-*వైసీపీ నుంచి టిడిపిలో చేరిన యువత
*
-*పసుపు కండువాలు వేసి ఆహ్వానించిన నారా లోకేష్*
మంగళగిరి (ప్రజా అమరావతి);
గుంటూరు జిల్లా మంగళగిరి నియోజకవర్గం తాడేపల్లి టౌన్ పరిధిలో ఇస్లాంపేట, ప్రకాశ్ నగర్ ప్రాంతాలకి చెందిన వైసీపీ నేతలు రఫీ, సువర్ణ రాజు, బాలచంద్రుడు ఆధ్వర్యంలో వందమంది యువత శుక్రవారం టిడిపిలో చేరారు. ఉండవల్లి నివాసంలో టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ యువతకి పసుపుకండువాలు వేసి పార్టీలోకి ఆహ్వానించారు. వైసీపీ విధ్వంస పాలన నుంచి రాష్ట్రాన్ని కాపాడేందుకు ముందుకు వచ్చిన యువతని అభినందించారు. ఈ కార్యక్రమంలో తాడేపల్లి టౌన్ టిడిపి ప్రెసిడెంట్ వల్లభనేని వెంకటరావు, వైస్ ప్రెసిడెంట్ సాంబశివుడు, సెక్రటరీ దారదాస్,
టిడిపి ఎస్సీ సెల్ రాష్ట్ర అధికార ప్రతినిధి జుంజు మరియదాసు, గుంటూరు పార్లమెంట్ టిడిపి ఎస్సీ సెల్ కార్యదర్శి రామకృష్ణ బెజ్జం, తాడేపల్లి 7వ వార్డు టిడిపి అధ్యక్షుడు కుందుర్తి కోటేశ్వర రావు, 11వ వార్డు ఇమ్రాన్, 9వ వార్డు చిన్నారావుతోపాటు పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు.
addComments
Post a Comment