ఈనెల నుండే ప్రభుత్వ ఆసుపత్రుల్లో పరికరాల నిర్వణకు చర్యలు: ఎంటి కృష్ణ బాబు

 *ఈనెల నుండే ప్రభుత్వ ఆసుపత్రుల్లో పరికరాల నిర్వణకు చర్యలు: ఎంటి కృష్ణ బాబు


*

విజయవాడ (ప్రజా అమరావతి);

ఈనెల నుండే ప్రభుత్వ ఆసుపత్రుల్లో పరికరాల నిర్వణకు పటిష్టమైన  చర్యలు తీసుకున్నామని వైద్య ఆరోగ్య శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శ్రీ ఎంటి కృష్ణ బాబు తెలిపారు. జజిహెచ్ విజయవాడలో ఆయన మీడియా తో మాట్లాడారు.  బయో మెడికల్ పరికరాల నిర్వహణ బాధ్యత ను రాష్ట్ర స్థాయిలో ఏజెన్సీ కి కాంట్రాక్టు ఇచ్చామన్నారు. పరికరాల నిర్వణకు సంబంధించి ఈ ఏజెన్సీ మ్యాపింగ్ ప్రక్రియను ఇప్పటికే పూర్తి చేసిందని , ఈనెల నుంచి ఏ అసుపత్రిలో ఎటువంటి పరికారాలైనా రిపేర్ చేసి కాంట్రాక్టు నిబంధనల మేరకు అందుబాటులోకి తీసుకొస్తారన్నారు. ఈ వివరాల్ని చూసుకునేందుకు డ్యాష్ బోర్డు ను కూడా ఏర్పాటు చేశామన్నారు. ఈనెలాఖరు కల్లా 104 (ఎంఎంయు) వాహనాల్ని అందుబాటులో కి తీసుకొస్తామని , దీంతో ఫ్యామిలీ డాక్టర్ విధానం లో ప్రతి గ్రామానికీ రెండు సార్లు సందర్శించేదుకు అవకాశమేర్పడుతుందన్నారు. మార్చి నెలలో సిఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి దీన్ని ప్రారంభిస్తారన్నారు. అందుకు తగిన ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. 

సిడి , ఎన్సీడీ సర్వే లో భాగంగా బిపి , షుగర్, టిబి , ఓరల్ క్యాన్సర్ వంటి కి 75 శాతం మందికి స్క్రీనింగ్ పూర్తయ్యిందనీ

దేశంలోనే ఏపీ ఈ సర్వే లో ప్రథమ స్థాయిలో నిలిచిందన్నారు.

ఏపీలో 28 శాతం మందికి బీపీ , 25.3శాతం మందికి షుగర్ వున్నాయని సర్వే లో తేలిందన్నారు. ఆరోగ్య కరమైన జీవన శైలి కి సంబంధించి ప్రజల్లో అవగాహన కల్పించేందుకు వైద్య ఆరోగ్య శాఖ కృషి చేస్తోందన్నారు. ఆరోగ్య శ్రీ కింద దాదాపు 10 లక్షల మంది సేవలు పొందారని , ఈ డేటా ఆధారంగా వ్యాధులను ఎనాలసిస్ చేస్తున్నామన్నారు.ఈ ఎకడమిక్ ఇయర్లో ఐదు ,వచ్చే ఎకడమిక్ ఇయర్లో మరో ఐదు‌, అటుతరువాత మిగతా ఏడు మెడికల్ కాలేజీలు అందుబాటులో కొస్తాయన్నారు.

Comments