ప్రతి అర్జీకి పరిష్కారం చూపాలి

 ప్రతి అర్జీకి  పరిష్కారం చూపాలిప్రాధాన్యత అంశాలపై ప్రత్యేక శ్రద్ధ వహించాలి


జిల్లా కలెక్టర్  బసంత్ కుమార్


*: పుట్టపర్తి కలెక్టరేట్లో స్పందన గ్రీవెన్స్ కార్యక్రమంలో పాల్గొని ప్రజల నుంచి అర్జీలను స్వీకరించిన జిల్లా కలెక్టర్*


పుట్టపర్తి,  డిసెంబర్ 5 (ప్రజా అమరావతి):


స్పందన అర్జీల  పరిష్కారంలో జాప్యం తగదని  సంబంధిత అధికారులను జిల్లా కలెక్టర్ బసంత్ కుమార్ ఆదేశించారు.   సోమవారం పుట్టపర్తి కలెక్టరేట్లోని వీడియో కాన్ఫరెన్స్ హాల్లో నిర్వహించిన స్పందన గ్రీవెన్స్ కార్యక్రమంలో పాల్గొని ప్రజల నుంచి జిల్లా కలెక్టర్ అర్జీలను స్వీకరించారు. స్పందన గ్రీవెన్స్ కార్యక్రమంలో  130 అర్జీలను జిల్లా కలెక్టర్ స్వీకరించడం జరిగింది. జిల్లా కలెక్టర్ తో పాటు  ఇంచార్జ్  డిఆర్ఓ   మరియు పుట్టపర్తి ఆర్డిఓ భాగ్య రేఖవివిధ శాఖల అధికారులు, తదితరులు పాల్గొన్నారు.*


*ఈ సందర్భంగా జిల్లాలోని ఆయా మండలాల అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జిల్లా కలెక్టర్  మాట్లాడుతూ. స్పందన గ్రీవెన్స్ లో వచ్చిన ప్రతి అర్జీ కి పరిష్కారం చూపాలని  అధికారులను ఆదేశించారు. రీ ఓపెన్ క్యాటగిరిలో మళ్లీ అర్జీలు మళ్లీ రాకుండా నాణ్యమైన పరిష్కారం చూపించాలని అధికారులను జిల్లా కలెక్టర్ ఆదేశించారు.  అర్జీలు పరిష్కరించిన వెంటనే ఫోటో తీసి  నవ శకం పోర్టలో  అప్లోడ్ చేయాలి అన్నారు.   ఈ విషయాన్ని పదేపదే చెబుతున్న  కొందరు అధికారులస్పందించలేదని. అలాంటి వారిపై ఇకనుంచి  చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.


ప్రభుత్వ ప్రాధాన్యత భవనాలు పూర్తి చేయాలి:  జిల్లా కలెక్టర్


జిల్లాలో ప్రభుత్వ ప్రాధాన్యత భవన లైన సచివాలయాలు, రైతు భరోసా కేంద్రాల, విలేజ్ హెల్త్ క్లినిక్ రానున్న   డిసెంబర్ మాసానికి పూర్తిచేయాలని అందుకు సంబంధిత అధికారులు నిరంతరం పర్యవేక్షణ నిర్వహించాలని వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జిల్లా కలెక్టర్ అధికారులను  ఆదేశించారు, నిర్లక్ష్యం వహించిన అధికారులపై క్రమశిక్షణ చర్యలు  చేపట్టడం జరుగుతుందని తెలిపారు.  వివిధ కోర్టులలో పెండింగ్లో ఉన్న కేసులకు కౌంటర్ ఫైల్ వేయాలని  తాసిల్దారులను హెచ్చరించారు  నిర్లక్ష్యం వహించిన  తాహిల్దార్లపై సిసిఎల్ రూల్స్ కింద క్రమశిక్షణ చర్యలు చేపట్టడం జరుగుతుందని  హెచ్చరించారు. పెనుగొండ, చిలమత్తూరు, మడకశిర, ధర్మవరం, ముదిగుబ్బ, లేపాక్షి, పుట్టపర్తి  మండలాల  తాసిల్దార్లు  వివిధ కేసులకు కౌంటర్ ఫైలు దాఖలు చేయాలని తెలిపారు, ఆమడగురు, అమలాపురం సచివాలయాల్లో పనిచేస్తున్న హెల్పర్ అసిస్టెంట్, మహిళ పోలీస్, మరియు ఇంజనీరింగ్ అసిస్టెంట్లు  వసతి గృహాలను గురువారం లోపల తనిఖీలు చేయాలని ఆదేశించారు. డాట్ ల్యాండ్ పై C.k.పల్లి తహల్దారును  నివేదికలను  త్వరితిగతిన సిద్ధం చేయాలని అటువంటి నివేదికలను కలెక్టర్ కార్యాలయానికి సమర్పించవలసిందిగా  తాసిల్దారులను ఆదేశించారు,  లోకాయుక్త కేసులను నిర్లక్ష్యం చేయరాదని తాసిల్దారులను మరియు ఆర్డిఓ లను ఆదేశించారు


