ముఖ్యమంత్రి శ్రీ వైఎస్‌ జగన్‌ను కలిసిన నార్వే, జర్మనీ దేశాల్లోని భారత రాయబారులు డాక్టర్‌ బి.బాలబాస్కర్, పర్వతనేని హరీష్‌.


అమరావతి (ప్రజా అమరావతి);


సీఎం క్యాంప్‌ కార్యాలయంలో ముఖ్యమంత్రి శ్రీ వైఎస్‌ జగన్‌ను కలిసిన నార్వే, జర్మనీ దేశాల్లోని భారత రాయబారులు డాక్టర్‌ బి.బాలబాస్కర్, పర్వతనేని హరీష్‌.


ఎగుమతులను ప్రోత్సహించడంలో భాగంగా జర్మనీ, నార్వే దేశ అవకాశాలపై ప్రత్యేకంగా దృష్టి సారించిన ఏపీ ప్రభుత్వం, ఇదే అంశంపై ఏపీఐఐసీ ప్రత్యేకంగా ఏర్పాటుచేసిన సమావేశంలో పలు అంశాలపై చర్చ, అక్కడ చర్చించిన అంశాలను ముఖ్యమంత్రికి దృష్టికి తీసుకెళ్ళిన రాయబారులు.


రాష్ట్రం నుంచి ఎగుమతికి అవకాశం ఉన్న ఉత్పత్తులు, సులభతర వాణిజ్యం కోసం అమలుచేస్తున్న ప్రణాళికలను రాయబారుల దృష్టికి తీసుకెళ్ళిన సీఎం.


వ్యవసాయం, ఫుడ్‌ ప్రాసెసింగ్, ఉద్యాన ఉత్పత్తులు, మత్స్య సంపద, చేనేత, టెక్స్‌టైల్, టూరిజం రంగాలలో అవకాశాలపై ఈ సమావేశంలో చర్చ.


దేశంలోనే ఎక్కడా లేని విధంగా రాష్ట్రంలో నిర్మిస్తున్న పోర్టులు, ఫిషింగ్‌ హర్బర్‌లు, పోర్టు ఆధారిత పారిశ్రామిక పార్కుల ఏర్పాటు, ఎంఎస్‌ఎంఈలతో ఒప్పందాలు, పాలసీలు, టెక్నాలజీ అప్‌గ్రేడేషన్, డీకార్బనైజేషన్‌ వంటి కీలక అంశాలపై సీఎం, రాయబారుల మధ్య చర్చ.


నాణ్యతతో కూడిన ఉత్పత్తులకు ప్రాధాన్యతినిస్తూ అధిక మొత్తంలో ఆయా దేశాలకు ఎగుమతులను ప్రోత్సహించేలా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని రాయబారులకు తెలిపిన సీఎం.


ఇక్కడ నర్సింగ్‌ చదువుతున్న విద్యార్ధులకు జర్మనీలో విస్తృతంగా అవకాశాలు కల్పించేలా వారు కోర్సు చదివే సమయంలో అక్కడికి తగిన విధంగా బాషా శిక్షణ, కరిక్యులమ్‌ అందుబాటులోకి తీసుకురావాలని జర్మనీలో భారత రాయబారిని కోరిన సీఎం, సానుకూలంగా స్పందించిన రాయబారి.


నాణ్యమైన, రుచికరమైన కాఫీ ఉత్పత్తులకు అంతర్జాతీయ బ్రాండింగ్, ప్రొడక్టివిటీ పెంచేలా తగిన సహకారాలు అందించాలని కోరిన ముఖ్యమంత్రి, తప్పనిసరిగా తమ సహకారం ఉంటుందని ఇరుదేశాల రాయబారులు హామి.


ఏపీలో పెట్టుబడులు, అవకాశాలపై ఇరుదేశాల రాయబారులకు వివరించిన ముఖ్యమంత్రి.


