చేపలు సహా మత్స్య అనుబంధ రంగాల అహారం గురించి ప్రజల్లో మరింత అవగాహన కల్పించేందుకు కృషి జరగాల్సిన అవసరం ఉంది

 

నెల్లూరు (ప్రజా అమరావతి);చేపలు సహా మత్స్య అనుబంధ రంగాల అహారం గురించి ప్రజల్లో మరింత అవగాహన కల్పించేందుకు కృషి జరగాల్సిన అవసరం ఉంద


ని కేంద్ర పశుసంవర్థక, మత్స్య, సమాచార ప్రసార శాఖల సహాయమంత్రి శ్రీ ఎల్. మురుగన్ తెలిపారు. అంత్యోదయ స్ఫూర్తి సమాజంలోని అన్ని వర్గాల అభ్యున్నతి కోసం ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం పని చేస్తోందన్న ఆయన, ముఖ్యంగా మత్స్యకారుల అభివృద్ధి కోసం కేంద్రం ప్రత్యేక చొరవ తీసుకుంటోందని పేర్కొన్నారు.ఆదివారం ఉదయం నెల్లూరులోని వి.ఆర్.సి. గ్రౌండ్స్ లో మత్స్యకార సహకార సమితి ఏర్పాటు చేసిన ఫిష్ ఫుడ్ ఫెస్టివల్ ను కేంద్ర పశుసంవర్థక, మత్స్య, సమాచార ప్రసార శాఖల సహాయమంత్రి శ్రీ ఎల్. మురుగన్ ప్రారంభించారు. అనంతరం ఇక్కడ ఏర్పాటు చేసిన ప్రకృతి వ్యవసాయ ఉత్పత్తుల ప్రదర్శన మరియు అమ్మకం స్టాల్స్ ను ఆయన పరిశీలించారు. స్టాల్స్ వద్ద ఉత్పత్తులను నిశితంగా  కేంద్ర మంత్రి పరిశీలించి వివిధ ఉత్పత్తుల గురించి అడిగి తెలుసుకున్నారు.  ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన సభలో కేంద్ర మంత్రి శ్రీ మురుగన్ మాట్లాడుతూ, మత్స్య ఆహారం పట్ల ప్రజల్లో మరింత అవగాహన పెంచాల్సిన అవసరం ఉందన్నారు.  అంత్యోదయ స్ఫూర్తితో మత్స్యకారుల అభివృద్ధి కోసం కేంద్ర ప్రభుత్వం కృషి చేస్తోందని, మత్స్యపరిశ్రమ కోసం మంత్రిత్వశాఖను ఏర్పాటు చేసిన ప్రధానమంత్రి శ్రీ నరేంద్రమోదీ చొరవ మరువలేనిదన్నారు. గత కొన్నేళ్ళలో మత్స్య ఎగుమతుల పెరుగుదలలో ఆంధ్రప్రదేశ్ మత్స్యకారుల కృషి ప్రశంసనీయమైనదని, ఆంధ్రప్రదేశ్ లోని విశాఖపట్నంలో 100 కోట్లతో ప్రపంచ స్థాయి సౌకర్యాలతో ఫిషింగ్ హార్బర్ ఏర్పాటు జరిగిందని కేంద్ర మంత్రి తెలిపారు.  సబ్ కా సాత్... సబ్ కా వికాస్ స్ఫూర్తితో ముందుకు సాగుతూ గత 8 ఏళ్ళలో మత్స్యపరిశ్రమ అభివృద్ధి కోసం 32 వేల కోట్లను కేంద్రం ఖర్చు చేసిందని తెలిపారు. కరోనా సమయంలో అన్ని రంగాలు ఇబ్బందుల్లో ఉన్నప్పుడు కేంద్రం 20 వేల కోట్లతో మత్స్యకారుల అభ్యున్నతి కోసం కృషి చేసిందని పేర్కొన్నారు. ప్రత్యేకించి కోటి 20 లక్షల విలువైన డీప్ సీ వెజల్స్ ను 60 శాతం సబ్సిడీతో అందిస్తూ మత్స్య ఉత్పత్తుల అభివృద్ధి కోసం పాటు పడుతుందని పేర్కొన్నారు. ప్రపంచంలో మత్స్యపరిశ్రమ ఎగుమతుల్లో గత కొన్నేళ్ళలో భారతదేశం గణనీయమైన అభివృద్ధి సాధించిందన్న  కేంద్ర మంత్రి , 30 శాతం మేర ఎగుమతులు పెరిగాయని తెలిపారు. ఇందులో ఆంధ్రప్రదేశ్ మత్స్యకారుల కృషి మరింత ఉన్నతమైందన్న ఆయన, వారి నిబద్ధత, కష్టపడే తత్త్వం కారణంగా అనుకున్న లక్ష్యాలను త్వరగా చేరుకోగలిగామని అభిప్రాయపడ్డారు. అందుకే ఆంధ్రప్రదేశ్ లో మత్స్య రంగ అభివృద్ధి కోసం కేంద్రం అనేక కార్యక్రమాలు చేపడుతోందన్న ఆయన, విశాఖపట్నంలో ప్రపంచ స్థాయి సౌకర్యాలతో కేంద్ర ప్రభుత్వ సహకారంతో ఏర్పాటైన ఫిషింగ్ హార్బర్ ఆంధ్రప్రదేశ్ కే మకుటాయమానమని తెలిపారు.  అన్ని వర్గాల అభ్యున్నత కోసం కేంద్ర ప్రభుత్వ చేపడుతున్న కార్యక్రమాల్లో ప్రజా భాగస్వామ్యం మరింత ఆవశ్యకమన్న శ్రీ మురుగన్ ప్రత్యేకించి మహిళలు, వెనుకబడిన వర్గాలకు కేంద్ర అందిస్తోన్న పథకాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. నెల్లూరులో ఫిష్ ఫుడ్ ఫెస్టివల్ పేరిట మత్స్య అనుబంధ రంగాల ఆహారం పట్ల అవగాహన కల్పించేందుకు చొరవ తీసుకున్న మత్స్యకార సంక్షేమ  సమితి సభ్యులను ఆయన ప్రత్యేకంగా అభినందించారు. కార్యక్రమంలో భాగంగా తెలుగు భాషలో రూపొందించిన ప్రధానమంత్రి మత్స్యసంపద యోజన వివరాలకు సంబంధించిన పుస్తకాన్ని ఆయన ఆవిష్కరించారు.


ఈ కార్యక్రమంలో  జిల్లా జాయింట్ కలెక్టర్ శ్రీ ఆర్. కూర్మనాథ్, నెల్లూరు ఆర్.డి.ఓ శ్రీ మాలోల, మత్స్య శాఖ జాయింట్ డైరెక్టర్ శ్రీ నాగేశ్వర రావు,  మత్స్యకార సంక్షేమ సమితి రాష్ట్ర అధ్యక్షులు శ్రీ కోలంగారి పోలయ్య, నెల్లూరు జిల్లా అధ్యక్షులు శ్రీ సామంజి 

మురళి, జలనిధి ఫెడరేషన్ చైర్మన్ శ్రీ కదిరి  పోలరాజు, భారతీయ జనతా పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు శ్రీ సురేందర్ రెడ్డి సహా ఆంధ్రప్రదేశ్ మత్స్యశాఖకు, నెల్లూరు జిల్లాకు చెందిన పలువురు అధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.


Comments