లోన్ యాప్ మోసాలపై ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలి.

 *లోన్ యాప్ మోసాలపై ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలి.


*


*వేలల్లో రుణాలిచ్చి లక్షల్లో దోచేస్తారు.*


*ఏపీ డీజీపీ కేవీ రాజేంద్రనాథ్ రెడ్డి.*



మంగళగిరి (ప్రజా అమరావతి);

ఇటీవల కాలంలో డిజిటల్ ప్లాట్ ఫారం ద్వారా లావాదేవీల జరుపుతున్న వారి సంఖ్య పెరుగుతుందని,  అదేవిధంగా డిజిటల్ ఫ్లాట్ ఫారం ద్వారా అనేక నేరాలు పెరుగుతున్నాయని ఆంధ్రప్రదేశ్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ కె.వి రాజేంద్రనాథ్ రెడ్డి అన్నారు. మంగళగిరిలోని డీజీపీ కార్యాలయంలో శుకచరవారం రుణయాప్ మోసాలపై  అవగాహన కల్పించేందుకు ప్రత్యేకంగా రూపొందించిన బ్రోచర్ ను ఆవిష్కరించారు. అనంతరం జరిగిన కార్యక్రమంలో డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి మాట్లాడారు. అక్రమ రుణ యాప్ సంస్థలు  సూక్ష్మ క్రెడిట్లను అందజేస్తోన్నారని  ముఖ్యంగా బలహీన వర్గాల కు  అధిక వడ్డీ రేట్లు మరియు ప్రాసెసింగ్   చార్జీలతో లోన్లు ఇచ్చి బ్లాక్ మెయిలింగ్,  నేరపూరిత బెదిరింపులతో కూడిన దోపిడీ రికవరీ పద్ధతులకు పాల్పడుతున్నారని తెలిపారు.

 అక్రమ యాప్ ద్వారా వేలల్లో అప్పు తీసుకుంటే లక్షల్లో దోచేస్తూ అప్పు ఎంత తీర్చినా సరిపెట్టుకోకుండా మరిన్ని రుణ యాప్ డౌన్లోడ్ చేయించి వారికి చిన్న చిన్న అప్పులు ఇస్తూ మరింత ఇబ్బందులకు గురి చేస్తున్నారన్నారు.  రుణ యాప్ మీద డౌన్లోడ్ చేసేటప్పుడు అజాగ్రత్తగా ఉంటే   మొబైల్ ఫోన్ యొక్క కాంటెక్ట్స్,  కెమెరా లోకేష్,  ఎస్ఎంఎస్ స్టోరేజీ మరియు ఇతర అనుమతులను అడిగి వ్యక్తిగత సమాచారాన్ని మీకు తెలియకుండా తస్కరిస్తారని తెలిపారు. అంతే కాకుండా  మీ ఫ్యామిలీ ఫోటోస్, కాల్ రికార్డింగ్స్ మార్ఫింగ్ చేసి అశ్లీల చిత్రాలుగా మార్చి మీ బంధువులకు, స్నేహితులకు సామాజిక మాధ్యమాలలో పంపి మిమ్మల్ని ఇబ్బందులకు గురి చేస్తారన్నారు.  రుణ గ్రహీతలనే కాకుండా వారి కుటుంబ సభ్యులను మరియు సన్నిహితులను డిఫాల్టర్లుగా  ప్రకటించి బ్లాక్ మెయిల్ చేస్తూ అక్రమంగా అధిక వడ్డీలు వసూలు చేస్తోన్నారని తెలిపారు. అంతేకాకుండా వారిపై మానసికంగా,  శారీరకంగా వేధింపులకు గురి చేస్తున్నారని తెలిపారు. రుణ యాప్ డౌన్లోడ్ చేసేటప్పుడు అనుమతులను ఇవ్వవద్దని డీజీపీ కోరారు. నకిలీ రుణ యాప్స్ సంస్థలు ఎటువంటి హామీ పత్రాలను,  సిబిల్ స్టోర్ లేకుండా వెంటనే రుణాలు మంజూరు చేస్తామని ఎరవేస్తారని, మొత్తం రుణం తీర్చిన తర్వాత కూడా ఇంకా చెల్లించాలని వేధిస్తారని వీటిపట్ల అప్రమత్తంగా ఉండాలన్నారు.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇప్పటివరకు 75 అక్రమ రుణ యాప్ వేధింపులు కేసులు నమోదు కాగా అందులో 80 మందిని గుర్తించి వారిని అరెస్టు చేయడం జరిగిందని, మిగిలిన కేసులు దర్యాప్తు దశలో ఉన్నాయని తెలిపారు. ఇలాంటి నేరాలు పాల్పడిన వారిపై ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పోలీస్ శాఖ కఠినంగా వ్యవహరిస్తుందని చట్టపరంగా వారిపై కేసులు నమోదు చేయడం జరుగుతుందన్నారు. లోన్ యాప్ కేసులలో రుణ యాప్ డెవలపర్లు కూడా నేరస్తులు గాని పరిగణించబడతారన్నారు. తెలియని వెబ్ సైట్లు, లింకుల ద్వారా ఎటువంటి రుణ యాప్ లను డౌన్ లోడ్ చేయవద్దని సూచించారు.  

