క్రైస్తవ సోదర సోదరీమణులకు క్రిస్మస్ శుభా కాంక్షలు *క్రైస్తవ సోదర సోదరీమణులకు క్రిస్మస్ శుభా కాంక్షలు


*


చిత్తూరు, డిసెంబర్ 23 (ప్రజా అమరావతి):


శుక్రవారం సాయం త్రంజిల్లాసచివాలయం లోనిసమావేశం మందిరం లో రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఘనంగా క్రిస్మస్ హైటీ కార్యక్రమం ఘనంగా జరిగింది


ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధులు గా గౌ. రాష్ట్ర ఉప ముఖ్య మంత్రి కె.నారాయణస్వామిగౌ.రాష్ట్రఅటవీ,విద్యుత్,పర్యావరణ,భూగర్భ గనుల శాఖమంత్రి డా. పెద్దిరెడ్డి రామ చంద్రా రెడ్డి, గౌ.జడ్పీ చైర్మన్ గోవిందప్ప శ్రీనివాసు లు,జిల్లా కలెక్టర్ యం.హరినారాయణన్,గౌ.చిత్తూరు ఎం ఎల్ ఎ ఆరణి శ్రీని వాసులు,గౌ.చిత్తూరు నగర మేయర్ అముద,డి ఆర్ ఓ ఎన్.రాజశేఖర్,  జడ్పీ వైస్ చైర్మన్ ధనుంజయ రెడ్డి, చిత్తూరు నగర ఉప మేయర్ రాజేష్ కుమార్ రెడ్డి,పలమ నేరు కుప్పం మదన పల్లె అర్బన్ డేవల ప్మెంట్ అథారిటీ చైర్మన్ వెంకట రెడ్డి యాదవ్,జిల్లా అధి కారులు తదితరులు పాల్గొన్నారు.


 *జిల్లా కలెక్టర్ ప్రారంభ ఉప న్యాసం చేస్తూ ...* క్రైస్తవులకు ముఖ్య మైన పండుగ క్రిస్మస్ అని...రాష్ట్ర ప్రభు త్వం సామాజిక న్యాయం కోసం అభి వృద్ధి సంక్షేమ కార్య క్రమాలకుఎస్.సి,ఎస్టి,బీసీ,మైనారిటీ ఇలా అన్ని వర్గాల సంక్షే మముకోసంపథకాల అమలు చేయడం జరుగు తున్నదని తెలిపారు.


 *రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మాట్లాడుతూ..* 


ప్రజల క్షేమం కోసం అడగ కుండానే సంక్షేమ పథకాలు అమలు చేస్తున్న దయార్ద్ర హృదయం కలిగిన మన ముఖ్య మంత్రి వై.ఎస్.జగన్ మోహన్ రెడ్డి అని, అన్ని మతాలను సమానంగాచూస్తున్న మన ముఖ్య మంత్రి పాస్టర్లు లతో పాటు హాజరత్ లకు 

గౌరవ వేతనం ఇవ్వ డం జరుగు తున్న దని,సంక్షేమ పథకా లకు పేదరికమే ప్రామాణికము గా అమలు చేయడం జరుగుతున్నదని,అందరికీ క్రిస్మస్ శుభా కాంక్షలు తెలిపారు.

 

 *రాష్ట్ర అటవీ, విద్యు త్,పర్యా వరణ, శాస్త్ర సాంకేతిక భూగర్భ గనుల శాఖ మంత్రి మాట్లాడుతూ..* 


రాష్ట్ర ముఖ్యమంత్రి రాష్ట్రాన్ని అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తున్నారని,చర్చి పాస్టర్ లకు ప్రోత్సా హక పథకం ద్వారా ఆదాయం తక్కువ ఉన్న చర్చి పాస్టర్లకు కోవిడ్ సమయంలో రూ. 5000/-  ప్రత్యే క ఆర్థిక సాయం కింద రూ. 34.65 లక్షలు ఇవ్వడం జరి గిందని,పూజారులు, ఇమామ్ లకు గౌరవ వేతనం ఇవ్వడం జరుగు తున్నదని,2021-22 సం. లో వైయస్సార్ చేయూ త పథకం కింద క్రిస్టి యన్, మైనారిటీ మహిళలకు రూ. 62 లక్షలు,2022-23 సంవత్సరమునకు 381 మందికి  రూ.71.4 లక్షలు మంజూ రు చేయడమైనదని, పేద క్రిస్టియన్ మైనా రిటీ లబ్ధిదారులకు

