పెట్టుబడుల ఆకర్షణకు పక్కా ప్రణాళిక : పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్ నాథ్


 


*పెట్టుబడుల ఆకర్షణకు పక్కా ప్రణాళిక : పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్ నాథ్*


*విశాఖపట్నంలో ఫిబ్రవరిలో 'అంతర్జాతీయ సదస్సు'*


*త్వరలోనే సదస్సుకు సంబంధించిన 'లోగో' సీఎం చేతుల మీదుగా ఆవిష్కరణ*


*రోడ్ షోలు, రౌండ్ టేబుల్ సదస్సులు, ప్రమోషన్, లోగో, బ్రాండింగ్ లపై దిశానిర్దేశం*


*ఏపీఐఐసీ పనుల పురోగతిపైనా చర్చ*


అమరావతి, అక్టోబర్, 19 (ప్రజా అమరావతి): ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నాయకత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం పెట్టుబడుల ఆకర్షణ దిశగా పక్కా ప్రణాళికతో ముందడుగు వేస్తుందని పరిశ్రమల మంత్రి గుడివాడ అమర్ నాథ్ వెల్లడించారు. ఇప్పటికే లోగోను రూపొందించి ముఖ్యమంత్రికి చూపిన నేపథ్యంలో తుది కసరత్తు జరుగుతుందని, త్వరలోనే ముఖ్యమంత్రి ఆధ్వర్యంలో లోగో ఆవిష్కరణ జరుగుతుందని స్పష్టం చేశారు. ఫిబ్రవరి నెలలో రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించనున్న 'ప్రపంచ పెట్టుబడిదారుల సదస్సుపై మంత్రి సమీక్ష నిర్వహించారు. రాష్ట్రంలోని ఎక్కువ పెట్టుబడులను ఆకర్షించగలిగే రంగాలను ఎంచుకుని ఆయా రంగాలవారీగా పారిశ్రామికవేత్తలతో దక్షిణ కొరియా,  తైవాన్, జపాన్ , బ్రిటన్, అమెరికా, న్యూజిలాండ్ దేశాల్లో రౌండ్ టేబుల్, రోడ్ షోలు నిర్వహించేలా దిశా నిర్దేశం చేశారు. అంతర్జాతీయంగా వివిధ దేశాలకు చెందిన వ్యాపారవేత్తలు, రాయబారులు హాజరయ్యే ఈ సమావేశాలు సీఎం వైఎస్ అధ్యక్షతన రాష్ట్ర అధ్యక్షతన అధికారుల బృందం వెళ్ళి ఏపీలో పెట్టుబడుల అవకాశాలను వివరించనున్నట్లు పేర్కొన్నారు. విశాఖ పెట్టుబడుల సదస్సు నిర్వహణ బాధ్యతలను కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీస్ కు అప్పగించిన నేపథ్యంలో ఆ ప్రతినిధులతో రోడ్ షోలను ఎలా ఎప్పుడు నిర్వహించాలనే దానిపై మంత్రి సమాలోచనలు జరిపారు. విద్యుత్, ఐ.టీ, ఎలక్ట్రానిక్స్, మెరైన్, మౌలికవసతులు, పోర్టులు, విమానయాన, డిఫెన్స్, నైపుణ్య రంగాలకు సంబంధించిన రోడ్ షోల ప్రణాళిక పూర్తయిన నేపథ్యంలో రానున్న 3 నెలల్లో వాటిని పూర్తి చేసే లక్ష్యంగా ముందుకు సాగుతామన్నారు. 


*ఏపీఐఐసీ పనుల్లో మరింత వేగం పెంచాలి : మంత్రి గుడివాడ అమర్ నాథ్*


ఏపీఐఐసీ ప్రాజెక్టుల పనుల్లో మరింత వేగం పెంచాలని పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్ నాథ్ వెల్లడించారు. ఏపీఐఐసీ ల్యాండ్ బ్యాంక్, భూ కేటాయింపులు, ఎలక్ట్రానిక్ మ్యానుఫాక్చరింగ్ క్లస్టర్ల పురోగతిపై మంత్రి వివరాలు అడిగి తెలుసుకున్నారు. పారిశ్రామిక పార్కుల్లో భూముల కేటాయింపు విధానంపై ఆరా తీశారు. 2019 నుంచి నేటి వరకూ 2,450 యూనిట్లకు 4,664 ఎకరాల భూమిని కేటాయించినట్లు ఏపీఐఐసీ వీసీ, ఎండీ మంత్రికి వివరించారు. ఇప్పటికే వాటిలో 64 పరిశ్రమలు ఉత్పత్తి దశలోకి వెళ్లాయన్నారు. మరో 10 యూనిట్లు ట్రైల్ ప్రొడక్షన్ దశలో ఉన్నాయన్నారు. 2022-23 ఏడాదికి గానూ రూ.330 కోట్ల ఆదాయం సంపాందించే లక్ష్యంగా ముందుకు సాగుతున్నట్లు పేర్కొన్నారు. ఈఎంసీలు సహా రాష్ట్రవ్యాప్తంగా ముందుకు సాగుతున్న రూ.1934 కోట్ల విలువైన 61 ఇంజనీరింగ్ పనుల పురోగతిని ఎండీ భరత్ గుప్తా మంత్రికి వివరించారు. అందులో భాగంగా ఇప్పటివరకూ రూ.751.78 కోట్ల పనులు పూర్తి చేసినట్లు తెలిపారు.


