సర్వీసులను పెండింగ్ ఉంచరాదు*
*: ప్రభుత్వ పథకాలను అర్హులైన లబ్ధిదారులకు అందించాలి*
*: ఉద్యోగులు బయోమెట్రిక్ అటెండెన్స్ నమోదు తప్పనిసరిగా సకాలంలో చేయాలి*
*: జిల్లా కలెక్టర్ బసంత్ కుమార్*
*కదరి మండలం లోని కొండ మనేని పాళ్యం, మోటు కపల్లి గ్రామ సచివాలయాలను, ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్..*
కదిరి, అక్టోబర్ 25 (ప్రజా అమరావతి):
*సచివాలయాలకు వస్తున్న సర్వీసులను ఎలాంటి పెండింగ్ ఉంచకుండా గడువులోగా పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ బసంత్ కుమార్ సచివాలయ ఉద్యోగులను ఆదేశించారు. మంగళవారం
కదరి మండలం లోని కొండ మనేని పాళ్యం, మోటుక పల్లి గ్రామ సచివాలయాలను జిల్లా కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు.*
*ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ సచివాలయానికి వస్తున్న ప్రతి సర్వీసులను ఎప్పటికప్పుడు పరిష్కరించాలన్నారు. సర్వీసులను ఎలాంటి పెండింగ్ ఉంచరాదన్నారు. ప్రభుత్వ పథకాలను అర్హులైన లబ్ధిదారులకు అందించేందుకు ఉద్యోగులు శ్రద్ధ పెట్టి పని చేయాలన్నారు. ఉద్యోగులు బయోమెట్రిక్ అటెండెన్స్ నమోదును తప్పనిసరిగా సకాలంలో చేయాలన్నారు. పూర్తిగా 100 శాతం అటెండెన్స్ నమోదు చేయాలని సూచించారు. సచివాలయాల పరిధిలోని పాఠశాలలను తనిఖీ చేయాలని, మధ్యాహ్న భోజనం కింద విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించేలా చూడాలని, ఆయా సచివాలయాల పరిధిలో చేపడుతున్న ప్రభుత్వ ప్రాధాన్యత భవన నిర్మాణాలను గడువులోగా పూర్తి చేసేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. . సచివాలయ ఉద్యోగులు సమయానికి సచివాలయానికి రావాలని, మధ్యాహ్నం కూడా అందుబాటులో ఉండాలని జిల్లా కలెక్టర్ ఆదేశించారు. ఉద్యోగులు బాధ్యతగా విధులను నిర్వహించాలని సూచించారు. ఈ శ్రామ నమోదు ప్రక్రియ వేగవంతం చేయాలని తెలిపారు. బడి మానేసిన పిల్లలను గుర్తించి వారిని బడిలో చేర్పించాలని సిబ్బందిని ఆదేశించారు. ప్రతిరోజు మధ్యాహ్నం మూడు గంటల నుండి సాయంత్రం ఐదు గంటల వరకు స్పందన కార్యక్రమం చేపట్టాలని ఆదేశించారు. ఈనెల 25వ తేదీ నుండి 31 తేదీ వరకు పాఠశాల విద్యార్థుల కొరకు ఆయా సచివాలయాల్లో ప్రత్యేక ఆధార్ డ్రైవ్ చేపట్టాలని తెలిపారు.
*ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ఆయా సచివాలయాలలో రిజిస్టర్లను తనిఖీ చేశారు. ఈ కార్యక్రమంలో, ఆర్ డి ఓ రాఘవేంద్ర,ఇంచార్జి తహసీల్దార్, ముకుంద, ఎంపీడీవో సుధామణి, వివిధ శాఖల అధికారులు, సచివాలయ ఉద్యోగులు, తదితరులు పాల్గొన్నారు.
addComments
Post a Comment