స్వయం ఉపాధి కింద 35లక్షలు,ప్రీ మెట్రిక్, పోస్ట్ మెట్రిక్ ఉపకార వేతనాలు, మెరిట్ కం మీన్స్ ఉపకార వేతనాలు ప్రొఫెషనల్ కోర్సులు చేసే వారికి ఉపకార వేతనాలు,పవిత్ర జెరూసలేం యాత్ర పథకం ద్వారా  3 లక్షల కన్నా తక్కువ ఆదాయం   ఉన్న వారికి రూ.40 వేల నుండి 60 వేల  వర కు సబ్సిడీ పెంచడం అయినదనిమరియు ఆదాయం మూడు లక్షల కన్నా ఎక్కువ ఉన్నవారికి 20వేల నుండి 30 వేల కు సబ్సిడీని పెంచడం అయినదని,చర్చిల నిర్మాణం నకు మరి యు మరమ్మత్తులకు ప్రహరీ గోడల నిర్మా ణమునకు మూడు లక్షల వరకు ఆర్థిక సాయం తోపాటు పాఠశాలలకు వృద్ధా శ్రమాలకు అనాధా శ్రమాలకు క్రైస్తవ కమ్యూనిటీ హాల్స్ కు రూ. 5 లక్షల వరకు ఆర్థిక సాయం అందిస్తున్నామని క్రైస్తవ స్మశాన వాటిక లకు ప్రహరీ గోడల నిర్మాణం సుం దరీ కరణ తదితర అంశాలకు గ్రామీణ ప్రాంతాల యందు 3 లక్షలు ఆర్థికసాయం, పట్టణ ప్రాంతాల యందు ఐదు లక్షలు వరకు ఆర్థిక సాయం అంది స్తున్నామని తెలిపారు.ముఖ్యమంత్రిపాదయాత్ర చేసిమనఇబ్బందులు తెలుసుకొని రెండు పేజీల మ్యాని ఫెస్టో ను అమలు చేస్తున్నారని తెలి పారు. అందరికీ 

క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు.


 *జడ్పీ చైర్మన్ మాట్లాడుతూ...* 


భారత దేశం  అన్ని మతాల సమ్మేళన అని..విభిన్న మతా లు,కులాలు గల మన దేశంలో భిన్న త్వంలో ఏకత్వం కలదని,అందరికి  క్రిస్మస్ శుభా కాంక్షలు

అని తెలిపారు.


  

 *చిత్తూరు ఎం ఎల్ ఎ మాట్లాడుతూ..* 


రాష్ట్ర ముఖ్యమంత్రి  అన్ని వర్గాల సంక్షే మం కోసం పథకాలు అమలు చేస్తున్న ఏకైక ముఖ్య మంత్రి వై.ఎస్.జగన్మోహన్ రెడ్డి అని,అందరికి  క్రిస్మస్ శుభా కాంక్షలు

అని తెలిపారు.


క్రిస్మస్ హైటీ కార్య క్రమంలో భాగంగా ముఖ్య అతిథులచే కేక్ కట్ చేసి క్యాండి ల్ వెలిగించి క్రైస్తవ సోదర సోదరీ మణు లందరికీ రాష్ట్ర ప్రభు త్వం తరఫున క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు..


ఈ కార్యక్రమం జిల్లా మైనారిటీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో జరగగా జిల్లా క్రిస్టి యన్ మైనారిటీ కార్పొరేషన్ డైరెక్టర్ ప్రగతి,మైనారిటీ అధికారి చిన్నారెడ్డి, డి ఆర్డిఎ పి డి తులసి, జెడ్పిసిఈఓ ప్రభాకర్ రెడ్డి, ఐ సి డి ఎస్ పి డి నాగ శైలజ,డీఈఓ విజ యేంద్ర రావు, ఎస్సీ కార్పొరేషన్ ఈడీ నరసింహులు, గిరిజన సంక్షేమ శాఖ అధికారి మూర్తి, బీసీ కార్పొరేషన్ ఈడీ సుబ్రహ్మణ్యం,పాస్టర్లు తదితరులు పాల్గొన్నారు..


Comments