Sustainable Development Goals ( సుస్థిర అభివృద్ధి లక్ష్యాలు) సాధనలో మెడికల్ అండ్ హెల్త్ , స్త్రీ శిశు సంక్షేమ శాఖ , విద్యాశాఖ , వ్యవసాయ శాఖలో ప్రాధాన్యత ఎక్కువగా ఉంటుందిభీమవరం (ప్రజా అమరావతి);


    Sustainable Development Goals ( సుస్థిర అభివృద్ధి లక్ష్యాలు) సాధనలో మెడికల్ అండ్ హెల్త్ ,  స్త్రీ శిశు సంక్షేమ శాఖ  , విద్యాశాఖ , వ్యవసాయ శాఖలో ప్రాధాన్యత ఎక్కువగా ఉంటుంద


ని చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ టు సీఎం డాక్టర్ సమీర్ శర్మ అన్నారు. 


 మంగళవారం జిల్లా  కలెక్టరు కార్యాలయంలో ని సమావేశ మందిరంలో జిల్లాలో 

    Sustainable Development Goals   (సుస్థిర అభివృద్ధి లక్ష్యాలు )సాధించడానికి ప్రతి నెల అందరూ పిల్లలకు మెడికల్ టెస్టులు మెడికల్ డిపార్ట్మెంట్ చేయాలని,  ప్రతి రెండు నెలలకు ఒకసారి అందరు పిల్లలకు  హిమోగ్లోబిన్ తగ్గకుండా  చూడాలని ఐసిడిఎస్  అధికారులకు అయన సూచించారు .మెటర్నల్ మార్తాలిటీ రేషియో సరిగా ఉండే విధంగా చూడాలని , 10 నుంచి 19 సంవత్సరాల వయసుగల వారిలో ఎనిమిక్ లేకుండా చూడాలని వారే రేపు దేశానికి మంచి సంపదని ఆయన అన్నారు. ఆసుపత్రిలలో ప్రసవాలు జరిగే విధంగా చూడాలని ప్రాగ్నెట్ ఉమెన్ 15 నుంచి 49 సంవత్సరాల వారు కి మెడికల్ చెకప్ లు ఎప్పటికప్పుడు నిర్వహించాలని ఆయన అన్నారు. మోర్టాలిటీ రేట్ తగ్గకుండా చైల్డ్ అండ్ అడోలెన్స్ చూడాలన్నారు.  ఐదు సంవత్సరాల వయసు గల పిల్లలను బరువు తగ్గకుండా ఉండేందుకు వారికి పౌస్టిక ఆహారం అందించాలని ఆయన అన్నారు.  తల్లిదండ్రులు లేని పిల్లలను ,  సింగిల్ పేరెంట్స్ ఉన్న పిల్లలను గుర్తించి వారిని వసతి గృహాలలో నేర్పించాలని ఆయన సూచించారు.

విద్య యొక్క ప్రాధాన్యతను గుర్తించి ఎవరు డ్రాప్ అవుట్ అవ్వకుండా చూడాలని ఆయన అన్నారు.  టెన్త్ క్లాస్ అయిన తర్వాత ఇంటర్మీడియట్ లోకి అందరూ వెళ్లే విధంగా  వారిని మోటివేట్ చేయాలని ఆయన సూచించారు. పాఠశాలల్లో  బాలికల కొరకు ప్రత్యేక టాయిలెట్స్ నిర్మించాలని ఆయన అన్నారు. జిల్లాలో ప్రస్తుతం బాలికల కొరకు ఎన్ని  మరుగుదొడ్లు ఉన్నాయో అయన అడిగి తెలుసుకున్నారు.


