ఓటరుగా నమోదు చేసుకోవాలి...
శ్రీ సత్యసాయి జిల్లా, పుట్టపర్తి నవంబర్ 10 (ప్రజా అమరావతి):
జిల్లా పరిధిలో 18 సంవత్సరాల నిన్న యువతీ యువకులు ఓటరుగా నమోదు చేసుకోవాలని
జిల్లా కలెక్టర్ బి. బసంత్ కుమార్ కోరారు. బుధవారం ఉదయం పుట్టపర్తి మండలం బీడుపల్లి లోని సంస్కృతి కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ కళాశాలలోని విద్యార్థులకు ప్రత్యేకంగా ఏర్పాటుచేసిన స్వీప్ కార్యక్రమం ద్వారా అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ భారత ఎన్నికల కమిషన్ ప్రత్యేక ఓటరు జాబితా సవరణను విడుదల చేసిన నేపథ్యంలో ఓటరు జాబితాకు సంబంధించి ఏవైనా అభ్యంతరాలు, తప్పుగా ఉన్న పేర్లు, చిరునామాలు ఇతర విషయాలను సవరణ చేసేందుకు వెసులుబాటు ఉందని తెలిపారు.
అలాగే నూతన ఓటనమోదుకు ఫారం -6 ,ఓటరు జాబితా నుండి పేరు తొలగింపు కోసం ఫారం - 7 అలాగే నివాస ప్రాంతం అడ్రస్ మార్పు కొరకు ఫారం -8 ఒకే నియోజ క వర్గములో ఒక పోలింగ్ స్టేషన్ నుండి మరొక పోలింగ్ స్టేషన్ కు మార్పుకోసం ఫారము 8-ఎ ను, ఫారము 6-ఏ ను యన్.ఆర్.ఐ లు కూడా ఉపయొగించ వచ్చునని మరియు ఓటరు కార్డు కు ఆధార్ అనుసందానము కొరకు ఫారము 6-బి ను ఉపయొగించ వచ్చునని కలెక్టర్ సూచించారు. ఓటు హక్కు సంక్షేమానికి, అభివృద్ధికి పునాది లాంటిదని పేర్కొన్నారు. అర్హత కలిగిన వారందరూ కూడా ఓటు నమోదు చేసుకోవాలని ఇది నిరంతర ప్రక్రియఅని తెలిపారు. నియోజకవర్గ ప్రాంతాలలో ఏర్పాటుచేసిన బిఎల్ ఓ ల ద్వారా ఓటు నమోదు, ఆధార్ లింకేజీ , ఆన్లైన్ ద్వారా www.ceoandhra.nic.in or Nvsp portal ద్వారా ఓటరు నమోదు చేసు కోవచ్చునని కలెక్టర్ వివరించారు. నేటి యువత విద్యతోపాటు నైతిక విలువలను పెంపొందించుకున్నప్పుడే దేశాభివృద్ధి సాధ్యమవుతుందన్నారు. దేశం, రాష్ట్రం ,జిల్లా అభివృద్ధి పథంలో ముందుకు సాగాలంటే ప్రజలకు సుపరిపాలన అందించే ఒక మంచి లక్షణాలు కలిగిఉన్న అభ్యర్థిని నిర్ణయించుకొని ఎన్నికల సమయంలో ఓటు హక్కు ద్వారా ఎన్నుకోవాలన్నారు. ప్రతి పౌరునికి భారత రాజ్యాంగం కల్పించిన హక్కులలో ఓటు హక్కు ఎంతో ప్రధానమైనదని తెలిపారు. సమాజంలోని విద్యావంతులు, ప్రజలు ఓటు విలువ తెలుసుకొని ప్రజాస్వామ్య పద్ధతిలో నిజాయితీగా ఓటు వేయాలని ఎలాంటి ప్రలోభాలకు తావివ్వకుండా ఆయా నియోజకవర్గాల అభివృద్ధి కోసం పాటుపడే వారిని ప్రోత్సహించాలన్నారు.. జిల్లాలో సుమారు 20 లక్షల మంది జనాభా కలిగి ఉండగా ఇందులో 13 లక్షల మంది ఓటర్లు నమోదు అయినట్లు గణాంకాలు చెబుతున్నాయని తెలిపారు. ముఖ్యంగా యువత ఓటరుగా నమోదు కార్యక్రమాల్లో చైతన్యవంతులుగా ఎదగాలన్నారు. రాబోయే జనవరి మాసంలో జాతీయ ఓటర్ల దినోత్సవం నాటికి ఓటరు గుర్తింపు ఏపిక్ కార్డు కలిగి ఉండాలని విద్యార్థులకు సూచించారు. వచ్చే అన్ని ఎన్నికల్లో ఓటు హక్కును సద్వినియోగం చేసుకోవాలన్నారు. అనంతరం గత రెండు మాసాలుగా రూపొందించిన ఓటర్ల సవరణ జాబితా జిల్లా కలెక్టర్ ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ఆర్డిఓ భాగ్యరేఖ, పుట్టపర్తి తాసిల్దార్ దేవేంద్ర నాయక్, ఎన్నికల విభాగం తాసిల్దార్ నరసింహులు, స్పందన తాసిల్దార్ గోపాలకృష్ణ, ప్రిన్సిపాల్ డా. సింధిల్ కుమార్, వైస్ ప్రిన్సిపాల్ నాగరాజు హెచ్.ఓ.డి. రాఘవేంద్ర తదితరులు పాల్గొన్నారు.
addComments
Post a Comment