శ్రీ దుర్గామల్లేశ్వర స్వామివార్ల దేవస్థానం, ఇంద్రకీలాద్రి

 శ్రీ దుర్గామల్లేశ్వర స్వామివార్ల దేవస్థానం, ఇంద్రకీలాద్రి


(ప్రజా అమరావతి):

      ఈ రోజు ది. 12-09-2022న నేవి ముంబై కు చెందిన Recon మెరైన్స్ ప్రై.లిమిటెడ్ సంస్థకు చెందిన   శ్రీ జి.హరి కృష్ణా రెడ్డి గారు మరియు కుటుంబసభ్యులు శ్రీ కనకదుర్గ అమ్మవారి ఉత్సవ విగ్రహముల అలంకరణ నిమిత్తం సుమారు 1308 గ్రాముల బరువు గల బంగారు కిరీటములను(3 నెం.లు)  శ్రీయుత ఆలయ కార్యనిర్వహణాధికారి దర్భముళ్ల భ్రమరాంబ గారిని కలిసి దేవస్థానమునకు సమర్పించారు.  ఆలయ అధికారులు దాత కుటుంబమునకు శ్రీ అమ్మవారి దర్శనము కల్పించగా ఆలయ ప్రధానార్చకులు వీరికి వేదాశీర్వచనం చేశారు. అనంతరం కార్యనిర్వహణాధికారి వారు అమ్మవారి  శేషవస్త్రము, ప్రసాదములు మరియు చిత్రపటం అందజేశారు.

Comments