 వ్యవసాయ శాఖ సంబంధించి యూరియా వాడకాన్ని తగ్గించేందుకు తీసుకుంటున్న చర్యలు గురించి అడిగి తెలుసుకున్నారు. క్రాఫ్ ఇన్సూరెన్స్ గురించి అగ్రికల్చర్  ఉత్పత్తి గురించి ఆయన అడిగి తెలుసుకున్నారు. సంబంధిత అధికారులతో మాట్లాడి సుస్థిర అభివృద్ధి లక్ష్యాలు సాధనలో వారు ఏ విధంగా పనిచేస్తున్నారో డా. సమీర్ శర్మ అడిగి తెలుసుకున్నారు.


  జిల్లా కలెక్టరు శ్రీమతి పి. ప్రశాంతి మాట్లాడుతూ జిల్లాలో

    Sustainable Development Goals  ( సుస్థిర  అభివృద్ధి లక్ష్యాలు )  సాధించడం కార్యక్రమం జిల్లాలో సక్రమంగా జరుగుతుందని జిల్లా కలెక్టరు తెలిపారు. పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా జిల్లాలో అమలు చేస్తున్న వివిధ కార్యక్రమాలను జిల్లా కలెక్టరు వారికి వివరించారు.తక్కువ బరువున్న పిల్లల యొక్క తల్లిదండ్రులకు కౌన్సిల్ ఏఎన్ఎం ,ఆశా వర్కర్స్ ద్వారా ప్రతి ఇల్లు తిరుగుతూ వారిని మోటివేట్ చేయడం జరుగుతుందని వివరించారు.  ప్రతి నెల హెల్త్ చెకప్ లు చేయడం జరుగుతుందని వి హెచ్ ఎన్ డి సబ్ సెంటర్ లెవెల్లో నిర్వహించడం జరుగుతుందని కలెక్టర్ వివరించారు.  వైఎస్ఆర్ సంపూర్ణ పోషణ పథకం ద్వారా సప్లిమెంట్స్  అందించడం జరుగుతుందని కలెక్టర్ తెలిపారు.  కిచెన్ గార్డెన్స్ కూడా అంగన్వాడి సెంటర్ లలో పెంచి పిల్లలకు పౌష్టికాహారం అందించడం జరుగుతుందని కలెక్టర్ వివరించారు.  అన్ని శాఖల సమన్వయంతో జిల్లా స్థాయి, మండల స్థాయి, గ్రామ స్థాయి   అవగాహన కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందని కలెక్టర్ వివరించారు.తక్కువ ఖర్చుతో న్యూట్రిషన్  ఆహారం ఏ విధంగా తయారు చేసుకోవాలో మహిళలకు శిక్షణ ఇవ్వడం ,  అవగాహన కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందని కలెక్టర్ అన్నారు.  విద్యాపరంగా కమ్యూనిటీ అవుట్ రిచ్  ప్రోగ్రాం  ద్వార  పిల్లలు స్కూలు మానకుండా అవగాహన  కార్యక్రమాలు నిర్వహించడం జరిగిందని కలెక్టర్ వివరించారు.  పిల్లలు స్కూలు మానేయకుండా తల్లిదండ్రులకు మోటివేషన్ క్యాంపులు నిర్వహించడం జరుగుతుందని, హెచ్ఎం లకు కూడా మోటివేషన్ క్యాంపులో నిర్వహించడం జరుగుతుందని వివరించారు.  వివిధ శాఖల ద్వారా సుస్థిర అభివృద్ధి లక్యాలు  ఏవిధంగా చేయడం జరుగుతుందో జిల్లా కలెక్టరు శ్రీమతి పి.ప్రశాంతి వివరించారు .


  ఈ  సమావేశంలో ఎస్ పి యు. రవి ప్రకాష్ ,  జాయింట్ కలెక్టర్ జె .వి మురళి ,  నరసాపురం సబ్ కలెక్టర్ ఎం సూర్య తేజ ,  అడిషనల్ ఎస్పీ సుబ్బరాజు , ఇన్చార్జి డిఆర్ఓ దాసి రాజు ,  జిల్లా అధికారులు,  తదితరులు పాల్గొన్నారు .


Comments