గృహ నిర్మాణం పనులు  వేగవంతం చేయాలి


గృహ నిర్మాణాలపై ప్రత్యేక దృష్టి నిర్దేశించిన లక్ష్యాలను సాధించాలని కలెక్టర్ అన్నారు  గృహ నిర్మాణాలలో మన జిల్లా అగ్రగామిగా నిలపటం లో భాగస్వాములు కావాలని అధికారులను ఆదేశించారు  అనేక మున్సిపాలిటీలలో   బి లో బేస్మెంట్ స్థాయిలో ఉన్న వాటిని ప్రారంభించేలా చర్యలు తీసుకోవాలని  బేస్మెంట్ స్థాయిలో ఉన్న వాటిని  రూప్  లెవెల్  స్థాయి కి  రూప్ లెవెల్ స్థాయిలో ఉన్న వాటిని ఫినిషింగ్ స్థాయికి తీసుకు రావాలని అధికారులను ఆదేశించారు. ఇళ్ల నిర్మాణపు వారపు లక్ష్యాల ప్రగతిని జిల్లా కలెక్టర్ పరిశీలిస్తూ స్టేజ్ కన్వర్షన్ లో పలు మండలాలు వెనుకబడి ఉన్నాయని స్థానిక సమస్యలు ఉంటే పరిష్కరించుకొని కేటాయించిన లక్ష్యాన్ని అధిగమించాలని కలెక్టర్ హౌసింగ్ ఇంజనీర్లు అసిస్టెంట్లను  మరియుఎంపీడీవోలను ఆదేశించారు. గృహ నిర్మాణ ప్రగతిలో కుంటి సాకులు చెప్పకుండా నిర్మాణాల ప్రగతిపై దృష్టి సారిస్తే ఫలితాలు ఉంటాయన్నారు.  లబ్ధిదారుల మోటివేషన్ లేనప్పటికీ జియో ట్యాగింగ్, రిజిస్ట్రేషన్ లలో ఆలస్యం ఎందుకు జరుగుతుందని  కలెక్టర్ ప్రశ్నించారు. లేఔట్లలో ఎలాంటి సమస్యలు ఉత్పన్నం కాకుండా  హౌసింగ్ పిడి, ఈఈ, డిఈలు ప్రతిరోజు సమీక్షించాలని. బుక్కపట్నం, అమడుగురు, బత్తలపల్లి, ధర్మవరం అర్బన్, హిందూపురం అర్బన్, కదిరి అర్బన్,  చిలమత్తూర్, సోమందేపల్లి, గోరంట్ల, గృహ నిర్మాణంలో పనులలో ఇంజనీరింగ్ అసిస్టెంట్లు వెనకబడి ఉన్నారని, మరింత  పురోగతి సాధించాలని  అధికారులను ఆదేశించారు. నిర్లక్ష్యం వహించిన అధికారులపై కఠిన మైన చర్యలు చేపట్టడం జరుగుతుందని తెలిపారు. డిసెంబర్ 21వ తేదీన సామూహిక గృహ నిర్మాణం  కార్యక్రమాలు

నిర్వహించడం జరుగుతుందని  తెలిపారు


ఈరోజు నిర్వహించిన ప్రజాస్పందనలో వచ్చిన  వినతుల వివరాలు ఇలా ఉన్నాయి

1.  బి వెంకటేష్  బుక్కపట్నం మండలం  రాసంపల్లి అగ్రహారంలో నివసించుచున్నానని   సర్వే నెంబర్ 7. రెండు ఎకరాల భూమి ఉన్నదని నా భూమిని సర్వేహద్దులు గుర్తించి సర్వే చేయవలసిందిగా వినతుల అందజేశారు.


 2.శ్రీ సత్య సాయి జిల్లాలో అమరాపురం మండలంలో బసనపల్లి గ్రామ పొలం సర్వేనెంబర్ 420.4  ఎక్స్టెన్షన్ ఒక ఎకరా భూమి ఉన్నది చంద్రప్ప అను వారి నుండి దాన సెటిల్మెంట్ పత్రం ద్వారా పొందినాను. పై తెలిపిన భూమికి నాకు పట్టాదార్ పాస్ పుస్తకం మంజూరు చేయగలరని ప్రార్థించుచున్నాను.


ఈ కార్యక్రమంలో   స్పందన తాసిల్దార్  గోపాలకృష్ణ,డిఆర్డిపీడి నరసయ్య, dwma పిడి  రామాంజనేయులు, సిపిఓ విజయ్ కుమార్,  హౌసింగ్ పిడి నాగరాజు, ఎస్ సి పి ఆర్  గోపాల్ రెడ్డి, ఎస్సీ ఈ ఆర్డబ్ల్యూఎస్ రషీద్, జిల్లాలోని వివిధ  ఉన్నత శాఖ అధికారులు  తదితరులుపాల్గొన్నారు.

  

Comments