ఈ సమావేశంలో పాల్గొన్న సీఎం స్పెషల్‌ చీఫ్‌ సెక్రటరీ డాక్టర్‌ కేఎస్‌. జవహర్‌ రెడ్డి, ప్రణాళికా శాఖ కార్యదర్శి జి. విజయ్‌కుమార్, పరిశ్రమల శాఖ డైరెక్టర్‌ జి. సృజన.

Comments
Popular posts
ఉత్తరాఖండ్‌ అసెంబ్లీ సెక్రటేరియట్‌లోని 228 మంది ఉద్యోగులను డిస్మిస్‌ చేస్తూ హైకోర్టు నిర్ణయం సరైనదేనని పేర్కొంది.
Image
న్యాయప్రక్రియకు..రాజ్యాంగపరమైన చట్టాలకు లోబడి వికేంద్రీకరణ చేయబోతున్నాం.
Image
ఒక్క ఇల్లూ కట్టని చిన్న సైకో ఆర్కే ఇళ్లు కూల్చేస్తున్నాడు
Image
*ఆంథ్ర రత్న జయంతి జూన్ 2* *స్వాతంత్ర్య పోరాటయోధుడు, ఉపాధ్యాయుడు,చీరాల పేరాల ఉద్యమనాయకుడు గాంధేయవాది మన తెలుగువాడు ఆంధ్రరత్న దుగ్గిరాల గోపాలకృష్ణయ్య జయంతి జూన్ 2.* *కృష్ణా జిల్లా, పెనుగంచిప్రోలు గ్రామంలో 1889 జూన్ 2 న దుగ్గిరాల గోపాలకృష్ణయ్య జన్మించాడు. ఆయన పుట్టిన మూడవ రోజునే తల్లి సీతమ్మ, మూడో ఏట తండ్రి కోదండ రామస్వామి మరణించారు. అప్పటినుండి పినతండ్రి, నాయనమ్మల సంరక్షణలో పెరిగాడు. కూచిపూడిలోను, గుంటూరులోను ప్రాథమిక విద్య జరిగింది. హైస్కూలులో చదివే సమయంలోనే 'జాతీయ నాట్య మండలి' స్థాపించి సంగీత, నాటక కార్యక్రమాలు నిర్వహించాడు. అయితే చదువుపై అంత శ్రద్ధ చూపకపోవడంచేత మెట్రిక్యులేషనులో తప్పాడు. తరువాత బాపట్ల లో చదివి ఉత్తీర్ణుడయ్యాడు*. *నడింపల్లి వెంకటలక్ష్మీ నరసింహారావు అనే ఒక మిత్రుని సాయంతో 1911లో స్కాట్లండు లోని ఎడింబరో విశ్వ విద్యా లయంలో ఎం.ఎ. చదివాడు*. *తరువాత ఆనంద కుమార స్వామి తో కలసి కొంతకాలం పనిచేశాడు. ఆ సమయంలో 'నందికేశ్వరుడు' రచించిన 'అభినయ దర్పణం' అనే గ్రంథాన్ని “The Mirror of Gesture,” అన్న పేరుతో సంస్కృతం నుండి ఆంగ్లంలోకి అనువదించాడు. ఇది 1917లో 'కేంబ్రిడ్జ్ - హార్వర్డ్ యూనివర్శిటీ ప్రెస్' వారిచే ప్రచురించబడింది.* *తిరిగివచ్చాక, రాజమండ్రి లోను, బందరు లోను కొంతకాలం ఉపాధ్యాయుడిగా పనిచేసాడు. తన స్వతంత్ర భావాల కారణంగా పైవారితో పడక ఆ ఉద్యోగాలు వదలిపెట్టాడు. తరువాత గోపాల కృష్ణయ్య స్వాతంత్ర్య సంగ్రామం లో దూకాడు*. *బ్రిటీష్ ప్రభుత్వం 1919లో చీరాల-పేరాల గ్రామాలను కలిపి పురపాలక సంఘంగా చేయడంతో ప్రజలపై పన్నుల భారం అధికమై పురపాలక సంఘం రద్దు చేయాలని