మంగళగిరి ఏపీఐఐసీ కార్యాలయంలోని మంత్రి కార్యాలయంలో జరిగిన ఈ సమీక్షకు పరిశ్రమల శాఖ డైరెక్టర్ జి.సృజన, ఏపీఈడీబీ సీఈవో , ఏపీఐఐసీ వీసీ, ఎండీ డాక్టర్ నారాయణ భరత్ గుప్తా, పరిశ్రమల శాఖ జాయింట్ డైరెక్టర్లు ఇందిరా, పద్మావతి, ఏపీఐఐసీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్లు సుదర్శన్ బాబు, రాజేంద్రప్రసాద్,  ఇతరులు పాల్గొన్నారు.



Comments
Popular posts
ఉత్తరాఖండ్‌ అసెంబ్లీ సెక్రటేరియట్‌లోని 228 మంది ఉద్యోగులను డిస్మిస్‌ చేస్తూ హైకోర్టు నిర్ణయం సరైనదేనని పేర్కొంది.
Image
న్యాయప్రక్రియకు..రాజ్యాంగపరమైన చట్టాలకు లోబడి వికేంద్రీకరణ చేయబోతున్నాం.
Image
ఒక్క ఇల్లూ కట్టని చిన్న సైకో ఆర్కే ఇళ్లు కూల్చేస్తున్నాడు
Image
*ఆంథ్ర రత్న జయంతి జూన్ 2* *స్వాతంత్ర్య పోరాటయోధుడు, ఉపాధ్యాయుడు,చీరాల పేరాల ఉద్యమనాయకుడు గాంధేయవాది మన తెలుగువాడు ఆంధ్రరత్న దుగ్గిరాల గోపాలకృష్ణయ్య జయంతి జూన్ 2.* *కృష్ణా జిల్లా, పెనుగంచిప్రోలు గ్రామంలో 1889 జూన్ 2 న దుగ్గిరాల గోపాలకృష్ణయ్య జన్మించాడు. ఆయన పుట్టిన మూడవ రోజునే తల్లి సీతమ్మ, మూడో ఏట తండ్రి కోదండ రామస్వామి మరణించారు. అప్పటినుండి పినతండ్రి, నాయనమ్మల సంరక్షణలో పెరిగాడు. కూచిపూడిలోను, గుంటూరులోను ప్రాథమిక విద్య జరిగింది. హైస్కూలులో చదివే సమయంలోనే 'జాతీయ నాట్య మండలి' స్థాపించి సంగీత, నాటక కార్యక్రమాలు నిర్వహించాడు. అయితే చదువుపై అంత శ్రద్ధ చూపకపోవడంచేత మెట్రిక్యులేషనులో తప్పాడు. తరువాత బాపట్ల లో చదివి ఉత్తీర్ణుడయ్యాడు*. *నడింపల్లి వెంకటలక్ష్మీ నరసింహారావు అనే ఒక మిత్రుని సాయంతో 1911లో స్కాట్లండు లోని ఎడింబరో విశ్వ విద్యా లయంలో ఎం.ఎ. చదివాడు*. *తరువాత ఆనంద కుమార స్వామి తో కలసి కొంతకాలం పనిచేశాడు. ఆ సమయంలో 'నందికేశ్వరుడు' రచించిన 'అభినయ దర్పణం' అనే గ్రంథాన్ని “The Mirror of Gesture,” అన్న పేరుతో సంస్కృతం నుండి ఆంగ్లంలోకి అనువదించాడు. ఇది 1917లో 'కేంబ్రిడ్జ్ - హార్వర్డ్ యూనివర్శిటీ ప్రెస్' వారిచే ప్రచురించబడింది.