ఏ ఒక్క దరఖాస్తు బియాండ్ ఎస్ ఎల్ ఏ లోకి వెళ్ళకుండా చూడాలి

 ఏ ఒక్క దరఖాస్తు  బియాండ్ ఎస్ ఎల్ ఏ లోకి వెళ్ళకుండా చూడాలి



ప్రాధాన్యత అంశాలపై ప్రత్యేక శ్రద్ధ వహించాలి


జిల్లా కలెక్టర్  బసంత్ కుమార్


*: పుట్టపర్తి కలెక్టరేట్లో స్పందన గ్రీవెన్స్ కార్యక్రమంలో పాల్గొని ప్రజల నుంచి అర్జీలను స్వీకరించిన జిల్లా కలెక్టర్*


పుట్టపర్తి,   నవంబర్ 7 (ప్రజా అమరావతి):


స్పందన అర్జీల  పరిష్కారంలో జాప్యం తగదని  సంబంధిత అధికారులను జిల్లా కలెక్టర్ బసంత్ కుమార్ ఆదేశించారు.   సోమవారం పుట్టపర్తి కలెక్టరేట్లోని వీడియో కాన్ఫరెన్స్ హాల్లో నిర్వహించిన స్పందన గ్రీవెన్స్ కార్యక్రమంలో పాల్గొని ప్రజల నుంచి జిల్లా కలెక్టర్ అర్జీలను స్వీకరించారు. స్పందన గ్రీవెన్స్ కార్యక్రమంలో 219అర్జీలను జిల్లా కలెక్టర్ స్వీకరించడం జరిగింది. జిల్లా కలెక్టర్ తో పాటు, జాయింట్ కలెక్టర్  టీఎస్ చేతన్, డిఆర్ఓ  కొండయ్య,పుట్టపర్తి ఆర్డిఓ భాగ్య రేఖవివిధ శాఖల అధికారులు, తదితరులు పాల్గొన్నారు.*


*ఈ సందర్భంగా జిల్లాలోని ఆయా మండలాల అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జిల్లా కలెక్టర్ . స్పందన గ్రీవెన్స్ లో వచ్చిన అర్జీలను సకాలంలో పరిష్కరించాలని, రీ ఓపెన్ క్యాటగిరిలో మళ్లీ అర్జీలు మళ్లీ రాకుండా నాణ్యమైన పరిష్కారం చూపించాలని అధికారులను జిల్లా కలెక్టర్ ఆదేశించారు. స్పందన గ్రీవెన్స్ అర్జీలకు నాణ్యమైన పరిష్కారం చూపించాలని, సకాలంలో అర్జీలను పరిష్కరించాలన్నారు. 


  అధికారులు సమన్వయంతో పనిచేయాలి : జిల్లా కలెక్టర్

  వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ఆర్ ఓ ఎఫ్ ఆర్ పట్టాలు, ఆటోమెటిక్ మిల్క్ కలెక్షన్ యూనిట్స,, బల్క్ మిల్క్ కలెక్షన్ సెంటర్ యూనిట్, 90 రోజులలో ఇంటి పట్టాల పంపిణ, ఇళ్ల స్థలాల అంశమ,  కోర్టు కేసులు పరిష్కారము , ఇల్లు స్థలాలలో లబ్ధిదారులకు ఈ కేవైసీ, ఓ టి  ఎస్, ముటేషన్ నివేదిక  కార్యకలాపాలలో,  మార్పులు చేర్పులు, గడచిన నెలలో ముటేషన్ ద్వారా తొలగింపు గల కారణాలపై  చర్చించారు,నాడు  నేడు  పాఠశాలలో మరుగుదొడ్లు, అదనపు తరగతుల  భవన నిర్మాణం, ఓటర్ గుర్తింపు కార్డు కార్డుకు ఆధార్ కార్డు  అనుసంధానం, ల్యాండ్  అక్విజేషన్, రీ  సర్వే,  స్పందన , మిడిల్ ఫ్యామిలీ సీన్  ఇన్కమ్ గ్రోత్ కార్యకలాలపై సమీక్షించారు.


ప్రభుత్వ ప్రాధాన్యత భవనాలు పూర్తి చేయాలి:  జిల్లా కలెక్టర్


జిల్లాలో ప్రభుత్వ ప్రాధాన్యత భవన లైన.

సచివాలయాలు, రైతు భరోసా కేంద్రాల, విలేజ్ హెల్త్ క్లినిక్ రానున్న  నవంబర్ మాసానికి పూర్తిచేయాలని అందుకు సంబంధిత అధికారులు నిరంతరం పర్యవేక్షణ నిర్వహించాలని వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జిల్లా కలెక్టర్ అధికారులను  ఆదేశించారు. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాల అమలకు కేంద్రంగా గ్రామ సచివాలయాలు/  వార్డు సచివాలయాల ఉద్యోగస్తులు, వాలంటీర్లు పనిచేయాలని ఆదేశించారు. గ్రామ సచివాలయంలో 110 సేవలు అందుబాటులోకి ఉన్నాయని  వాటిని ప్రజలకు అందుబాటులకు తీసుకురావాలని తెలిపారు. జిల్లాలో సచివాలయాల సేవలు  ప్రజలు అందించడంలో  వేనుకబడి ఉన్న మండలాల   అగలి,  ఆమడుగురు,  హిందూపురం అర్బన్, కదిరి అర్బన్,  సోమందేపల్లి, బత్తలపల్లి ఉన్నాయని తెలిపారు. మున్సిపల్ కమిషనర్లు మరియు ఎంపీడీవోలు సచివాలయాలు పనితీరుపై ఎప్పటికప్పుడు పర్యవేక్షణ ఉండాలని తెలిపారు. జగనన్న తోడు పథకం ద్వారా  అర్హులైన లబ్ధిదారులని గుర్తించి  గ్రామీణ అభివృద్ధి శాఖలో పనిచేయుచున్న ఏపీ ఎం లబ్ధిదారులకు బ్యాంకు రుణాలు మంజూరు  వేగవంతం చేయడంలో చురుకైన పాత్ర పోషించాలని ఆదేశించారు.  రుణాల మంజూరు చేయడంలో వెనకబడిన  ఏపీఎంల ఉన్న మండలాల బుక్కపట్నం, గోరంట్ల, ముదిగుబ్బ, మడకశిర, కదిరి, నల్లచెరువు, పుట్టపర్తి , ఏపీఎంలోని హెచ్చరించారు,


