అధ్యక్షులు శ్రీ, వెంకట్ ఎస్. మేడపాటి తిరుమలలో ఈరోజు (23.09.22) ఆవిష్కరించారు. అనంతరం శ్రీ వై.వి. సుబ్బారెడ్డి గారు  మీడియాతో మాట్లాడుతూ... గౌరవ ముఖ్యమంత్రి శ్రీ  వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి గారి ఆదేశం మేరకు కోవిడ్ తర్వాత రాష్ట్ర, దేశ, విదేశాల్లో శ్రీనివాస కళ్యాణములు నిర్వహించాలని నిర్ణయించాము. ఇందులో భాగంగా  జూన్, జూలై 2022 నెలలలో అమెరికాలోని 9 నగరాల్లో అంగరంగ వైభవంగా శ్రీ మలయప్ప స్వామి వారి కళ్యాణాలు ఆయా అసోసియేషన్ల సహకారంతో  నిర్వహించామన్నారు. అనంతరం యూకే లోని యునైటెడ్ కింగ్ డమ్ తెలుగు అసోసియేషన్ (UKTA) కోరిక మేరకు యూకే మరియు యూరప్ దేశాలలోని భక్తులకోసం తితిదే  శ్రీవారి కళ్యాణాలు నిర్వహించాలని నిర్ణయించిందన్నారు. ఏపీ రాష్ట్ర ప్రభుత్వ సంస్థ  APNRTS ఆయా నగరాల్లోని కార్యనిర్వాహకులతో సమన్వయము చేస్తోందన్నారు. 


తితిదే నియమాల ప్రకారం శ్రీవారి కళ్యాణం నిర్వహించడం జరుగుతుంది.  తిరుమల శ్రీవారి దేవస్థానం నుండి వచ్చే అర్చకులు, వేద పండితులు వైఖానస ఆగమం ప్రకారం శ్రీవారి కళ్యాణాన్ని నిర్వహిస్తారు. ఉదయం సుప్రభాత సేవతో కార్యక్రమం మొదలవుతుంది. తిరుమలలో లాగానే  శాస్త్రోక్తంగా, కళ్యాణోత్సవం నిర్వహించడం జరుగుతుంది.  యూకే మరియు యూరప్ దేశాల్లోని ఆయా  నగరాల్లో తెలుగు, భారతీయ అసోసియేషన్లు భక్తులకు అన్ని సౌకర్యాలు ఉండేలా  జాగ్రత్తలు తీసుకుంటున్నారు. కళ్యాణోత్సవం తిలకించడానికి అందరూ ఆహ్వానితులే. భక్తులందరూ స్వామి వారి కళ్యాణోత్సవాన్ని ప్రత్యక్షంగా వీక్షించి,  ఆ దేవదేవుడి ఆశీర్వాదాలు పొందాలని,  స్వయంగా తిరుమల నుంచి తెప్పించిన లడ్డూ ప్రసాదాన్ని భక్తులందరికీ అందించడం జరుగుతుందని శ్రీ సుబ్బారెడ్డి గారు తెలిపారు. 


ప్రపంచవ్యాప్తంగా సనాతన హిందూ ధర్మ ప్రచారం పెద్ద ఎత్తున నిర్వహించడానికి రాష్ట్ర ప్రభుత్వం, తితిదే సిద్ధంగా ఉన్నాయని తితిదే ఛైర్మన్ శ్రీ వై.వి. సుబ్బారెడ్డి వెల్లడించారు. 


APNRTS అధ్యక్షులు శ్రీ వెంకట్ ఎస్. మేడపాటి మాట్లాడుతూ... యూకే మరియు యూరప్ దేశాలలో దేవదేవుడైన శ్రీవారి కళ్యాణాలు నిర్వహించడానికి ఆయా నగరాల కార్యనిర్వాహక వర్గంతో ఎప్పటికప్పుడు సంప్రదింపులు జరుపుతూ, అక్కడ ఏర్పాట్లను, వారికి కావలసిన సామాగ్రి విషయంలో ఇటు తితిదే అర్చకులు, వేదపండితులతో  సమన్వయం చేస్తున్నామన్నారు. 



*యూకే మరియు యూరప్ దేశాలలో “శ్రీనివాస కళ్యాణం” జరిగే నగరాలు, తేదీలు:*


15th October, 2022             Basingstoke, UK

16th October, 2022             Manchester, UK

22nd October, 2022     Belfast, Northern Ireland, UK

23rd October, 2022             Dublin, Ireland, UK

29th October, 2022             Zurich, Switzerland, EU

30th October, 2022             Amsterdam, Netherlands, EU

05th November, 2022         Frankfurt, Germany, EU

06th November, 2022         Paris, France, EU

12th November, 2022     London, UK

13th November, 2022         Edinburgh, Scotland, UK


అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడు, కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి వారి కళ్యాణోత్సవంలో NRIలు  పాల్గొని, ఆ దేవదేవుడి కృపకు పాత్రులుకాగలరని ఆశిస్తున్నాం.  




Comments