ఈ క్రాప్ చేయించుకుంటేనే ధాన్యం కొనుగోలు జెడ్‌పి ఛైర్‌ప‌ర్స‌న్ మ‌జ్జి శ్రీ‌నివాస‌రావు



ఈ క్రాప్ చేయించుకుంటేనే ధాన్యం కొనుగోలు

జెడ్‌పి ఛైర్‌ప‌ర్స‌న్ మ‌జ్జి శ్రీ‌నివాస‌రావు


లంఫిస్కిన్ వ్యాధి నివార‌ణ‌కు విస్తృతంగా టీకా కార్య‌క్ర‌మం

వ్య‌వ‌సాయ స‌ల‌హామండ‌లి స‌మావేశంలో నిర్ణ‌యం


విజ‌య‌న‌గ‌రం, అక్టోబ‌రు 01. (ప్రజా అమరావతి) ః

              పంట‌ను ఈ క్రాప్ చేయించుకుంటేనే, వారివ‌ద్ద‌నుంచి ధాన్యం కొనుగోలు జ‌రుగుతుంద‌ని జెడ్‌పి ఛైర్మ‌న్ మ‌జ్జి శ్రీ‌నివాస‌రావు అన్నారు. జిల్లా వ్య‌వ‌సాయ స‌ల‌హా మండ‌లి స‌మావేశం శ‌నివారం క‌లెక్ట‌రేట్ ఆడిటోరియంలో జ‌రిగింది. ఈ స‌మావేశంలో వ్య‌వ‌సాయ‌, ప‌శు సంవ‌ర్థ‌క‌శాఖ‌కు చెందిన ప‌లు అంశాల‌పై చ‌ర్చించి, నిర్ణ‌యాలు తీసుకున్నారు. జిల్లా వ్య‌వ‌సాయాధికారి తార‌క‌రామారావు ముందుగా స‌మావేశ‌పు అజెండాను వివ‌రించారు. జిల్లాలో శ‌త‌శాతం ఈ క్రాప్ పూర్తి అయ్యింద‌ని, శ‌నివారంతో ఈ ప్ర‌క్రియ ముగుస్తుంద‌ని చెప్పారు.


             ఛైర్మ‌న్ మ‌జ్జి శ్రీ‌నివాస‌రావు మాట్లాడుతూ, ప్ర‌తీ పంట‌నూ ఈ క్రాప్ చేయాల‌ని సూచించారు. ప్ర‌భుత్వ నిబంధ‌న‌ల ప్ర‌కారం ఈ క్రాప్ న‌మోదు జ‌రిగితేనే, వారి ద‌గ్గ‌ర‌నుంచి ధాన్యం కొనుగోలు చేయ‌డం జ‌రుగుతుంద‌ని ఆయ‌న స్ప‌ష్టం చేశారు. నెల రోజుల‌ముందే జిల్లాలో ఉబాలు పూర్తి అయ్యాయ‌ని, దానికి అనుగుణంగానే ధాన్యం కొనుగోలు ప్ర‌క్రియ‌ను ప్రారంభించాల‌ని సూచించారు. రైతులు ద‌ళారుల‌ను న‌మ్మి మోస‌పోకుండా, త‌గిన చ‌ర్య‌ల‌ను చేప‌ట్టాల‌ని అన్నారు. లంఫిస్కిన్ వ్యాధిపై ప్ర‌జ‌ల్లో భ‌యాందోళ‌న‌లు తొల‌గించి,  సంపూర్ణ అవ‌గాహ‌న క‌ల్పించాల‌ని సూచించారు.


