ప్రభుత్వం అందిస్తున్న ఏ ఒక్క పింఛన్ ను కూడా తొలగించడం లేదు


నెల్లూరు, డిసెంబర్ 24  (ప్రజా అమరావతి): ప్రభుత్వం అందిస్తున్న ఏ ఒక్క పింఛన్ ను కూడా తొలగించడం లేద
ని,  అసత్య ప్రచారాలు నమ్మొద్దని, ఎవరూ ఎలాంటి ఆందోళన చెందొద్దని రాష్ట్ర వ్యవసాయ, సహకార, మార్కెటింగ్, ఫుడ్ ప్రాసెసింగ్ శాఖ మంత్రి శ్రీ కాకాణి గోవర్ధన్ రెడ్డి స్పష్టం చేశారు. 


శనివారం సాయంత్రం సర్వేపల్లి నియోజకవర్గం వెంకటాచలం మండలం పాలిచర్లపాడు గ్రామంలో  గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో పర్యటించిన  మంత్రికి గ్రామ ప్రజలు ఘన స్వాగతం పలికారు.   ప్రతి ఇంటికి వెళ్లిన మంత్రి ప్రజలను ఆప్యాయంగా పలకరిస్తూ వారికి అందిన ప్రభుత్వ సంక్షేమ పథకాలను తెలియజేసి, ఇంకా ఏమైనా సమస్యలు ఉన్నాయా అని ఆరాతీశారు. 


తొలుత గ్రామంలో నూతనంగా నిర్మించిన రైతు భరోసా కేంద్రాన్ని మంత్రి ప్రారంభించారు. 


అనంతరం మంత్రి మీడియాతో మాట్లాడుతూ పింఛన్లు తొలగిస్తున్నారని కొంతమంది కావాలని అసత్య ప్రచారం చేస్తున్నారని, దీనిని ఎవరు నమ్మొద్దని సూచించారు. కేవలం 6 నెలలకు ఒకసారి ప్రభుత్వం వద్ద ఉన్న సమాచారం ఆధారంగా,  300 యూనిట్లు దాటిన కరెంట్ బిల్లులు, సొంత వాహనం, ఇన్కమ్ టాక్స్ చెల్లించడం వంటి అంశాలు తమ పరిశీలనలో ఉందని, వీటిని విచారించి నిర్ధారించమని సచివాలయాలకు ప్రభుత్వం సూచించిందని, ఆ మేరకు ప్రభుత్వ నిబంధనల పరిధిలోకి వచ్చిన వారికి సచివాలయాల ద్వారా నిర్ధారించుకునేందుకు నోటీసులు ఇవ్వడం జరుగుతుందన్నారు. గతంలో 3.10 లక్షల మందికి నోటీసులు ఇస్తే 2.60 లక్షల మందికి పెన్షన్లు పునరుద్ధరించినట్లు చెప్పారు. ఎవరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని,  అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి పింఛన్ను ఇస్తున్నామని, ఏ ఒక్కరికి తొలగించడం లేదన్నారు. జనవరి ఒకటి నుంచి 250 రూపాయలు పెంచి 2750 రూపాయలు సంక్రాంతి కానుకగా అందచేస్తున్నట్లు చెప్పారు. నోటీసులు అందిన పించన్దారులు ప్రభుత్వ నిబంధనల మేరకు నోటీసులో పేర్కొన్న అంశాలను నిర్ధారించి, పొరపాటు ఉంటే సరిచేసుకుని సచివాలయాలను సంప్రదించాలని సూచించారు. అర్హత ఒకటే ప్రామాణికంగా ఎటువంటి దళారులు, నాయకులు లేకుండా నేరుగా  సంక్షేమ పథకాలను ప్రజలకు చేరవేస్తున్నట్లు చెప్పారు. గ్రామాల అభివృద్ధి, సమగ్రంగా సంక్షేమ పథకాలు అందించడమే లక్ష్యంగా పని చేస్తున్నట్లు చెప్పారు. 


ఈ కార్యక్రమంలో జిల్లా వ్యవసాయ అధికారి సుధాకర్ రాజు, ఎంపీడీవో సుస్మిత తాసిల్దారు  నాగరాజు, స్థానిక నాయకులు, సచివాలయ సిబ్బంది, వివిధ శాఖల మండల స్థాయి అధికారులు పాల్గొన్నారు.


Comments