తాడేపల్లి (ప్రజా అమరావతి);
గుంటూరు జిల్లా స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో వారి ఆధ్వర్యంలో K.L. యూనివర్సిటీ, వడ్డేశ్వరం నందు నిషేధిత మత్తు పదార్థాల (Drugs) వినియోగం, వాటి వలన కలుగు దుషప్రభావాల గురించి అవగాహన సదస్సు
జరిగినది. సదరు కార్యక్రమానికి SEB డైరెక్టర్ శ్రీయుత A.రమేష్ రెడ్డి, IPS ముఖ్య అతిథిగా హాజరయ్యారు. సదరు కార్యక్రమానికి SEB గుంటూరు జల్లా Addl.SP శ్రీ DN మహేష్ , Superintendent శ్రీమతి N. అన్నపూర్ణ AES శ్రీ K. Manikanta , Mangalagiri SEB ఇన్స్పెక్టర్ శ్రీ E. మారయ్య బాబు , SEB ఇన్స్పెక్టర్ శ్రీ TP నారాయణ స్వామి తదితర అధికారులు హాజరయ్యారు. సదరు కార్యక్రమం నందు SEB Toll Free No.14500 గల Wall Poster (గోడ పత్రిక) ను ఆవిష్కరించి, నిషేధిత మత్తు పదార్థాల (Drugs) వినియోగం, వాటి వలన కలుగు దుష్ప్రభావాల గురించి మరియు NDPS చట్టం గురించి విద్యార్థులకు అవగాహన కలిగించినారు. మరియు అక్రమ మద్యం, నాటు సారా, గంజాయి మొదలగు మత్తు పదార్థాలు, ఇసుక అక్రమ రవణా, జూదము మొదలగు వాటి గురించిన సమాచారమును 14500 టోల్ ఫ్రీ నెంబర్ కు తెలియజేయ వలసినదిగా తెలిపినారు.
addComments
Post a Comment