_తనపై దుష్ప్రచారాలు చేస్తే సహించను:మాజీ మంత్రి పత్తిపాటి_

 తనపై దుష్ప్రచారాలు చేస్తే సహించను:మాజీ మంత్రి పత్తిపాటి_*



 పల్నాడు జిల్లా చిలకలూరిపేట (ప్రజా అమరావతి); ప్రతి నియోజకవర్గంలో అల్లర్లు సృష్టించడం గొడవలు పెట్టడం టిడిపి వారిపై అక్రమ కేసులు బనాయించడం వైసిపి వారికి అలవాటు అయిపోయిందని మాజీ మంత్రి పత్తిపాటి పుల్లారావు అన్నారు. ఆయన  స్వగృహంలో మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు.  విజయవాడలో టిడిపి నాయకుడు గాంధీ పై దాడి చేసి ఆయనకి ఒక కన్ను పోయేలా చేశారని ఇది దుర్మార్గపు చర్యని ఆయన తీవ్రంగా ఖండించారు. కుప్పంలో చంద్రబాబు నాయుడు సభకు అడ్డుకోవడం అక్కడ అన్న క్యాంటీలను ఏర్పాటు చేయకుండా అడ్డుకోవడం పిరికిపంద చర్యగా ఆయన అభివందించారు.  తెనాలిలో అన్న క్యాంటీన్ పెట్టకుండా అడ్డుకున్నారని... రాష్ట్రంలో అన్నిచోట్ల త్వరలో అన్న క్యాంటీన్లు ఏర్పాటు చేస్తామని మాజీ మంత్రి ప్రతిపాటి స్పష్టం చేశారు.  రాష్ట్రంలో పోలీసులు వైఎస్ఆర్సిపికి తొత్తులుగా మారారని ఆయన తీవ్రంగా విమర్శించారు._


_ఒక యూట్యూబ్ ఛానల్ లో తనపై కావాలని వైఎస్సార్సీపీ వాళ్లు పార్టీ మారుతున్నట్లు ప్రచారం  చేశారని అన్నారు. చిలకలూరిపేటలో ఒక వ్యక్తి పార్టీ కార్యాలయం ఎదుట ఆత్మహత్య యత్నం చేసిన విషయం ప్రచారం కాకుండా ప్రజల దృష్టి మరలచటానికి తనపై దుష్ప్రచారాలు  చేస్తున్నట్లు ఆయన తెలియజేశారు. తనపై తప్పుడు వార్త పెట్టిన వ్యక్తిపై యూట్యూబ్ వారికి ఫిర్యాదు చేస్తానని తెలిపారు. తాను కూడా 20 యూట్యూబ్ ఛానల్ పెడతానని చర్యకు  ప్రతిచర్య  చేయటానికి సిద్ధంగా ఉన్నానని ఆయన సవాల్ విసిరారు.  చిలకలూరిపేటలో  టిడిపి పార్టీ తరఫున ఎమ్మెల్యే  పోటీ చేస్తానని మాజీ మంత్రి పత్తిపాటి స్పష్టం చేశారు.  ఈ విషయంపై కూడా కొంతమంది కావాలని   ప్రచారం చేస్తున్నారని మాజీ మంత్రి ప్రత్తిపాటి తెలిపారు...!!_

Comments