సాంకేతిక కారణాల వల్ల ఆగిపోతే సరిదిద్ది మంజూరు చేయడం గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమ

 

నెల్లూరు అక్టోబర్ 20 (ప్రజా అమరావతి);


రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ ఫలాలు అందుతున్నదీ లేనిదీ ప్రత్యక్షంగా తెలుసుకుంటూ, సాంకేతిక కారణాల వల్ల ఆగిపోతే సరిదిద్ది మంజూరు చేయడం గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమ


ముఖ్యోద్దేశమని రాష్ట్ర వ్యవసాయ, సహకార, మార్కెటింగ్ & పుడ్ ప్రాసెసింగ్ శాఖామాత్యులు  శ్రీ కాకాణి గోవర్ధన రెడ్డి అన్నారు.


సర్వేపల్లి నియోజకవర్గం పొదలకూరు మండలం మరుపూరు గ్రామం లో గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొనేందుకు వచ్చిన మంత్రికి గ్రామ ప్రజలు అపూర్వ స్వాగతం పలికారు. తోలుత గ్రామంలోని ముస్లిం కాలనీలో 20 లక్షల వ్యయంతో నిర్మించిన అంతర్గత రోడ్లను మంత్రి కాకాణి ప్రారంభించారు.


అనంతరం మీడియాతో మాట్లాడుతూ గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా నియోజకవర్గంలోని ప్రతి కుటుంబాన్ని ఆప్యాయంగా పలకరించి యోగ క్షేమాలు తెలుసుకుంటూ, గ్రామానికి అవసరమైన కనీస సౌకర్యాలు కల్పిస్తున్నామన్నారు. ప్రభుత్వం ఏర్పడి 3 సంవత్సరాల తర్వాత ప్రజల్లోకి ధైర్యంగా వెళ్ళగలిగి అందించిన సంక్షేమం గురించి వివరించే అవకాశం కలిగిందన్నారు. ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన ప్రతి హామీని నేరవేర్చిన ఏకైక ప్రభుత్వం తమదన్నారు. ప్రతీ గ్రామంలో ముఖ్యమంత్రి కి, ప్రభుత్వానికి నూటికి నూరు మార్కులు వేశారన్నారు.


సర్వేపల్లి నియోజకవర్గం లో ప్రతి మట్టిరోడ్డు ను సిమెంట్ రోడ్డుగా మార్చామన్నారు. అదేవిధంగా నియోజకవర్గాన్ని పారిశ్రామికంగా అభివృద్ధి చేయడానికి అన్ని చర్యలు తీసుకుంటున్నామన్నారు. రాబోయే గురువారం ముత్తుకూరు మండలం నేలటూరు గ్రామంలో జెన్కో మూడవ కేంద్రాన్ని ముఖ్యమంత్రి జాతికి అంకితం చేస్తారని, సుదీర్ఘకాలంగా అపరిష్కృతంగా ఉన్న మత్స్యకారేతర ప్యాకేజిని ఆయా కుటుంబాలకు అందచేస్తారన్నారు. అదేవిధంగా 25 కోట్ల రూపాయలతో ఫిషింగ్ హార్బర్ జెట్టి నిర్మాణానికి ముఖ్యమంత్రి శంఖు స్థాపన చేస్తారన్నారు. అదేవిధంగా ఇప్పటివరకు పొదలకూరు మండలంలో 127 కోట్ల నిధులు వెచ్చించి వివిధ అభివృద్ధి కార్యక్రమాలు చేశామన్నారు. కేవలం మరుపూరు గ్రామాన్ని 4 కోట్ల 50 లక్షల నిధులు కేటాయించి అభివృద్ధి పరిచామన్నారు. అదేవిధంగా నెల్లూరు పొదలకూరు రోడ్డు లోని అతి పురాతన సెమెంట్ రోడ్డు పునర్నిర్మాణానికి 5 కోట్ల 50 లక్షలు నిధులు, మరుపూరు నుండి పొదలకూరు వరకు గల రోడ్డు పునర్నిర్మాణానికి 5 కోట్ల 75 లక్షలు నిధులు మంజూరు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిందన్నారు.


ఈ కార్యక్రమంలో ఎంపీడీవో నగేష్ కుమారి, తహసీల్దార్ ప్రసాద్, స్థానిక నాయకులు, సచివాలయ సిబ్బంది, వివిధ శాఖల మండల స్థాయి అధికారులు పాల్గొన్నారు.


Comments