కసుమూరు గ్రామ పంచాయతీ పరిధిలో ఇల్లు లేని పేదలందరికీ ఇంటి స్థలం ఇచ్చి ఇల్లు కట్టి ఇస్తున్నాము


నెల్లూరు (ప్రజా అమరావతి);


గ్రామాల్లో మౌళిక వసతుల కల్పనకు ఒక్కొక్క సచివాలయానికి ముఖ్యమంత్రి శ్రీ వైయస్ జగన్మోహన్ రెడ్డి 20 లక్షల రూపాయల నిధులు మంజూరు చేశారని, ఈ నిధులతో గ్రామానికి అవసరమైన అభివృద్ధి పనులను ప్రాధాన్యత క్రమంలో చేపట్టనున్నట్లు రాష్ట్ర వ్యవసాయ, సహకార, మార్కెటింగ్, ఫుడ్ ప్రాసెసింగ్ శాఖ మంత్రి శ్రీ కాకాణి గోవర్ధన్ రెడ్డి పేర్కొన్నారు. 


శనివారం సాయంత్రం సర్వేపల్లి నియోజకవర్గ పరిధిలోని, వెంకటాచలం మండలం కసుమూరు గ్రామంలో మూడో రోజు గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి శ్రీ గోవర్ధన్ రెడ్డి, ప్రతి గడపకు వెళ్లి ప్రజలను ఆప్యాయంగా పలకరించారు. ఏమైనా సమస్యలు ఉన్నాయా అని అడిగి తెలుసుకుని,  ప్రభుత్వం నుంచి వారికి అందిన సంక్షేమ పథకాలను వివరించి, సంబంధిత వివరాలతో కూడిన బుక్ లెట్ ను అందచేశారు. 


ఈ సందర్భంగా మంత్రి శ్రీ గోవర్ధన్ మీడియాతో మాట్లాడుతూ కసుమూరు గ్రామ పంచాయతీ పరిధిలో ఇల్లు లేని పేదలందరికీ ఇంటి స్థలం ఇచ్చి ఇల్లు కట్టి ఇస్తున్నామ


ని, ఆరు లేఅవుట్లలో ఇంటి నిర్మాణ పనులు జరుగుతున్నాయని చెప్పారు. ప్రతి ఒక్కరికి సొంత ఇంటి కలను సాకారం చేయాలనే లక్ష్యంతో ఇళ్ల నిర్మాణాలు పట్ల ప్రత్యేక దృష్టి సారించినట్లు చెప్పారు. గడపగడపకు మన ప్రభుత్వం ఈ కార్యక్రమానికి ప్రజల నుంచి విశేష ఆదరణ లభిస్తుందని, కేవలం మొక్కుబడిగా ఈ కార్యక్రమం చేపట్టకుండా ప్రజలు సూచించిన సమస్యలు నమోదు చేసుకుని పరిష్కరించేందుకు వేగంగా చర్యలు చేపడుతున్నట్లు పేర్కొన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలను సంతృప్తికర స్థాయిలో అందించడమే ఈ కార్యక్రమ ప్రధాన ఉద్దేశమని   మంత్రి శ్రీ గోవర్ధన్ రెడ్డి తెలిపారు. పేద వర్గాల అభ్యున్నతికి  రాష్ట్ర ప్రభుత్వం అనేక సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తున్నదని, గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం సందర్భంగా ప్రజల వద్దకు వెళ్ళినప్పుడు వారు సంక్షేమ  పథకాల అమలు పట్ల సంతృప్తిని వ్యక్తం చేస్తున్నారని మంత్రి అన్నారు.

ఈ కార్యక్రమంలో ఎంపీడీవో శ్రీమతి సుస్మిత, ఎంపీపీ శ్రీమతి మందా కవిత, సర్పంచ్ శ్రీ కడివేటి శివ, మండల స్థాయి అధికారులు, స్థానిక ప్రజా ప్రతినిధులు, సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు.Comments