కె జిహెచ్ కు వచ్చు పేషెంట్లకు మంచి వైద్యం అందించడంతో పాటు రోగులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా తగు చర్యలు తీసుకోవాలి

 విశాఖ పట్నం, సెప్టెంబరు 10 (ప్రజా అమరావతి):


కె జిహెచ్ కు వచ్చు పేషెంట్లకు మంచి వైద్యం అందించడంతో పాటు రోగులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా తగు చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ డా. ఎ. మల్లిఖార్జున

వైద్యాధికారులకు సూచించారు.

శనివారం రాత్రి జిల్లా కలెక్టర్

  K G H ను ఆకస్మికంగా పరిశీలన గావించారు.  ఈ సందర్భంగా కలక్టరు కాజువాలిటి, ఎమర్జెన్సి, భావనగర్, పేడియాట్రిక్ వార్డులను  పరిశిలించి అక్కడ రోగుల తో మాట్లాడారు.


 Kgh లోని  వెయిటింగ్ హల్ లో ఉంటున్న పేషెంట్ల అటెండెంట్ లకు లగేజ్ లు పెట్టుకోవటానికి  కప్ బోర్డ్ లు,  చార్జింగ్ పాయింట్ లు, దోమ తెరలు ఏర్పాటు చేయాలని కలక్టరు సూచించారు.


వార్డ్ బాయ్స్ కు డ్రెస్ కోడ్ తప్పని సరిగా అమలు చేయాలన్నారు.

టాయ్లెట్ లను  నిత్యం ఎప్పటి కప్పుడు క్లీన్ చేసి శుభ్రంగా ఉంచాలని ఆదేశించారు.

Comments