బెదిరింపు కాల్స్ , ఎస్ఎంఎస్ లు, ఫోటో మార్ఫింగ్ లకు భయపడి అధిక మొత్తం చెల్లించడం, ఆత్మహత్యలకు పాల్పడవద్దని తెలిపారు. ఇటువంటి సంఘటనలు ఎదురైనప్పుడు దగ్గర్లోని పోలీస్ స్టేషన్లో లేదా టోల్ ఫ్రీ నెంబర్ 1930 కు ఫిర్యాదు చేయాలని డిజిపి రాజేంద్రనాథ్ రెడ్డి కోరారు.



Comments
Popular posts
ఉత్తరాఖండ్‌ అసెంబ్లీ సెక్రటేరియట్‌లోని 228 మంది ఉద్యోగులను డిస్మిస్‌ చేస్తూ హైకోర్టు నిర్ణయం సరైనదేనని పేర్కొంది.
Image
ఇంటర్నెట్‌లో గూగుల్ సెర్చ్‌లో సైబర్ క్రైమ్ కేసులు పెరుగుతున్నాయి.
Image
న్యాయప్రక్రియకు..రాజ్యాంగపరమైన చట్టాలకు లోబడి వికేంద్రీకరణ చేయబోతున్నాం.
Image
ఒక్క ఇల్లూ కట్టని చిన్న సైకో ఆర్కే ఇళ్లు కూల్చేస్తున్నాడు
Image
*ఆంథ్ర రత్న జయంతి జూన్ 2* *స్వాతంత్ర్య పోరాటయోధుడు, ఉపాధ్యాయుడు,చీరాల పేరాల ఉద్యమనాయకుడు గాంధేయవాది మన తెలుగువాడు ఆంధ్రరత్న దుగ్గిరాల గోపాలకృష్ణయ్య జయంతి జూన్ 2.* *కృష్ణా జిల్లా, పెనుగంచిప్రోలు గ్రామంలో 1889 జూన్ 2 న దుగ్గిరాల గోపాలకృష్ణయ్య జన్మించాడు. ఆయన పుట్టిన మూడవ రోజునే తల్లి సీతమ్మ, మూడో ఏట తండ్రి కోదండ రామస్వామి మరణించారు. అప్పటినుండి పినతండ్రి, నాయనమ్మల సంరక్షణలో పెరిగాడు. కూచిపూడిలోను, గుంటూరులోను ప్రాథమిక విద్య జరిగింది. హైస్కూలులో చదివే సమయంలోనే 'జాతీయ నాట్య మండలి' స్థాపించి సంగీత, నాటక కార్యక్రమాలు నిర్వహించాడు. అయితే చదువుపై అంత శ్రద్ధ చూపకపోవడంచేత మెట్రిక్యులేషనులో తప్పాడు. తరువాత బాపట్ల లో చదివి ఉత్తీర్ణుడయ్యాడు*. *నడింపల్లి వెంకటలక్ష్మీ నరసింహారావు అనే ఒక మిత్రుని సాయంతో 1911లో స్కాట్లండు లోని ఎడింబరో విశ్వ విద్యా లయంలో ఎం.ఎ. చదివాడు*. *తరువాత ఆనంద కుమార స్వామి తో కలసి కొంతకాలం పనిచేశాడు. ఆ సమయంలో 'నందికేశ్వరుడు' రచించిన 'అభినయ దర్పణం' అనే గ్రంథాన్ని “The Mirror of Gesture,” అన్న పేరుతో సంస్కృతం నుండి ఆంగ్లంలోకి అనువదించాడు. ఇది 1917లో 'కేంబ్రిడ్జ్ - హార్వర్డ్ యూనివర్శిటీ ప్రెస్' వారిచే ప్రచురించబడింది.