ప్రభుత్వ బాలుర పరిశీలన గృహాన్ని సందర్శించిన బాలల కమిషన్ చైర్మన్ కేసలి అప్పారావు.

    ప్రభుత్వ బాలుర పరిశీలన  గృహాన్ని సందర్శించిన బాలల కమిషన్ చైర్మన్ కేసలి అప్పారావు.


విజయవాడ (ప్రజా అమరావతి);

విజయవాడ లోని ప్రభుత్వ పరిశీలన గృహంలో నిర్వహిస్తున్న బాలల హక్కుల వారోత్సవాలలో భాగంగా  రెండవ రోజు  ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ముఖ్య  అతిధి గా రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ చైర్ పర్సన్       శ్రీ కేసలి అప్పారావు  హాజరయ్యారు. బాలల హక్కుల పరిరక్షణకు బాలల కమిషన్ కట్టుబడి ఉన్నాయని తెలియజేసారు.బాలలు ఒక లక్ష్యాన్ని ఏర్పాటు చేసుకొని వాటిని సాధించడానికి ప్రణాళికలు సిద్ధం చేసుకొని వాటిని గమ్యానికి చేరాలని కోరారు. బాలలు మంచి మరియు చెడు రెండు అంశాలను ఈ వయస్సులో తెలుసుకోవాలని, మొబైల్ ఫోన్లు, టీవీ లకు ,సోషల్ మీడియాకు దూరంగా ఉండాలని సూచించారు. సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలని తెలిపారు. సమాజ అభివృద్ధి, దేశాభివృద్ధి, పిల్లల అభివృద్ధి పైనే ఆధారపడి ఉందని, పిల్లలు సక్రమమైన మార్గంలో పయనిస్తే, సమాజం, తద్వారా దేశం అభివృద్ధి చెందుతాయని తెలిపారు.  


అనంతరం, పరిశీలన గృహాన్ని సందర్శించి పర్యవేక్షణాధికారికి తగు సూచనలు సలహాలనిచ్చారు.   


చైల్డ్ లైన్ కోఆర్డినేటర్ శ్రీ అరవ రమేష్ తన బృందంతో కలసి ఆటపాటలతో  పిల్లలను అలరిస్తూ,  బాలల హక్కులను పాటల రూపంలో 

వినిపించారు. పిల్లలు సక్రమమైన మార్గంలో నడుస్తూ, తల్లితండ్రులకు, సమాజానికి ఉపయోగపడేలా జీవించాలని కోరుకున్నారు. 


దిశా పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ శ్రీమతి వాసవి గారు బాలలు కోసం రూపొందించ బడిన చట్టాలను తెలుసుకోవాలని వివరించారు.   హోమ్ పర్యవేక్షణాధికారి రామ్మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించబడిన  ఈ కార్యక్రమంలో బర్డ్స్ సంస్థ సెక్రటరీ శ్రీ ప్రకాష్ కుమార్, బచపన్ బచావో ఆందోళన్ సంస్థ కు చెందిన శ్రీ చంద్రశేఖర్, ఇన్టేక్ ప్రొబేషన్ అధికారి శ్రీ హాసన్ అలీ బేగ్,  జిల్లా బాలల సంరక్షణ విభాగం అధికారులు శ్రీమతి రమ, శ్రీ జివన్ గృహ సిబ్బంది పాల్గొన్నారు.

Comments