తెలంగాణ టిడిపి నేతలతో చంద్రబాబు భేటీ.

 తెలంగాణ టిడిపి నేతలతో చంద్రబాబు భేటీ. 


తెలుగుదేశం పార్టీ తెలంగాణ నేతలతో టిడిపి అధినేత శ్రీ నారా చంద్రబాబు నాయుడు ఆదివారం తన నివాసంలో భేటీ అయ్యారు. రాష్ట్రంలోని రాజకీయ పరిస్థితుల గురించి సమీక్షించారు. 

పార్టీని బలోపేతం చేయడానికి అటు సంస్థాగతంగా, ఇటు క్షేత్రస్థాయిలో చేపట్టాల్సిన కార్యాచరణ ప్రణాళిక అమలుపై చర్చించారు. ఇకపై తరుచుగా రాష్ట్ర పార్టీ కార్యాలయాన్ని సందర్శిస్తానని, నిరంతరం ప్రజల్లో ఉండాలని, సమస్యల పరిష్కారం కోసం పోరాడాలని, టిడిపి హయాంలో చేపట్టిన అభివృద్ధి, సంక్షేమం గురించి ప్రజల్లోకి తీసుకెళ్లాలని సూచించారు.  


ఎన్టీఆర్ శతజయంతి, పార్టీ 40ఏళ్ల ఆవిర్భావ దినోత్సవం, వస్తున్నా మీకోసం పాదయాత్ర 10ఏళ్లయిన సందర్భంగా చేపట్టిన కార్యక్రమాల గురించి రాష్ట్ర నాయకులు వివరించారు. విజయదశమి సందర్భంగా ప్రతిఏటా పార్టీ తరఫున జోగులాంబ అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పిస్తున్న విషయం ప్రస్తావించి, అమ్మవారి ప్రసాదాన్ని, జ్ఞాపికను చంద్రబాబుకు అందజేశారు. 

ఈ భేటిలో తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షులు బక్కని నర్సింహులు, పోలిట్ బ్యూరో సభ్యులు రావుల చంద్రశేఖర రెడ్డి, అరవింద్ కుమార్ గౌడ్, రాష్ట్ర వ్యవహారాల ఇన్ ఛార్జి కంభంపాటి రామమోహన్ రావు, జాతీయ పార్టీ అధికార ప్రతినిధి నన్నూరి నర్సిరెడ్డి, రాష్ట్ర పార్టీ ప్రధాన కార్యదర్శి జక్కలి ఐలయ్య యాదవ్, భువనగిరి పార్లమెంట్ ఇన్ ఛార్జి కృష్ణమాచారి తదితరులు పాల్గొన్నారు.

Comments