జిల్లాలో పర్యటించిన ....
హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ బి.కృష్ణమోహన్
విజయనగరం, సెప్టెంబరు 17 (ప్రజా అమరావతి) ః
రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ బి.కృష్ణమోహన్ శనివారం జిల్లాలో పర్యటించారు. ఆయన సతీసమేతంగా రామతీర్ధం శ్రీ సీతారామస్వామి వారిని దర్శించుకున్నారు. ఆలయ పూజారులు కృష్ణమోహన్ దంపతులకు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. సీతారామస్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం యాగశాలలో ఏర్పాటు చేసిన సుదర్శన హోమం, ధన్వంతరీ హోమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్‌డిఓ సూర్యకళ, నెల్లిమర్ల తాశీల్దార్ రమణరాజు, ఆలయ ఈఓ డివివి ప్రసాదరావు, ఇతర అధికారులు పాల్గొన్నారు.
పైడిమాంబకు ప్రత్యేక పూజలు
హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ బి.కృష్ణమోహన్ దంపతులు, విజయనగరం పైడితల్లి అమ్మవారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ ఈఓ కిషోర్ కుమార్ ఆధ్వర్యంలో పూజారులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. జిల్లా కలెక్టర్ సూర్యకుమారి ఆలయం వద్ద న్యాయమూర్తిని కలిసి, శుభాకాంక్షలు తెలిపారు. పైడితల్లి సిరిమాను ఉత్సవాలకు అంకురార్పణగా వేసిన పందిరి రాటను ఇరువురూ సందర్శించారు. ఈ కార్యక్రమంలో జిల్లా న్యాయమూర్తి జస్టిస్ సాయి కల్యాణ చక్రవర్తి, అధికారులు పాల్గొన్నారు.
ః
addComments
Post a Comment