స్కిల్ హబ్ ల ప్రారంభానికి చర్యలు తీసుకోవాలి

 *స్కిల్ హబ్ ల ప్రారంభానికి చర్యలు తీసుకోవాలి


*


*: జిల్లా కలెక్టర్ బసంత్ కుమార్*


పుట్టపర్తి (శ్రీ సత్యసాయి జిల్లా), జనవరి 09 (ప్రజా అమరావతి):


స్కిల్ హబ్ ల ప్రారంభానికి చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ బసంత్ కుమార్ సంబంధిత అధికారులను ఆదేశించారు. సోమవారం పుట్టపర్తి కలెక్టరేట్ లోని వీడియో కాన్ఫరెన్స్ హాల్లో స్కిల్ కాస్కెడింగ్ సిస్టంపై బాధ్యతలు, క్వాలిటీ ఆఫ్ ట్రైనింగ్, నిరంతరం పర్యవేక్షణ, తదితర అంశాలపై సమీక్ష నిర్వహించారు.


ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాకు 6 స్కిల్ హబ్ లు మంజూరుకాగా, ఇప్పటికే ఒకటి ప్రారంభించడం జరిగిందని, మిగిలిన 5 స్కిల్ హబ్లను ఈనెల 19వ తేదీన ప్రారంభించేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలన్నారు. ఇందుకోసం అని ఏర్పాట్లు వెంటనే పూర్తి చేయాలన్నారు. స్కిల్ హబ్ లలో నిరుద్యోగ యువతకు శిక్షణ కార్యక్రమాలపై అవగాహన కల్పించాలన్నారు. స్కిల్ హబ్ లలో డిగ్రీ వరకు చదివిన నిరుద్యోగులకు డే స్కాలర్ ప్రోగ్రాం కింద శిక్షణ కార్యక్రమాలు నిర్వహించాలన్నారు.  అలాగే స్కిల్ కాలేజీకి సంబంధించి జిలాల్లోని రామగిరి లో యూత్ ట్రైనింగ్ సెంటర్ ను ప్రారంభించాలన్నారు. స్కిల్ కాలేజీ (రెసిడెన్షియల్ కాలేజ్) లో డిగ్రీ ఆపైన చదివిన నిరుద్యోగులకు  శిక్షణ కార్యక్రమాలు నిర్వహించాలన్నారు. స్కిల్ హబ్ ల ఏర్పాటు వల్ల ఉపాధి అవకాశాలు మెండుగా కల్పించేందుకు అవకాశం ఉంటుందన్నారు. అందరికీ ఉపాధి కల్పించడంలో భాగంగా ప్రభుత్వం అనేక రకాలుగా చొరవ తీసుకోవడం జరిగిందన్నారు. స్కిల్ హబ్ లను ఏర్పాటు చేసే చోట అన్ని రకాల మౌలిక సదుపాయాలు కల్పించాలని, భవనాలకు ఏవైనా చిన్నపాటి రిపేర్లు ఉంటే వెంటనే పూర్తి చేయాలన్నారు.


ఈ కార్యక్రమంలో ఏపిఎస్ఎస్డిసి డిఎస్డిఓ అబ్దుల్ ఖయ్యం, డిఆర్డీఏ పిడి నరసయ్య, డిఐసి జనరల్ మేనేజర్ చాంద్ బాషా, ఆర్అండ్ బి ఎస్ఈ సంజీవయ్య, ఎన్ఏసి ఎడి గోవిందరాజులు, సీడాప్ జెడిఎం సూర్యనారాయణ, హయ్యర్ ఎడుకేషన్ అధికారులు చంద్రమోహన్, వెంకటేశ్వర ప్రసాద్, ఈర్షద్, ఆయా కళాశాలల ప్రిన్సిపాల్స్, లెక్చరర్లు, వివిధ శాఖల అధికారులు, తదితరులు పాల్గొన్నారు.



Comments