శ్రీ దుర్గామల్లేశ్వర స్వామివార్ల దేవస్థానం, ఇంద్రకీలాద్రి
, విజయవాడ (ప్రజా అమరావతి):
ఇస్లాంపేట, విజయవాడకు చెందిన హైకోర్టు లాయర్ శ్రీ నరహరిశెట్టి శ్రీహరి, సుభాషిని గార్లు ఆలయము నందు ప్రతిరోజూ జరుగు నిత్య అన్నదానము పధకంనకు రూ.1,01,205/-లు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు మరియు దేవాదాయ శాఖ మంత్రి వర్యులు శ్రీ కొట్టు సత్యనారాయణ గారి చేతుల మీదుగా ఆలయ కార్యనిర్వాహణాధికారి దర్భముళ్ళ భ్రమరాంబ గారికి అందజేసి దేవస్థానమునకు విరాలముగా అందజేసినారు. ఈ కార్యక్రమంలో దేవాదాయ శాఖ కమిషనర్ డా. హరి జవహర్,IAS పాల్గొన్నారు. దాత కుటుంబమునకు ఆలయ అధికారులు శ్రీ అమ్మవారి దర్శనము కల్పించిన అనంతరము ఆలయ అర్చకులు వేదాశీర్వచనం చేసి, శ్రీ అమ్మవారి ప్రసాదములు, శేషవస్త్రం అందజేసినారు.
addComments
Post a Comment