             క‌లెక్ట‌ర్ ఎ.సూర్య‌కుమారి మాట్లాడుతూ, ఈ క్రాప్ చేసిన పంట‌ల వివ‌రాల‌ను ప్ర‌ద‌ర్శించ‌డ‌మే కాకుండా, జాబితాల‌ను గ్రామాల్లో రైతుల‌కు చ‌దివి వినిపించాల‌ని, దానిని రికార్డు చేయాల‌ని సూచించారు. అలాగే ప్ర‌తీ పంట‌కూ ఈ క్రాప్ జ‌రిగిన‌ట్లు, రైతుల‌కు ర‌సీదుల‌ను అంద‌జేయాల‌ని ఆదేశించారు. అర్హ‌త ఉన్న ప్ర‌తీ రైతుకు పంట రుణం మంజూరు చేయాల‌ని అన్నారు. మొక్క‌జొన్న రైతులు, డ్రైయ్య‌ర్స్ కొనుగోలుకు బ్యాంకుల ద్వారా ఇప్పించేందుకు ప్ర‌య‌త్నించాల‌ని సూచించారు. మిల్ల‌ర్ల కార‌ణంగా, రైతులు న‌ష్ట‌పోకుండా ఉండేందుకే, ధాన్యం కొనుగోలు ప్ర‌క్రియ‌లో ప్ర‌భుత్వం ప‌లు మార్పుల‌ను తీసుకువ‌చ్చింద‌ని క‌లెక్ట‌ర్ స్ప‌ష్టం చేశారు.


              ఎంపి బెల్లాన చంద్ర‌శేఖ‌ర్ మాట్లాడుతూ, ఈ క్రాప్ న‌మోదు చేసేట‌ప్పుడు, ప‌క్క గ్రామంలో పొలాలు ఉన్న రైతులు ఇబ్బంది ప‌డుతున్నార‌ని చెప్పారు. వీరి స‌మ‌స్య‌ల‌ను దృష్టిలో పెట్టుకొని త‌గిన ఆదేశాల‌ను ఇవ్వాల‌ని కోరారు.


              జిల్లా వ్య‌వ‌సాయ స‌ల‌హా మండ‌లి ఛైర్మ‌న్ గేదెల వెంక‌టేశ్వ‌ర్రావు మాట్లాడుతూ, మొక్క‌జొన్న రైతుల‌కు డ్రైయ‌ర్స్ స‌ర‌ఫ‌రా చేయాల‌ని కోరారు. డ్రైయ్య‌ర్స్ లేక‌పోవ‌డం వ‌ల్ల రైతులు న‌ష్ట‌పోతున్నార‌ని చెప్పారు. డ్రైయ‌ర్స్‌తో బాటు ఆయిల్ ఇంజ‌న్ల‌ను కూడా రైతు సంఘాల‌కు అంద‌జేయాల‌ని సూచించారు.


లంఫిస్కిన్ వ్యాధి నివార‌ణ‌కు టీకా కార్య‌క్ర‌మం

              లంఫిస్కిన్ వ్యాధి (ముద్ద చ‌ర్మ‌వ్యాధి) నివార‌ణ‌కు జిల్లాలో టీకా కార్య‌క్ర‌మాన్ని ముమ్మ‌రంగా నిర్వ‌హిస్తున్నామ‌ని, జిల్లా ప‌శు సంవ‌ర్థ‌క శాఖాధికారి డాక్ట‌ర్ వైవి ర‌మ‌ణ చెప్పారు. ఇప్ప‌టివ‌ర‌కు జిల్లాలో సుమారు ల‌క్షా,20వేల ప‌శువుల‌కు టీకా వేయ‌డం జ‌రిగింద‌న్నారు. విశాఖ డెయిరీ ద్వారా మ‌రో 20వేల ప‌శువుల‌కు టీకా వేశార‌ని, ఇంకో ల‌క్షా, 20వేల డోసుల‌ను తెప్పించి, జిల్లాలోని అన్ని ప‌శువుల‌కు టీకాలు వేస్తామ‌ని చెప్పారు. ఈ వ్యాధి కార‌ణంగా ఇప్ప‌టివ‌ర‌కు జిల్లాలో ఒక్క ప‌శువు కూడా మ‌ర‌ణించ‌లేద‌ని స్ప‌ష్టం చేశారు. ఎక్కువ‌గా తెల్ల ప‌శువుల్లోనే ఈ వ్యాధి క‌నిపిస్తోంద‌న్నారు. వ్యాధి వ్యాప్తిని అరిక‌ట్టేందుకు, ప‌శు ర‌వాణాను, సంత‌ల‌ను నిషేదించ‌డం జ‌రిగింద‌ని వెళ్ల‌డించారు. ఈ వ్యాధి సోకిన ప‌శువుల పాల‌ను త్రాగిన‌ప్ప‌టికీ ఎటువంటి ప్ర‌మాదం లేద‌ని, పాల ద్వారా వ్యాధి సోక‌ద‌ని ఆయ‌న స్ప‌ష్టం చేశారు.


