*తిరుమల శ్రీవారిని దర్శించుకొన్న కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ రాష్ట్ర ఆర్థిక మంత్రి బుగ్గన
.*
తిరుమల, అక్టోబర్ 20 (ప్రజా అమరావతి): తిరుమల శ్రీవారిని ప్రాతఃకాల సమయంలో దర్శించుకున్న గౌ.కేంద్ర ఆర్థిక శాఖ మరియు కార్పొరేట్ అఫైర్స్ మంత్రి నిర్మలా సీతారామన్ మరియు రాష్ట్ర ఆర్థిక శాఖా మంత్రి బుగ్గన రాజేంద్రనాధ్.
ఈ సందర్బంగా ఆలయం వద్దకు చేరుకున్న వీరికి తి.తి.దే చైర్మన్ వై.వి సుబ్బారెడ్డి, తి.తి.దే ఈవో ధర్మారెడ్డి ఆలయ సంప్రదాయం ప్రకారం కేంద్రమంత్రికి స్వాగతం పలికారు. ముందుగా మంత్రి ధ్వజ స్థంభం వద్ద మొక్కులు తీర్చుకుని స్వామి వారిని దర్శించుకున్నారు. అనంతరం రంగనాయకుల మండపంలో వేదపండితులు వేదాశీర్వచనం చేసి టీటీడి చైర్మన్ శ్రీవారి తీర్థప్రసాదాలు వీరికి అందజేశారు.
వీరితో పాటు తిరుపతి ఎం పి మద్దెల గురుమూర్తి, బిజెపి నాయకులు భాను ప్రకాష్ రెడ్డి తదితరులు ఉన్నారు.
addComments
Post a Comment