* *తిరిగివచ్చాక, రాజమండ్రి లోను, బందరు లోను కొంతకాలం ఉపాధ్యాయుడిగా పనిచేసాడు. తన స్వతంత్ర భావాల కారణంగా పైవారితో పడక ఆ ఉద్యోగాలు వదలిపెట్టాడు. తరువాత గోపాల కృష్ణయ్య స్వాతంత్ర్య సంగ్రామం లో దూకాడు*. *బ్రిటీష్ ప్రభుత్వం 1919లో చీరాల-పేరాల గ్రామాలను కలిపి పురపాలక సంఘంగా చేయడంతో ప్రజలపై పన్నుల భారం అధికమై పురపాలక సంఘం రద్దు చేయాలని ఉద్యమించారు. ప్రస్తుతం ప్రకాశం జిల్లా లో ఉన్న చీరాల, పేరాల గ్రామాల జనాభా ఆ కాలంలో 15000. జాండ్రపేట, వీరరాఘవపేట గ్రామాలను చీరాల, పేరాలతో కలిపి చీరాల యూనియన్ అని వ్యవహరించే వారు. ఈ యూనియన్ నుంచి ఏడాదికి నాలుగు వేల రూపాయలు వసూలయ్యేవి. మద్రాసు ప్రభుత్వం 1919 లో చీరాల-పేరాలను మున్సిపాలిటీగా ప్రకటించింది. పన్ను ఏడాదికి 40,000 రూపాయలయ్యింది. సౌకర్యాలు మాత్రం మెరుగు పడలేదు. ఇక్కడ ఉన్న నేతపని వారు, చిన్నరైతులు పన్ను చెల్లించలేక మున్సిపాలిటీని రద్దు చేయాలని ప్రభుత్వానికి ఎన్నో వినతి పత్రాలు సమర్పించారు. ఫలితం లేదు. దాంతో వారు దుగ్గిరాల గోపాలకృష్ణయ్య నాయకత్వంలో ఆందోళన ప్రారంభించారు. ఇది స్వాతంత్ర్య పోరాటంలో ఒక ముఖ్యమైన ఘట్టం. ఆంధ్ర దేశం అంతా తిరిగి బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా ప్రచారం చేశాడు. నిషేధాన్ని ఉల్లంఘించి బరంపురంలో ఉపన్యాసం చేసినందుకు ఒక సంవత్సరం పాటు జైలు శిక్ష అనుభవించాడు.చీరాల పేరాల ఉద్యమం -మద్రాస్ ప్రసిడెన్సీని కంపింపజేసింది.. ఆ ఉద్యమం మిగతా ప్రాంతాలకు వ్యాపిస్తుందేమోనని ఆంగ్లేయపాలకులు భయకంపితులయినారు..చివరికి జాతీయకాంగ్రీసు జోక్యంతో ఉద్యమం ముగిసింది...* *తెలుగు నాట జానపద కళా రూపాల పునరుద్ధరణకు, గ్రంథాలయాల వ్యాప్తికి గోపాలకృష్ణయ్య ఇతోధికంగా కృషి చేశాడు. 'సాధన' అనే పత్రిక నడిపాడు*. *ఆయన ప్రచారం చేసిన జానపద కళారీతులు - తోలుబొమ్మలాట, జముకుల కథ, బుర్రకథ, వీధి నాటకాలు, సాము గరిడీలు, గొల్ల కలాపం, బుట్ట బొమ్మలు, కీలు గుర్రాలు, వాలకాలు, గోసంగి, గురవయ్యలు, సరదా కథ, కిన్నెర కథ, కొమ్ము బూర,జోడు మద్దెల, పల్లె సుద్దులు, తూర్పు భాగోతం, చుట్టు కాముడు, పిచ్చికుంట్లవాళ్ళ కథ, సాధనా శూరులు, పలనాటి వీర విద్యావంతులు - వగైరా* *గోపాలకృష్ణయ్య నియమ తత్పరుడు. 'శ్రీరామదండు' అనే ఆధ్యాత్మిక, జాతీయతా స్వచ్ఛంద సమూహాన్ని ఏర్పాటు చేశాడు.* *1921 లో గుంటూరులో ఒక సభలో "ఆంధ్ర రత్న" అన్న బిరుదుతో ఆయనను సత్కరించారు.* *ఈ మహనీయుని త్యాగాలకు తెలుగుజాతి సర్వదా ఋణపడివుంది*. *ఉపాధ్యాయ సేవా కేంద్రం,విజయవాడ*
Image