*- నారా లోకేష్ తో యువగళంలో కలిసికట్టుగా నడుస్తున్న యువత*
*- పాదయాత్ర విజయవంతం కావాలంటూ పూజలు*
*- రాజకీయంగా యువతను పెద్దఎత్తున ప్రోత్సహిస్తాం*
*- గుడివాడ మాజీ ఎమ్మెల్యే రావి వెంకటేశ్వరరావు*
గుడివాడ, ఫిబ్రవరి 4 (ప్రజా అమరావతి): తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ యువగళం పాదయాత్రలో సైకో ప్రభుత్వాన్ని గద్దె దించేందుకు యువత కలిసికట్టుగా నడుస్తోందని కృష్ణాజిల్లా గుడివాడ మాజీ ఎమ్మెల్యే రావి వెంకటేశ్వరరావు అన్నారు. యువగళం పాదయాత్ర 100 కిలోమీటర్లు పూర్తి చేసుకున్న సందర్భంగా మాజీ ఎమ్మెల్యే రావి ఆధ్వర్యంలో గుడివాడలో తెలుగు మహిళలు పూజలు చేశారు. స్థానిక మెయిన్ రోడ్డులోని విఘ్నేశ్వర స్వామి దేవస్థానంలో 116 కొబ్బరికాయలను కొట్టి మొక్కులు తీర్చుకున్నారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే రావి మాట్లాడుతూ గత నెల 27వ తేదీన కుప్పంలో ప్రారంభించిన నారా లోకేష్ పాదయాత్ర విజయవంతంగా 100కిలోమీటర్లు పూర్తి చేసుకుందన్నారు. 400 రోజుల పాటు దాదాపు 4వేల కిలోమీటర్ల మేర ఈ పాదయాత్ర సాగనుందని తెలిపారు. పాదయాత్రను దిగ్విజయంగా పూర్తిచేసేలా శక్తిని నారా లోకేష్ కు అందించాలని స్వామివారికి పూజలు చేశామన్నారు. 116 కొబ్బరికాయలను శ్రీవిఘ్నేశ్వర స్వామికి సమర్పించుకోవడం జరిగిందన్నారు. గత నాలుగేళ్ళుగా రాష్ట్రంలో యువత పూర్తిగా నష్టపోయారన్నారు. యువతను బలోపేతం చేయాలనే లక్ష్యంతోనే నారా లోకేష్ పాదయాత్ర చేస్తున్నారన్నారు. పాదయాత్రను అడ్డుకునేందుకు ప్రభుత్వం దుర్మార్గంగా వ్యవహరిస్తోందన్నారు. ప్రజాస్వామ్యంలో పాదయాత్ర చేసుకునే హక్కు ఉంటుందని, ఈ హక్కును కాలరాసే విధంగా ప్రవర్తించవద్దన్నారు. రాష్ట్రంలో యువతకు జరుగుతున్న అన్యాయాన్ని నారా లోకేష్ ప్రశ్నిస్తూ వచ్చారన్నారు. ప్రభుత్వం ఆయనపై 15 కేసులు పెట్టిందన్నారు. యువతకు టీడీపీ హయాంలో రాజకీయ అవకాశాలను కూడా కల్పించడం జరిగిందన్నారు. టీడీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే రాష్ట్రానికి మరిన్ని పరిశ్రమలను తీసుకువచ్చి ఉపాధి అవకాశాలను కల్పిస్తారన్నారు. మాజీ ఎమ్మెల్యే నల్లగట్ల స్వామిదాస్ మాట్లాడుతూ టీడీపీ గుడివాడ నియోజకవర్గ ఇన్ఛార్జి రావి వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో తెలుగు మహిళలు ఎంతో ఉత్సాహంగా పార్టీ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారని కొనియాడారు. నారా లోకేష్ పూర్తి ఆరోగ్యంతో పాదయాత్రను పూర్తిచేయాలని కాంక్షిస్తూ శ్రీవిఘ్నేశ్వర స్వామికి పూజలు చేయడం జరిగిందన్నారు. రాష్ట్రంలో వ్యవస్థలను పునరుద్ధరించాలంటే చంద్రబాబు నాయకత్వంలో టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి రావాల్సి ఉందన్నారు. రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధికి టీడీపీ కృషి చేస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో టీడీపీ పట్టణ అధ్యక్షుడు దింట్యాల రాంబాబు, మహిళాధ్యక్షురాలు యార్లగడ్డ సుధారాణి, కార్యదర్శి గొర్ల శ్రీలక్ష్మి, నాయకులు డాక్టర్ గోర్జి సత్యనారాయణ, ముళ్ళపూడి రమేష్ చౌదరి, కంచర్ల సుధాకర్, పండ్రాజు సాంబశివరావు, అసిలేటి నిర్మల, మాదాల సునీత, కొల్లి రమ్యశ్రీ, పోలాసి ఉమామహేశ్వరరావు, వసంతవాడ దుర్గారావు, శొంఠి రామకృష్ణ, అడుసుమిల్లి శ్రీనివాసరావు, షేక్ జానీ షరీఫ్, దేవరపల్లి కోటి, తదితరులు పాల్గొన్నారు.
addComments
Post a Comment