భవిష్యత్తులో ట్యాబ్ లు విద్యార్థులకు ఎంతో ఉపయోగం

 భవిష్యత్తులో ట్యాబ్ లు విద్యార్థులకు ఎంతో ఉపయోగం*జిల్లాలో  మొదటి విడత 5760 ట్యాబ్ లు పంపిణీ*పెడపల్లి,డిశంబరు,21 (ప్రజా అమరావతి): భవిష్యత్తులో ట్యాబ్ లు విద్యార్థులకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని  జిల్లా కలెక్టర్ బసంత్ కుమార్ తెలిపారు.  బుధవారం 

   పుట్టపర్తి మండలంలోని పెడపల్లిజిల్లా ప్రజా పరిషత్ హైస్కూల్ నందు ఏర్పాటు చేసిన 8వ తరగతి విద్యార్థులకు ట్యాబ్ ల పంపిణీ కార్యక్రమంనకు  జిల్లా కలెక్టర్   బసంత కుమార్  పాల్గొన్నారు.  ఈ కార్యక్రమంలో స్థానిక శాసనసభ్యులు  డి శ్రీధర్ రెడ్డి, డీఈవో మీనాక్షి, వ్యవసాయ జిల్లా అడ్వైజరీ  సలహా మండలికమిటీ చైర్మన్ రమణారెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ పాఠశాలలో విద్యార్థిని విద్యార్థులకు ప్రధానంగా కావలసినది విద్యా, మౌళిక సదుపాయాలని, నేడు నేడు పథకం ద్వారా కార్పొరేట్ విద్యను అందించే దిశగా పలు కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుందన్నారు. ఒకొక్క విద్యార్థికి రూ.15 ,500 రూపాయలు విలువగల టాబ్ లు పంపిణీ చేయడం జరుగుతుందని తెలిపారు. ప్రతి విద్యార్థి ఈ ట్యాబ్ లు వినియోగించుకొని చదువు మెరుగు పరిచే విధంగా ఉండాలన్నారు.  విద్యార్థులంతా పూర్తి స్థాయిలో వినియోగించుకోవాలని హితవుపలికారు. జిల్లాలో ఉన్న అన్ని మండలాల విద్యార్థులు, ఉపాధ్యాయులకు  ఉచితంగా ట్యాబ్ లు పంపిణీ చేయడం జరుగుతుందని,  తెలిపారు. జిల్లా వ్యాప్తంగా వారం రోజులు పాటు ట్యాబ్ లు పంపిణీ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. ఈరోజు అన్ని నియోజకవర్గాలలో ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగిందని తెలిపారు. ఈ పాఠశాలలో ఇందులో 94  మంది 8వ తరగతి చదువుతున్న విద్యార్థులు  ట్యాబ్ లు పంపిణీ చేయడం జరిగిందని తెలిపారు.

స్థానిక ఎమ్మెల్యే మాట్లాడుతూ విద్యార్థులు ఉన్నత లక్ష్యాలు చేరాలని అందుకుగాను రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సంకల్పంతో ఉన్నారని చెప్పారు. బైజుస్ సంస్థతో ఒప్పందం చేసుకొని విద్యార్థులకు మంచి పాఠ్యాంశాలను డిజిటల్ విధానంలో బోధించుటకు ప్రభుత్వం ఒప్పందం చేస్తుకుందని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతి ఒక్క విద్యార్థి చదువుకోవాలని అందుకు పేదరికం అడ్డు రాకూడదని లక్ష్యంతో పనిచేస్తుందని అన్నారు. ప్రతి విద్యార్థికి అమ్మ ఒడి పథకం కింద పదిహేను వేల రూపాయలను ఆర్థిక సహాయం చేస్తుందని, మధ్యాహ్నం భోజనం, విద్యా కానుక కిట్లు అందించి వారి బాగోగులకు ముందడుగు వేస్తుందన్నారు. విద్యా దీవెన, వసతి దీవెన పథకాలు కింద ఫీజు రీయింబర్స్మెంట్, వసతి గృహాల్లో ఉన్నవారికి ఆర్థిక సహాయాన్ని అందించడం జరుగుతుందని ఆయన చెప్పారు. రాష్ట్ర ముఖ్యమంత్రి ఉన్నత సంకల్పానికి విద్యార్థులు అందరూ చేతులు కలపాలని, కృషితో కష్టపడి చదివి ఉన్నత శిఖరాలు చేరాలని పిలుపునిచ్చారు. అనంతరం కేక్ ని కట్ చేశారు


బాపట్ల జిల్లా చుండూరు మండలం యడ్లపల్లి హై స్కూలు లో ఉచిత ట్యాబలు పంపిణీ ముఖ్యమంత్రి ప్రత్యక్ష ప్రసారాన్ని  కార్యక్రమాన్ని సబికలు వీక్షించారు

అనంతరం  ఎనిమిదో తరగతి చదివే విద్యార్థులకు జిల్లా కలెక్టర్ చేతుల మీదుగా  మరియు స్థానిక శాసనసభ్యులు చేతుల మీదుగా విద్యార్థులకుట్యాబ్ లు పంపిణీ  చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ రమణారెడ్డి, పుర ప్రముఖులు, విద్యాశాఖ అధికారులు, తదితరులు పాల్గొన్నారు

  

Comments