*రాష్ట్రంలో అల్లర్లకు ప్రతిపక్షాల కుట్ర*
– ఎల్లోమీడియాను అడ్డుపెట్టుకుని రాజకీయం
– చిన్న సమస్యనూ రాష్ట్ర సమస్యగా చిత్రీకరించేయత్నం
– ప్రభుత్వ సంక్షేమ పథకాలపై ప్రజల్లో సంతృప్తి
– వచ్చే ఎన్నికల్లోనూ వైసీపీ విజయం ఖాయం
– ఎమ్మెల్యే అనంత వెంకటరామిరెడ్డి స్పష్టీకరణ
– 32వ
డివిజన్‌లో గడప గడపకు మన ప్రభుత్వం
అనంతపురం, నవంబర్ 8 (ప్రజా అమరావతి):
రాష్ట్రంలో అల్లర్లు సృష్టించడానికి ప్రతిపక్షాలు కుట్రలు చేస్తున్నాయని అనంతపురం ఎమ్మెల్యే అనంత వెంకటరామిరెడ్డి అన్నారు. ఎల్లోమీడియాను అడ్డుపెట్టుకుని చిన్న సమస్యను కూడా రాష్ట్ర సమస్యగా చిత్రీకరిస్తున్నారని మండిపడ్డారు. మంగళవారం నగరంలోని 32వ డివిజన్‌లో కార్పొరేటర్ కమల్‌భూషణ్‌తో కలిసి గడప గడపకు మన ప్రభుత్వం నిర్వహించారు. ప్రతి ఇంటికి వెళ్లి మూడేళ్లుగా ఆయా కుటుంబాలకు ప్రభుత్వ సంక్షేమ పథకాలతో కలిగిన లబ్ధిని వివరించారు. స్థానికంగా నెలకొన్న సమస్యలపై ఆరా తీసి వాటి పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే అనంత మాట్లాడుతూ వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి నాయకత్వంలో వైసీపీ అధికారంలోకి వచ్చి మూడేళ్ల మూడు నెలలైందన్నారు. గతంలో ఎవరూ చేయని విధంగా సంక్షేమం, అభివృద్ధి కార్యక్రమo.
addComments
Post a Comment