ఏపీ ఫైబర్ నెట్ బేసిక్ ప్లాన్ ధరలు పెంచుతున్నట్లుగా జరుగుతున్న ప్రచారం అవాస్తవం


విజయవాడ (ప్రజా అమరావతి);


ఏపీ ఫైబర్ నెట్ బేసిక్ ప్లాన్ ధరలు పెంచుతున్నట్లుగా జరుగుతున్న ప్రచారం అవాస్తవం


ఏపీ ఫైబర్ నెట్ బేసిక్ ప్లాన్ ధరలు పెంచే ప్రసక్తే లేదు

3 ప్రాంతాల్లో సర్వీస్ సెంటర్లు ఏర్పాటు చేయబోతున్నాం 

జగనన్న కాలనీలు, టిడ్కో గృహాల్లో ఏపీ ఫైబర్ నెట్ సేవలు

త్వరలో హాట్ స్టార్, ఆహా తరహాలో APSFL ద్వారా సొంతంగా యాప్ : APSFL చైర్మన్ డా.పి.గౌతంరెడ్డి

                           ఏపీ ఫైబర్ నెట్ బేసిక్ ప్లాన్ ధరలు పెంచుతున్నట్లుగా జరుగుతున్న ప్రచారాన్ని APSFL చైర్మన్ డా.పి.గౌతంరెడ్డి ఖండించారు. బుధవారం విజయవాడలోని పండిట్ నెహ్రూ బస్టాండ్ వద్ద గల ఎన్టీఆర్ అడ్మినిస్ట్రేటివ్ బ్లాక్, 3వ అంతస్తులోని ఫైబర్ నెట్ కార్యాలయంలో ఆయన మీడియా సమావేశం నిర్వహించారు.  ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వానికి బేసిక్ ప్లాన్ ధరలు పెంచే ఆలోచన లేదన్నారు. ప్రస్తుతం ఏపీ ఫైబర్ నెట్ ద్వారా రూ.190 లకే ఇంటర్నెట్ సేవలందిస్తున్నామన్నారు. త్వరలో రాష్ట్రంలో విజయవాడ, విశాఖపట్టణం, తిరుపతి ప్రాంతాల్లో ఏపీ ఫైబర్ నెట్ బాక్సుల సర్వీస్ సెంట్లర్లను ఏర్పాటు చేయబోతున్నట్టు గౌతంరెడ్డి ప్రకటించారు. ఈ మేరకు APSFL బోర్డు మీటింగ్ తీర్మానాలు, నిర్ణయాలు, భవిష్యత్ కార్యాచరణను తెలియజేస్తూ..APSFL లో ఎన్నో కీలక మార్పులు తీసుకువచ్చిన రాష్ట్ర ప్రభుత్వం మారుమూప్రాంతాలకు సైతం విస్తరించి అత్యధిక స్పీడ్ తో ఇంటర్నెట్ సేవలు అందిస్తోందన్నారు. జగనన్న కాలనీలు, టిడ్కో గృహాల్లో కూడా ఏపీ ఫైబర్ నెట్ వాడేలా కీలక నిర్ణయం తీసుకున్నామని తెలిపారు. ఈ కాలనీల్లో ఏపీ ఫైబర్ నెట్ ను తొలగించి బయటి నెట్ వర్క్ లను వినియోగిస్తే ఏపీఎస్ఎఫ్‌ఎల్ ఆధ్వర్యంలో చర్యలు ఉంటాయని స్పష్టం చేశారు. ఇప్పటికే పలు ప్రాంతాల జగనన్న కాలనీలు, టిడ్కో గృహాల్లో ఏపీ ఫైబర్ నెట్ వినియోగం జరిగేలా కార్యక్రమాలు చేపట్టామన్నారు. 

                    ఏపీ ఫైబర్ నెట్ 15 లక్షల కనెక్షన్ల నెట్ వర్క్ అని ప్రస్తుతం 6 లక్షల కనెక్షన్లుకు పైగా సేవలు అందిస్తోందని ఉందని గౌతంరెడ్డి తెలిపారు. అయితే కనెక్షన్ల సంఖ్యను మరింత పెంచాలని ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆలోచనలకు అనుగుణంగా చర్యలు తీసుకుంటున్నామని అన్నారు. 55 వేల కిలోమీటర్ల వరకు ఏపీ ఫైబర్ నెట్ విస్తరించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్టు, ప్రస్తుతం 33 వేల కిలోమీటర్లలో పనులు జరుగుతున్నాయని, అలాగే 27 వేల కిలోమీటర్లలో ఏపీ ఫైబర్ నెట్ ట్రెండింగ్ లో ఉందన్నారు. ఏపీ ఫైబర్ నెట్ బాక్సుల సర్వీస్‌కు, కొత్త బాక్సుల ఆర్డర్లకు ఇకపై టెండర్ల విధానం అవలంబించాలని..రాష్ట్రంలో సొంతంగా ఫైబర్ నెట్ బాక్సుల మ్యానుఫ్యాక్చరింగ్ చేయాలని నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. ఇందులోభాగంగా ఎవరైనా ఔత్సాహికులు ఉంటే ముందుకు రావచ్చన్నారు. త్వరలో హాట్ స్టార్, ఆహా తరహాలో APSFL ద్వారా సొంతంగా యాప్ లాంఛ్ చేస్తున్నట్టు గౌతంరెడ్డి ప్రకటించారు. APSFL యాప్ లో సినిమాలు, వీడియోలు, ప్రముఖుల ప్రసంగాలు చూడొచ్చని..అలాగే థియేటర్లలో సినిమా విడుదలైన రోజే APSFL యాప్ లో వీక్షించవచ్చని వివరించారు. 

                          గ్రామ, వార్డు సచివాలయాలు, రైతు భరోసా కేంద్రాలు, హెల్త్, మెడికల్ ఫ్యామిలీ హెల్త్ కేర్ సెంటర్లు, ఏపీ స్టేట్ హౌసింగ్ కార్పొరేషన్ వంటి తదితర ప్రభుత్వ విభాగాల్లో APSFL ద్వారా ప్రాజెక్టులు చేపట్టి కనెక్షన్లు కూడా ఇవ్వడం జరిగిందని  గౌతంరెడ్డి చెప్పారు. కొత్తగా ఏర్పాటు చేయబోయే సర్వీస్ సెంటర్లకు బాక్సులను ఆపరేటర్లే తీసుకువెళ్లి సర్వీస్ చేయించేలా..దానికి కూడా ఒక రేటంటూ ఉండేలా నిర్ణయం తీసుకున్నట్లు గౌతంరెడ్డి వెల్లడించారు. బీబీఎన్ఎల్ ప్రాజెక్టులో భాగంగా రాష్ట్రానికి రూ.500కోట్లు వచ్చాయని ఇంకా రూ.500 కోట్లు రావాల్సి ఉందన్నారు. అందుకు చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. రాష్ట్రంలో కొత్తగా 50 లక్షల వరకు బాక్సులు అవసరమని..ప్రస్తుతానికి 20 లక్షల బాక్సులకు టెండర్లు కోరనున్నట్టు చెప్పారు. అయితే ఆపరేటర్లు, ఎంఎస్‌వోలు కలసికట్టుగా ఉన్నట్లయితే ధరలు పెరిగే అవకాశం ఉండదని..ఆ మేరకు అందరూ సహకరించాలని APSFL చైర్మన్ డా.పి.గౌతంరెడ్డి ఆశాభావం వ్యక్తం చేశారు. 


Comments