ఈనెల తొమ్మిదో తేదీన డ్రాఫ్ట్ పబ్లికేషన్ ప్రజలకు అవగాహన కార్యక్రమాలు చేపట్టాలని తెలిపారు, గ్రామ, మండల, నియోజకవర్గ స్థాయిలో కార్యక్రమాలు నిర్వహించాలని తెలిపారు


గృహ నిర్మాణం పనులు  వేగవంతం చేయాలి


పేదల సొంతింటి కల నెరవేర్చినప్పు డు వారి కళ్లల్లో ఆనందం మనం చూపించిన ప్రేమ ఎంతో  సంతృప్తి స్థాయి ని ఇస్తా అన్నారు.  ఇటువంటి బృహత్తర కార్యక్రమాలలో అలసత్వం ప్రదర్శించారు రాదని తెలిపారు. ఇప్పటికైనా గృహ నిర్మాణాలపై ప్రత్యేక దృష్టి నిర్దేశించిన లక్ష్యాలను సాధించాలని కలెక్టర్ అన్నారు  గృహ నిర్మాణాలలో మన జిల్లా అగ్రగామిగా నిలపటం లో భాగస్వాములు కావాలని అధికారులను ఆదేశించారు  అనేక మున్సిపాలిటీలలో   బి లో బేస్మెంట్ స్థాయిలో ఉన్న వాటిని ప్రారంభించేలా చర్యలు తీసుకోవాలని  బేస్మెంట్ స్థాయిలో ఉన్న వాటిని  రూప్  లెవెల్  స్థాయి కి  రూప్ లెవెల్ స్థాయిలో ఉన్న వాటిని ఫినిషింగ్ స్థాయికి తీసుకు రావాలని అధికారులను ఆదేశించారు.  రాష్ట్రస్థాయిలో  నవరత్నాల పథకాల అమల లో భాగంగా  జగనన్న వైయస్సార్ గృహ నిర్మాణ పథకం అమలలో  నిర్లక్ష్యం వహించిన సిబ్బందికి మన జిల్లాలో వివిధ వార్డులలో సచివాలయాలలో  అసిస్టెంట్ ఎగ్జిక్యూటర్లు ఇంజనీర్లుగా పనిచేయుచున్న  మడకశిర అర్బన్, సోమందేపల్లి, పుట్టపర్తి అర్బన్, హిందూపురం అర్బన్ ఇంజనీర్లకు  షోకాజ్ నోటీసులు అందజేయడం జరుగుతుందని తెలిపారు. గృహ నిర్మాణాలలో  నిర్దేశించిన లక్ష్యాలను అధిగమించాలని హెచ్చరించారు.  ధర్మవరం మున్సిపాలిటీ పరిధిలో హౌసింగ్ నందు పనులలో  నిర్లక్ష్యం వహించిన ఐదు మంది సిబ్బందికి నోటీసులు అందజేయడం జరిగిందని తెలిపారు. 

పలు సంక్షేమ అభివృద్ధి పనులపై నిర్దేశించిన లక్ష్యాలను మండలాల వారీగా సంబంధిత అధికారులతో జిల్లా కలెక్టర్ బసంత్ కుమార్ సమీక్షించారు.


సోమవారం జరిగిన ప్రజా స్పందన కార్యక్రమంలో జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి ప్రజలు హాజరై పలు సమస్యలతో కూడిన వి నతులను సమర్పించారు. ఇందులో కొన్ని ఇలా ఉన్నాయి...


1. సోమందేపల్లి  ఎల్లంల గ్రామంలో నివసించు గోవిందప్ప గ్రామ పొలం సర్వేనెంబర్ నందు 339-1  సర్వే నెంబర్ నందు 1-95 సెంట్లు భూమి ఉన్నదని నా భూమిని సర్వే చేసి  భూ సరిహద్దులు చూపించవలసిందిగా వినతుల అందజేశారు


2. తాడి  మర్రి మండలం మద్దెల చెరువు గ్రామంలో నివసించు కే వెంకటేష్ అనే నేను సర్వేనెంబర్ 351 విస్తీర్ణం 9 ఎకరాలు హక్కు కలిగి ఉన్నాను కానీ ప్రస్తుతం  వెబ్  ల్యాండ్ నందు k. శ్రీనివాసులకు నమోదయి  ఉన్నది  సమగ్ర విచారణ జరిపి నా భూమికి పట్టాదారు పాస్ పుస్తకం మంజూరు చేయవలసిందిగా   వినతలు అందజేశారు.


ఈ కార్యక్రమంలో,  డి ఆర్ డి ఏ పి డి నరసయ్య DwMa పిడి  రామాంజనేయులు,  సి పి ఓ  విజయ్ కుమార్, ఎస్ సి పి ఆర్ గోపాల్ రెడ్డి,  ఆర్డబ్ల్యూఎస్ ఎస్  ఈ  రషీద్,  ఉద్యానవన శాఖ అధికారి  చంద్రశేఖర్, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.


Comments