గంజాయి నిషేధిత పదార్థం,గంజాయిని అక్రమ రవాణా చేసినా, వినియోగించిన చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటాము.

 *గంజాయి నిషేధిత పదార్థం,గంజాయిని అక్రమ రవాణా చేసినా, వినియోగించిన చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటాము.



*               


*గుంటూరు రేంజ్ డీఐజీ శ్రీ CM త్రివిక్రమ్ వర్మ ఐపీఎస్ .*

గుంటూరు (ప్రజా అమరావతి);

గంజాయి సాగు,అక్రమ రవాణాను అరికట్టే దిశగా అపరేషన్ పరివర్తన్ కార్యక్రమాన్ని పోలీస్ శాఖ చేపట్టిన సంగతి అందరికీ విదితమే.


దీనిలో భాగంగా గుంటూరు రేంజ్ పరిధిలో అన్ని జిల్లాల్లోని వివిధ పోలీస్ స్టేషన్లలో స్వాదీనం చేసుకున్న గంజాయిని గుంటూరు జిల్లాలోని పోలీస్ ఫైరింగ్ రేంజ్ లో గుంటూరు రేంజ్ డీఐజీ గారు,పల్నాడు జిల్లా ఎస్పీ శ్రీ రవిశంకర్ రెడ్డి ఐపీఎస్ గారు మరియు ఇతర జిల్లాల ఎస్పీ గారులు ధ్వంసం చేసినారు._


 *ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో గౌరవ డీఐజీ  మాట్లాడుతూ...*


గుంటూరు రేంజ్ పరిధిలోని అన్ని జిల్లాల్లో 52 పోలీస్ స్టేషన్లలో గంజాయి అక్రమ రవాణాపై నమోదైన 146 కేసుల్లో సుమారు 10,400(గుంటూరు 3,840 kgs, ప్రకాశం - 2200Kgs,బాపట్ల - 1858 kgs,పల్నాడు - 1100 kgs, నెల్లూరు - 679 kgs )కేజీల గంజాయిని స్వాధీనం చేసుకోవడం జరిగినది.    


ఆ గంజాయిని ఈ రోజు(ది.24.12.2022) తేదీన రాష్ట్ర గౌరవ డిజీపీ శ్రీ KV రాజేంద్రనాధ్ రెడ్డి ఐపీఎస్ ఆదేశానుసారం డ్రగ్ డిస్పోసల్ కమిటీ వారి ఉత్తర్వుల మేరకు ధ్వంసం చేయడం జరిగినది.


ఆయా పోలీస్ స్టేషన్లలో 146 కేసుల్లో 250 మంది నిందితులుగా ఉండగా వారిలో 187 మందిని రిమాండ్ కి పంపడం జరిగినది.


గౌరవ డిజీపీ రాష్ట్రంలో గంజాయి నిర్ములనకై పటిష్ఠమైన చర్యలు తీసుకోవాలని స్పష్టమైన ఆదేశాలు జారీచేసినారు.  


ఆ ఆదేశానుసారం మా రేంజి పరిధిలోని అన్ని జిల్లాల పోలీస్ అధికారులు పటిష్టమైన చర్యలు తీసుకుంటూ, ఎక్కడిక్కడ అక్రమ గంజాయి రవాణాను అరికడుతూ,కేసులు నమోదు చేస్తూ అక్రమార్కులను అరెస్ట్ చేస్తున్నారు.    


భవిష్యతులో మరిన్ని కట్టుదిట్టమైన ప్రణాళికలు రూపొందించి గుంటూరు రేంజ్ పరిధిలో గంజాయి సమూల నిర్ములనకు కృషిచేస్తాము.


తక్కువ సమయంలో అధికాదాయం పొందవచ్చని కొంతమంది ఈ గంజాయి అక్రమ రవాణాకు పాల్పడు తున్నారు.వారు చట్టపరంగా అనేక సమస్యలు ఎదుర్కోవలసి ఉంటుంది.               


కావున ఎవరు కూడా ఇటువంటి అక్రమ కార్యకలాపాలకు పాల్పడవద్దు అని సూచిస్తున్నాను.


ఈ కార్యక్రమంలో గౌరవ డీఐజీ,పల్నాడు ఎస్పీ గుంటూరు ఎస్పీ శ్రీ ఆరిఫ్ హఫీజ్ ఐపీఎస్,బాపట్ల ఎస్పీ శ్రీ వకుల్ జిందాల్ ఐపీఎస్,ప్రకాశం ఎస్పీ శ్రీ మల్లికా గార్గ్ ఐపీఎస్ నెల్లూరు SEB అదనపు ఎస్పీ శ్రీలక్ష్మీ,రేంజ్ లోని అదనపు ఎస్పీ, డిఎస్పీలు,సీఐలు, ఎస్సైలు మరియు సిబ్బంది పాల్గొన్నారు.


Comments