* *తిరిగివచ్చాక, రాజమండ్రి లోను, బందరు లోను కొంతకాలం ఉపాధ్యాయుడిగా పనిచేసాడు. తన స్వతంత్ర భావాల కారణంగా పైవారితో పడక ఆ ఉద్యోగాలు వదలిపెట్టాడు. తరువాత గోపాల కృష్ణయ్య స్వాతంత్ర్య సంగ్రామం లో దూకాడు*. *బ్రిటీష్ ప్రభుత్వం 1919లో చీరాల-పేరాల గ్రామాలను కలిపి పురపాలక సంఘంగా చేయడంతో ప్రజలపై పన్నుల భారం అధికమై పురపాలక సంఘం రద్దు చేయాలని ఉద్యమించారు. ప్రస్తుతం ప్రకాశం జిల్లా లో ఉన్న చీరాల, పేరాల గ్రామాల జనాభా ఆ కాలంలో 15000. జాండ్రపేట, వీరరాఘవపేట గ్రామాలను చీరాల, పేరాలతో కలిపి చీరాల యూనియన్ అని వ్యవహరించే వారు. ఈ యూనియన్ నుంచి ఏడాదికి నాలుగు వేల రూపాయలు వసూలయ్యేవి. మద్రాసు ప్రభుత్వం 1919 లో చీరాల-పేరాలను మున్సిపాలిటీగా ప్రకటించింది. పన్ను ఏడాదికి 40,000 రూపాయలయ్యింది. సౌకర్యాలు మాత్రం మెరుగు పడలేదు. ఇక్కడ ఉన్న నేతపని వారు, చిన్నరైతులు పన్ను చెల్లించలేక మున్సిపాలిటీని రద్దు చేయాలని ప్రభుత్వానికి ఎన్నో వినతి పత్రాలు సమర్పించారు. ఫలితం లేదు. దాంతో వారు దుగ్గిరాల గోపాలకృష్ణయ్య నాయకత్వంలో ఆందోళన ప్రారంభించారు. ఇది స్వాతంత్ర్య పోరాటంలో ఒక ముఖ్యమైన ఘట్టం. ఆంధ్ర దేశం అంతా తిరిగి బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా ప్రచారం చేశాడు. నిషేధాన్ని ఉల్లంఘించి బరంపురంలో ఉపన్యాసం చేసినందుకు ఒక సంవత్సరం పాటు జైలు శిక్ష అనుభవించాడు.చీరాల పేరాల ఉద్యమం -మద్రాస్ ప్రసిడెన్సీని కంపింపజేసింది.. ఆ ఉద్యమం మిగతా ప్రాంతాలకు వ్యాపిస్తుందేమోనని ఆంగ్లేయపాలకులు భయకంపితులయినారు..చివరికి జాతీయకాంగ్రీసు జోక్యంతో ఉద్యమం ముగిసింది...* *తెలుగు నాట జానపద కళా రూపాల పునరుద్ధరణకు, గ్రంథాలయాల వ్యాప్తికి గోపాలకృష్ణయ్య ఇతోధికంగా కృషి చేశాడు. 'సాధన' అనే పత్రిక నడిపాడు*. *ఆయన ప్రచారం చేసిన జానపద కళారీతులు - తోలుబొమ్మలాట, జముకుల కథ, బుర్రకథ, వీధి నాటకాలు, సాము గరిడీలు, గొల్ల కలాపం, బుట్ట బొమ్మలు, కీలు గుర్రాలు, వాలకాలు, గోసంగి, గురవయ్యలు, సరదా కథ, కిన్నెర కథ, కొమ్ము బూర,జోడు మద్దెల, పల్లె సుద్దులు, తూర్పు భాగోతం, చుట్టు కాముడు, పిచ్చికుంట్లవాళ్ళ కథ, సాధనా శూరులు, పలనాటి వీర విద్యావంతులు - వగైరా* *గోపాలకృష్ణయ్య నియమ తత్పరుడు. 'శ్రీరామదండు' అనే ఆధ్యాత్మిక, జాతీయతా స్వచ్ఛంద సమూహాన్ని ఏర్పాటు చేశాడు.* *1921 లో గుంటూరులో ఒక సభలో "ఆంధ్ర రత్న" అన్న బిరుదుతో ఆయనను సత్కరించారు.* *ఈ మహనీయుని త్యాగాలకు తెలుగుజాతి సర్వదా ఋణపడివుంది*. *ఉపాధ్యాయ సేవా కేంద్రం,విజయవాడ*
Image
बर्खास्त होंगे उत्तराखंड विधानसभा सचिवालय के 228 कर्मी, हाईकोर्ट ने फैसला सही कहा।
Image