               స‌మావేశంలో ఎంఎల్సీ ఇందుకూరి ర‌ఘురాజు, డిసిఎంఎస్ ఛైర్‌ప‌ర్స‌న్ అవ‌నాపు భావ‌న‌, జాయింట్ క‌లెక్ట‌ర్ మ‌యూర్ అశోక్‌, వివిధ శాఖ‌ల అధికారులు, స‌ల‌హా మండ‌లి స‌భ్యులు పాల్గొన్నారు.


Comments
Popular posts
ఉత్తరాఖండ్‌ అసెంబ్లీ సెక్రటేరియట్‌లోని 228 మంది ఉద్యోగులను డిస్మిస్‌ చేస్తూ హైకోర్టు నిర్ణయం సరైనదేనని పేర్కొంది.
Image
ఇంటర్నెట్‌లో గూగుల్ సెర్చ్‌లో సైబర్ క్రైమ్ కేసులు పెరుగుతున్నాయి.
Image
న్యాయప్రక్రియకు..రాజ్యాంగపరమైన చట్టాలకు లోబడి వికేంద్రీకరణ చేయబోతున్నాం.
Image
*ఆంథ్ర రత్న జయంతి జూన్ 2* *స్వాతంత్ర్య పోరాటయోధుడు, ఉపాధ్యాయుడు,చీరాల పేరాల ఉద్యమనాయకుడు గాంధేయవాది మన తెలుగువాడు ఆంధ్రరత్న దుగ్గిరాల గోపాలకృష్ణయ్య జయంతి జూన్ 2.* *కృష్ణా జిల్లా, పెనుగంచిప్రోలు గ్రామంలో 1889 జూన్ 2 న దుగ్గిరాల గోపాలకృష్ణయ్య జన్మించాడు. ఆయన పుట్టిన మూడవ రోజునే తల్లి సీతమ్మ, మూడో ఏట తండ్రి కోదండ రామస్వామి మరణించారు. అప్పటినుండి పినతండ్రి, నాయనమ్మల సంరక్షణలో పెరిగాడు. కూచిపూడిలోను, గుంటూరులోను ప్రాథమిక విద్య జరిగింది. హైస్కూలులో చదివే సమయంలోనే 'జాతీయ నాట్య మండలి' స్థాపించి సంగీత, నాటక కార్యక్రమాలు నిర్వహించాడు. అయితే చదువుపై అంత శ్రద్ధ చూపకపోవడంచేత మెట్రిక్యులేషనులో తప్పాడు. తరువాత బాపట్ల లో చదివి ఉత్తీర్ణుడయ్యాడు*. *నడింపల్లి వెంకటలక్ష్మీ నరసింహారావు అనే ఒక మిత్రుని సాయంతో 1911లో స్కాట్లండు లోని ఎడింబరో విశ్వ విద్యా లయంలో ఎం.ఎ. చదివాడు*. *తరువాత ఆనంద కుమార స్వామి తో కలసి కొంతకాలం పనిచేశాడు. ఆ సమయంలో 'నందికేశ్వరుడు' రచించిన 'అభినయ దర్పణం' అనే గ్రంథాన్ని “The Mirror of Gesture,” అన్న పేరుతో సంస్కృతం నుండి ఆంగ్లంలోకి అనువదించాడు. ఇది 1917లో 'కేంబ్రిడ్జ్ - హార్వర్డ్ యూనివర్శిటీ ప్రెస్' వారిచే ప్రచురించబడింది.* *తిరిగివచ్చాక, రాజమండ్రి లోను, బందరు లోను కొంతకాలం ఉపాధ్యాయుడిగా పనిచేసాడు. తన స్వతంత్ర భావాల కారణంగా పైవారితో పడక ఆ ఉద్యోగాలు వదలిపెట్టాడు. తరువాత గోపాల కృష్ణయ్య స్వాతంత్ర్య సంగ్రామం లో దూకాడు*. *బ్రిటీష్ ప్రభుత్వం 1919లో చీరాల-పేరాల గ్రామాలను కలిపి పురపాలక సంఘంగా చేయడంతో ప్రజలపై పన్నుల భారం అధికమై