శ్రీ దుర్గామల్లేశ్వర స్వామి వార్ల దేవస్దానము, ఇంద్రకీలాద్రి
, విజయవాడ (ప్రజా అమరావతి):
ఈరోజు అనగా 12-09-2022 న, దేవస్థానము నందు అత్యంత వైభవముగా నిర్వహించు శ్రీ అమ్మవారి దేవి శరన్నవరాత్రి ఉత్సవముల ఆహ్వాన పత్రికను గౌరవనీయులైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉపముఖ్యమంత్రి వర్యులు మరియు దేవాదాయశాఖ మంత్రివర్యులు అయిన శ్రీ కొట్టు సత్యనారాయణ గారి చేతుల మీదుగా ఆవిష్కరించడం జరిగినది. ఈ కార్యక్రమం నందు రాష్ట్ర దేవాదాయ శాఖ కమిషనర్ డా.హరి జవహర్, IAS , ఆలయ కార్యనిర్వహణాధికారి దర్భముళ్ల భ్రమరాంబ , దేవాదాయ శాఖ చీఫ్ ఇంజినీర్ శ్రీ శ్రీనివాస్ , అదనపు కమీషనర్ శ్రీ చంద్ర కుమార్ , సంయుక్త కమీషనర్(ఎస్టేట్స్) శ్రీ ఆజాద్ , ఆలయ కార్యనిర్వాహక ఇంజినీర్లు శ్రీ కె.వి.ఎస్ కోటేశ్వరరావు , శ్రీమతి లింగం రమాదేవి , సహాయ కార్యనిర్వహణాధికారి శ్రీ బి. వెంకట రెడ్డి పాల్గొన్నారు.
addComments
Post a Comment