ఉద్యమించారు. ప్రస్తుతం ప్రకాశం జిల్లా లో ఉన్న చీరాల, పేరాల గ్రామాల జనాభా ఆ కాలంలో 15000. జాండ్రపేట, వీరరాఘవపేట గ్రామాలను చీరాల, పేరాలతో కలిపి చీరాల యూనియన్ అని వ్యవహరించే వారు. ఈ యూనియన్ నుంచి ఏడాదికి నాలుగు వేల రూపాయలు వసూలయ్యేవి. మద్రాసు ప్రభుత్వం 1919 లో చీరాల-పేరాలను మున్సిపాలిటీగా ప్రకటించింది. పన్ను ఏడాదికి 40,000 రూపాయలయ్యింది. సౌకర్యాలు మాత్రం మెరుగు పడలేదు. ఇక్కడ ఉన్న నేతపని వారు, చిన్నరైతులు పన్ను చెల్లించలేక మున్సిపాలిటీని రద్దు చేయాలని ప్రభుత్వానికి ఎన్నో వినతి పత్రాలు సమర్పించారు. ఫలితం లేదు. దాంతో వారు దుగ్గిరాల గోపాలకృష్ణయ్య నాయకత్వంలో ఆందోళన ప్రారంభించారు. ఇది స్వాతంత్ర్య పోరాటంలో ఒక ముఖ్యమైన ఘట్టం. ఆంధ్ర దేశం అంతా తిరిగి బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా ప్రచారం చేశాడు. నిషేధాన్ని ఉల్లంఘించి బరంపురంలో ఉపన్యాసం చేసినందుకు ఒక సంవత్సరం పాటు జైలు శిక్ష అనుభవించాడు.చీరాల పేరాల ఉద్యమం -మద్రాస్ ప్రసిడెన్సీని కంపింపజేసింది.. ఆ ఉద్యమం మిగతా ప్రాంతాలకు వ్యాపిస్తుందేమోనని ఆంగ్లేయపాలకులు భయకంపితులయినారు..చివరికి జాతీయకాంగ్రీసు జోక్యంతో ఉద్యమం ముగిసింది...* *తెలుగు నాట జానపద కళా రూపాల పునరుద్ధరణకు, గ్రంథాలయాల వ్యాప్తికి గోపాలకృష్ణయ్య ఇతోధికంగా కృషి చేశాడు. 'సాధన' అనే పత్రిక నడిపాడు*. *ఆయన ప్రచారం చేసిన జానపద కళారీతులు - తోలుబొమ్మలాట, జముకుల కథ, బుర్రకథ, వీధి నాటకాలు, సాము గరిడీలు, గొల్ల కలాపం, బుట్ట బొమ్మలు, కీలు గుర్రాలు, వాలకాలు, గోసంగి, గురవయ్యలు, సరదా కథ, కిన్నెర కథ, కొమ్ము బూర,జోడు మద్దెల, పల్లె సుద్దులు, తూర్పు భాగోతం, చుట్టు కాముడు, పిచ్చికుంట్లవాళ్ళ కథ, సాధనా శూరులు, పలనాటి వీర విద్యావంతులు - వగైరా* *గోపాలకృష్ణయ్య నియమ తత్పరుడు. 'శ్రీరామదండు' అనే ఆధ్యాత్మిక, జాతీయతా స్వచ్ఛంద సమూహాన్ని ఏర్పాటు చేశాడు.* *1921 లో గుంటూరులో ఒక సభలో "ఆంధ్ర రత్న" అన్న బిరుదుతో ఆయనను సత్కరించారు.* *ఈ మహనీయుని త్యాగాలకు తెలుగుజాతి సర్వదా ఋణపడివుంది*. *ఉపాధ్యాయ సేవా కేంద్రం,విజయవాడ*
Image
बर्खास्त होंगे उत्तराखंड विधानसभा सचिवालय के 228 कर्मी, हाईकोर्ट ने फैसला सही कहा।
Image