పురపాలక సంఘం రద్దు చేయాలని ఉద్యమించారు. ప్రస్తుతం ప్రకాశం జిల్లా లో ఉన్న చీరాల, పేరాల గ్రామాల జనాభా ఆ కాలంలో 15000. జాండ్రపేట, వీరరాఘవపేట గ్రామాలను చీరాల, పేరాలతో కలిపి చీరాల యూనియన్ అని వ్యవహరించే వారు. ఈ యూనియన్ నుంచి ఏడాదికి నాలుగు వేల రూపాయలు వసూలయ్యేవి. మద్రాసు ప్రభుత్వం 1919 లో చీరాల-పేరాలను మున్సిపాలిటీగా ప్రకటించింది. పన్ను ఏడాదికి 40,000 రూపాయలయ్యింది. సౌకర్యాలు మాత్రం మెరుగు పడలేదు. ఇక్కడ ఉన్న నేతపని వారు, చిన్నరైతులు పన్ను చెల్లించలేక మున్సిపాలిటీని రద్దు చేయాలని ప్రభుత్వానికి ఎన్నో వినతి పత్రాలు సమర్పించారు. ఫలితం లేదు. దాంతో వారు దుగ్గిరాల గోపాలకృష్ణయ్య నాయకత్వంలో ఆందోళన ప్రారంభించారు. ఇది స్వాతంత్ర్య పోరాటంలో ఒక ముఖ్యమైన ఘట్టం. ఆంధ్ర దేశం అంతా తిరిగి బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా ప్రచారం చేశాడు. నిషేధాన్ని ఉల్లంఘించి బరంపురంలో ఉపన్యాసం చేసినందుకు ఒక సంవత్సరం పాటు జైలు శిక్ష అనుభవించాడు.చీరాల పేరాల ఉద్యమం -మద్రాస్ ప్రసిడెన్సీని కంపింపజేసింది.. ఆ ఉద్యమం మిగతా ప్రాంతాలకు వ్యాపిస్తుందేమోనని ఆంగ్లేయపాలకులు భయకంపితులయినారు..చివరికి జాతీయకాంగ్రీసు జోక్యంతో ఉద్యమం ముగిసింది...* *తెలుగు నాట జానపద కళా రూపాల పునరుద్ధరణకు, గ్రంథాలయాల వ్యాప్తికి గోపాలకృష్ణయ్య ఇతోధికంగా కృషి చేశాడు. 'సాధన' అనే పత్రిక నడిపాడు*. *ఆయన ప్రచారం చేసిన జానపద కళారీతులు - తోలుబొమ్మలాట, జముకుల కథ, బుర్రకథ, వీధి నాటకాలు, సాము గరిడీలు, గొల్ల కలాపం, బుట్ట బొమ్మలు, కీలు గుర్రాలు, వాలకాలు, గోసంగి, గురవయ్యలు, సరదా కథ, కిన్నెర కథ, కొమ్ము బూర,జోడు మద్దెల, పల్లె సుద్దులు, తూర్పు భాగోతం, చుట్టు కాముడు, పిచ్చికుంట్లవాళ్ళ కథ, సాధనా శూరులు, పలనాటి వీర విద్యావంతులు - వగైరా* *గోపాలకృష్ణయ్య నియమ తత్పరుడు. 'శ్రీరామదండు' అనే ఆధ్యాత్మిక, జాతీయతా స్వచ్ఛంద సమూహాన్ని ఏర్పాటు చేశాడు.* *1921 లో గుంటూరులో ఒక సభలో "ఆంధ్ర రత్న" అన్న బిరుదుతో ఆయనను సత్కరించారు.* *ఈ మహనీయుని త్యాగాలకు తెలుగుజాతి సర్వదా ఋణపడివుంది*. *ఉపాధ్యాయ సేవా కేంద్రం,విజయవాడ*
Image
ఒక్క ఇల్లూ కట్టని చిన్న సైకో ఆర్కే ఇళ్లు కూల్చేస్తున్నాడు
Image