రాష్ట్రానికి పట్టిన జగనోరా వైరస్ కి టిడిపియే వ్యాక్సిన్

 రాష్ట్రానికి పట్టిన జగనోరా వైరస్ కి టిడిపియే వ్యాక్సిన్ 



- వైసీపీ గూండాల బెదిరింపులకు తెలుగుదేశం నేతలు భయపడరు.


-జగన్ రెడ్డి కేసుల కోసం రాష్ట్ర ప్రయోజనాలు తాకట్టు పెట్టేశారు.


- జగన్ రెడ్డి రాష్ట్రానికి పట్టిన ఖర్మ

మంగళగిరి (ప్రజా అమరావతి);

-మంగళగిరి నియోజకవర్గంలో  'ఇదేం ఖర్మ మన రాష్ట్రానికి' కార్యక్రమంలో టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్.


రాష్ట్రానికి పట్టిన జగనోరా వైరస్ వదిలించాలంటే టిడిపి వ్యాక్సిన్ వేయాల్సిందేనని టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ అన్నారు. మంగళగిరి నియోజకవర్గం తాడేపల్లి టౌన్ సీతానగరం లో బుధవారం నిర్వహించిన 'ఇదేం ఖర్మ మన రాష్ట్రానికి' కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు.  స్థానికుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతూ

జగన్ రెడ్డి రాష్ట్రానికి పట్టిన ఖర్మ అని అన్నారు. వైసీపీ ఎమ్మెల్యే సోదరుడు మమ్మల్ని చంపుతామని బెదిరిస్తున్నాడని, బెదిరింపులకు భయపడేవారు ఎవరూ లేరని హెచ్చరించారు. వివేకానందరెడ్డి హత్యలో మాపై జగన్ రెడ్డి గ్యాంగ్ ఆరోపణలు చేయడంతో..ఆ హత్యతో సంబంధం లేదని తిరుపతిలో నేను ప్రమాణం చేశానని,  వైసీపీ నేతలు ప్రమాణం చేయకుండా వైసీపీ నేతలు పారిపోయారని, హంతకులెవరో దీంతోనే తేటతెల్లమైందన్నారు. జగన్ రెడ్డి విధ్వంస పాలన చూసి కొత్త పరిశ్రమలు రావట్లేదు, ఉన్నవి తరలిపోతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. తన కేసుల కోసం రాష్ట్ర ప్రయోజనాలు తాకట్టు పెట్టిన జగన్ రెడ్డి ముఖ్యమంత్రి కావడం రాష్ట్ర ప్రజల ఖర్మ అని ఆరోపించారు. అసెంబ్లీలో అమరావతికి తమ విధానం అనుకూలమని చెప్పి మోసం చేసి మూడు ముక్కలాటకి తెరతీసిన జగన్ రెడ్డి రాష్ట్ర ప్రజలకి సమాధానం  చెప్పాలని డిమాండ్ చేశారు. జగన్ రెడ్డి పాలనలో అన్ని రంగాల్లో రాష్ట్రం వెనకబడిందని ఆవేదన వ్యక్తం చేశారు. వైసీపీ పెద్దల భూకబ్జాలు చూసిన తరువాతైనా విశాఖ ప్రజలు ఆలోచించాలని కోరారు. అమరావతిలోనే హైకోర్టు వుంటుందని జగన్ రెడ్డి న్యాయవాది సుప్రీంకోర్టుకి తెలిపారని, న్యాయరాజధాని పేరుతో కర్నూలు ప్రజలను కూడా మోసగించిన జగన్ నిజస్వరూపం బట్టబయలైందన్నారు.

సీతానగరం ప్రాంతంలో ఇళ్ల పట్టాల సమస్యని తెలుగుదేశం అధికారంలోకి వచ్చిన వెంటనే పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. ఏ ఊరు వెళ్లినా, ఏ వీధిలో పర్యటించినా.. ప్రజలు ఇదేం పాలన, ఇదేం ఖర్మ మన రాష్ట్రానికి అని బాధపడుతున్నారని.. ఇంతటి ప్రజా వ్యతిరేకత మూటగట్టుకున్న వైసీపీ సర్కారు త్వరలోనే దిగిపోక తప్పదన్నారు.

Comments