రామచంద్రపురం (ప్రజా అమరావతి);
గడప గడపకు మన ప్రభుత్వం లో భాగంగా స్థానికులు రోడ్డు, డ్రైనేజీ, మంచినీటి సమస్యలు గురించి ప్రస్తావిస్తున్నారని వీటిని పరిష్కరించే విధంగా తగు ప్రతిపాదనలు చెస్త్తునట్లు రాష్ట్ర బిసి సంక్షేమం, సమాచార , సినిమాటోగ్రఫీ శాఖామాత్యులు చెల్లు బోయిన శ్రీనివాస్ వేణు గోపాల కృష్ణ తెలిపారు.
రామచంద్రపురం నియోజకవర్గం పరిధిలోని రామచంద్రపురం పురపాలక సంఘం రైలు గట్టు వీధి లో గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో మంత్రి మంగళవారం పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రామ చంద్ర పురం పురపాలక సంఘం పరిధిలో ని రైలు గట్టు వీధిలో స్థానికంగా ఉన్న సమస్యలను పరిష్కరించే విధంగా చూడాల
ని మునిసిపల్ కమిషనర్ శ్రీకాంత్ రెడ్డి సూచించారు.
ప్రజా సంక్షేమమే ధ్యేయంగా అవినీతి లేని పాలనే లక్ష్యంగా ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి పాలన అందిస్తున్నారన్నరు. ప్రతి ఇంటికి ప్రతి ఒక్కరికి ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలు చేరాలని లక్ష్యంతో ఈ ప్రభుత్వం పనిచేస్తుందని ఆయన అన్నారు.
ఈ సందర్భంగా మంత్రి గడపగడపకు తిరుగుతూ ప్రభుత్వపరంగా అందుతున్న లబ్ధి వారు వినియోగిస్తున్న తీరు తో పాటు సమస్యలు ఏమైనా ఉంటే అడిగి తెలుసుకున్నారు.
అర్హులైన ప్రతి ఒక్కరికి ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందించడమే ప్రభుత్వ లక్ష్యం అని అన్నారు
ఈ పథకాల ద్వారా లబ్ధి పొందిన లబ్ధిదారులు పసలాపూడి దుర్గ జగనన్న విద్యాదివేన..3,904 వైస్సార్ ఆసరా 5,560, జగనన్న వసతి దీవెన..20,000Y
వైస్సార్ సున్నా ఓడ్డి 4,694,ఇంటిస్థలం 6,00,000,
మొత్తం 6,34,158 రూపాయలు లబ్ధి పొందామని ఈ పథకాల ద్వారా మాకు మా కుటుంబ సభ్యులకు చాలా ప్రయోజనం కలిగిందని దాంతోపాటు సంతోషంగా జీవిస్తున్నామని లబ్ధిదారులు వివరించారు. అనంతరం మంత్రి నేరుగా లబ్ధిదారులతో మాట్లాడుతూ వారికి అందుతున్న ఇన్పుట్ సబ్సిడీ, వైఎస్సార్ రైతు భరోసా, సున్నా వడ్డీ, అమ్మ ఒడి, ఆసరా, పెన్షన్, కాపు నేస్తం తదితర సంక్షేమ పథకాల ద్వారా అందుతున్న తీరును అడిగి తెలుసుకుని, సంతృప్తి వ్యక్తం చేశారని మంత్రి తెలిపారు.
ఈ కార్యక్రమంలో పురపాలక సంఘం చైర్మన్ గా దం శెట్టి శ్రీదేవి, కమీషనర్ శ్రీ కాంత్ రెడ్డి, స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు, సచివాలయ సిబ్బంది ,వాలంట్రీలు, లబ్ధిదారులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
addComments
Post a Comment