నెల్లూరు, సెప్టెంబర్ 7 (ప్రజా అమరావతి): విద్యతోనే గిరిజనుల అభివృద్ధి సాధ్యమని, ఆ దిశగా గిరిజన విద్యార్థులందరూ కష్టపడి చదివి తమ తల్లిదండ్రులకు, సమాజానికి మంచి గుర్తింపు తీసుకురావాల
ని రాష్ట్ర ఎస్టీ కమిషన్ చైర్మన్ శ్రీ కుంభా రవిబాబు పిలుపునిచ్చారు.
బుధవారం ఉదయం కొడవలూరు మండలం చంద్రశేఖరపురం గ్రామంలోని ఏకలవ్య గురుకుల పాఠశాలలో ప్రతిభా పురస్కారాల పంపిణీ కార్యక్రమంలో చైర్మన్ పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో విద్యాభివృద్ధికి ముఖ్యమంత్రి ఎంతో కృషి చేస్తున్నారని, నాడు నేడు పథకం కింద పాఠశాలల్లో మౌలిక వసతుల కల్పనకు పెద్ద పీట వేస్తున్నారన్నారు. గురుకుల పాఠశాలలోని గిరిజన విద్యార్థులందరూ తమ కుటుంబ పరిస్థితులను అర్థం చేసుకొని బాగా చదివి ఉన్నత స్థానాలు అధిరోహించాలని సూచించారు. ఈ గురుకుల పాఠశాలలో మౌలిక వసతుల కల్పనకు కృషి చేస్తానన్నారు.
అనంతరం పాఠశాలలో విద్యార్థుల సంఖ్య, వసతిగృహంలో విద్యార్థులకు కల్పిస్తున్న సౌకర్యాలను ప్రిన్సిపాల్ శ్రీమతి విష్ణు ప్రియ కమిషన్ సభ్యులకు వివరించారు.
తదుపరి పదో తరగతిలో ఉత్తమ మార్కులు సాధించిన విద్యార్థినులకు ప్రతిభా పురస్కారాలను ప్రదానం చేశారు.
ఈ కార్యక్రమంలో కమిషన్ సభ్యులు శ్రీ వడిత్యా శంకర్ నాయక్, శ్రీ మురళి, ఐటీడీఏ పీవో శ్రీ మందా రాణి, ఆర్డిఓ శీనానాయక్, ఐటిడిఎ డివో శ్రీ శ్రీనివాసులు, గురుకుల పాఠశాల ప్రిన్సిపాల్ విష్ణు ప్రియ, వార్డెన్ పద్మ, పాఠశాల అధ్యాపకులు, సిబ్బంది పాల్గొన్నారు.
addComments
Post a Comment