స్పందనకు 141 వినతులు బ్యాక్ లాగ్ ఖాళీల వివరాలను తెలపాలి


స్పందనకు 141 వినతులు

బ్యాక్ లాగ్ ఖాళీల వివరాలను తెలపాలి 


గృహ ప్రవేశాలకు ప్రత్యేకాధికారులు సిద్ధంగా ఉండాలి 

జిల్లా కలెక్టర్ ఎ. సూర్య కుమారి

విజయనగరం, డిసెంబరు 05 (ప్రజా అమరావతి):  సోమవారం కలెక్టరేట్ నందు నిర్వహించిన స్పందనకు ప్రజల నుండి 141    వినతులు అందాయి. వీటిలో వైద్య శాఖకు 26,  డి.ఆర్.డి.ఏ.కు 03,  హౌసింగ్ కు 07, మున్సిపల్ శాఖకు 01, ఇతర శాఖలకు సంబంధించి 22 అందగా అత్యధికంగా రెవిన్యూ కు సంబంధించి 82  వినతులు అందాయి. ముఖ్యంగా  సదరం, పింఛన్లు, ఇళ్ల స్థలాలు, భూ సమస్యలు, గృహాల కోసం విజ్ఞప్తులు వచ్చాయి. ఈ వినతులను జిల్లా కలెక్టరు ఎ. సూర్య కుమారి, జె.సి మయూర్ అశోక్, డి.ఆర్.ఓ గణపతి రావు   ఉప కలెక్టర్లు సుదర్శన  దొర, సూర్యనారాయణ, పద్మావతి  స్వీకరించారు.

అనంతరం అధికారులతో కలెక్టర్ మాట్లాడుతూ  రీ ఓపెన్ అయిన దరఖాస్తులు అందిన రోజే విచారణా అధికారికి పంపాలని సూచించారు. ఈ   వినతుల  అధికారులు ప్రత్యేక దృష్టి పెట్టి అర్ధవంతమైన సమాధానాలను ఇవ్వాలని కలెక్టర్ సూచించారు.  రీ ఓపెన్ అయిన దరఖాస్తులకు సంబంధించి దరఖాస్తుదరులతో మాట్లాడిన తర్వాతనే డిస్పోజ్ చేయాలనీ ఆదేశించారు. ఫోటోలను తప్పకుండ అప్ లోడ్ చేయాలన్నారు.  నిర్దేశిత గడువులోగా రీ ఓపెన్ దరఖాస్తులను పరిష్కరించక పోతే తర్వాత డిస్పోజ్ చేయడానికి కుదరదని తెలిపారు. 

బ్యాక్ లాగ్ ఖాళీల వివరాలను తెలపాలి :

ప్రభుత్వ శాఖలన్నింటిలో  ఖాళీ గ నున్న బ్యాక్  లాగ్ పోస్ట్ ల వివరాలను వెంటనే డి.ఆర్. ఓ కు అందజేయాలని కలెక్టర్ ఆదేశించారు.  ఎదైనా శాఖ లో ఖాళీలు లేకపోయినా లేవనే సర్టిఫికేట్ ను అందజేయాలని, ప్రతి శాఖ అధికారి  వెంటనే ఈ విషయం లో చర్యలు తీసుకోవాలని సూచించారు. 

గృహ ప్రవేశాలకు ప్రత్యేకాధికారులు సిద్ధంగా ఉండాలి: 

పేదలందరికీ ఇళ్ళు పధకం క్రింద జగనన్న కాలనీలలో ఈ నెల 21 న జరిగే గృహ ప్రవేశాలకు మండల  ప్రత్యేకాధికారులంతా  సిద్ధంగా ఉండాలని కలెక్టర్ తెలిపారు.  అధికారులు ఎలాంటి సెలవులు పెట్టరాదని,  ఈ లోపల ఎప్పటికప్పుడు పురోగతి పై వివరాలను తనిఖీ చేయాలనీ, రోజు వారీ ప్రగతి పై నివేదికలను పంపాలని అన్నారు.  ప్రతి శనివారం జరుపుకుంటున్న హౌసింగ్ డే ను రెండవ శనివారం సెలవు కావడం వలన శుక్రవారమే జరుపుకోవాలని  తెలిపారు. 

కొత్తగా వివాహం జరిగిన జంటలతో ప్రతి మండల కేంద్రం లో సమావేశాలు ఏర్పాటు చేయాలనీ తెలిపారు.  ఈ సమావేశాలను  ఐ.సి.డి.ఎస్., వైద్య ఆరోగ్య శాఖ ల అధికారుల  ఆధ్వర్యం లో జరపాలన్నారు. ఈ సమావేశాల్లో  వివాహానంతరం పిల్లల్ని కనడం, తీసుకోవలసిన జాగ్రత్తలు, ఆరోగ్య సమస్యలు, సమతుల  ఆహారం, హెచ్.బి, కుటుంబ నియంత్రణ  తదితర అంశాల పై అవగాహన కలిగించాలని తెలిపారు. ఆరోగ్యపరమైన అపోహలను తొలగించాలని,  అన్నారు.  పాఠశాల లకు మధ్యలో మానివేసిన వారిని మండల వారీగా ఉన్న జాబితాలను గుర్తించి బ్రిడ్జి కోర్స్ నిర్వహించి వారిని తిరిగి బడికి పంపేలా చూడాలని ప్రత్యెక అధికారులకు సూచించారు. 


Comments