మల్లవోలు(గూడూరు) ఫిబ్రవరి 11 (ప్రజా అమరావతి);
*ఇంత పెద్ద ఎత్తున సంక్షేమ పథకాలు అందజేస్తున్న జగనన్నను ఆశీర్వదించండి- మంత్రి జోగి రమేష్
*
రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి జోగి రమేష్ శనివారం గూడూరు మండలం మల్లవోలు గ్రామ సచివాలయం-2 పరిధిలో మల్లవోలు భద్రాచలం డొంక పెద్ద గరువు అగ్రహారంలో గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమం నిర్వహించి ఇంటింటికి వెళ్లి వారు పొందిన పథకాలు వివరిస్తూ 100 రూపాయలు ఎవరైనా ఇస్తారా? ఇంత పెద్ద ఎత్తున పథకాలు అందిస్తున్న జగనన్నను ఆశీర్వదించాలని కోరారు.
గడపగడపలో మంత్రి తల్లి నమస్తే చెల్లి నమస్తే పెద్దమ్మ బాగున్నావా అంటూ వృద్ధులను పలకరించి వారి బాగోగులు అడిగి తెలుసుకున్నారు పథకాలు అన్ని అందుతున్నాయా లేదా ఆరా తీశారు.
జగనన్న మీకు కానుకగా ఇంటి స్థలం రిజిస్ట్రేషన్ చేసి ఇస్తున్నారని మంత్రి ఓటిఎస్ పథకం కింద లబ్ధి దారులకు పట్టాలు అందజేసి జగనన్నకు మద్దతుగా నిలవాలని సూచించారు.
గ్రామంలో క్యాన్సర్ బాధితుడు గంజాల లక్ష్మయ్య తన సమస్య వివరించగా సదరం స్లాట్ బుక్ చేసి క్యాన్సర్ చికిత్స కొరకు ప్రభుత్వం అందించే పింఛను మంజూరయ్యాలా చూడాలని సచివాలయ సిబ్బందిని ఆదేశించారు
ఈ పర్యటనలో మంత్రి గ్రామంలో ఎంపీపీ స్కూలు సందర్శించారు విద్యార్థులతో ముచ్చటించారు జగనన్న విద్యా కానుక క్రింద స్కూలు బ్యాగు షూ డ్రస్సు ఇచ్చారా? మధ్యాహ్న భోజనం బాగా పెడుతున్నారా? ఇవన్నీ ఎ వరిస్తున్నారని చిన్నారులను ప్రశ్నించగా జగన్ మామయ్య ఇస్తున్నట్లు చెప్పారు మీరు బాగా చదివి వృదిలోనికి రావాలని తల్లిదండ్రులను బాగా చూడాలని మంత్రి చిన్నారులను ఆశీర్వదించారు
పాఠశాల భవనం స్లాబ్ పెచ్చులూడి ఉండటం మంత్రి గమనించి ఎంపీపీ నిధులతో మరమ్మతులు చేయించాలని మంత్రి అధికారులను ఆదేశించారు.
గ్రామంలో నిరుపేదలు మరుగుదొడ్లు నిర్మించుకొనుటకు 15 వేల రూపాయలు మంజూరు పత్రాలు గంజాల నాంచారమ్మ తదితర లబ్ధిదారులకు మంత్రి అందజేశారు
గ్రామ పరిధిలో భద్రాచలం డొంక అభివృద్ధి చేయాలని మంత్రిని కోరగా, గ్రావెల్ రోడ్డు గా అభివృద్ధి చేస్తామని మంత్రి హామీ ఇచ్చారు.
ఐదుగుళ్లపల్లి గ్రామం నుండి కొంత మంది మహిళలు మంతిని కలిసి ఇళ్ల స్థలాల సమస్య వివరించగా అందరికీ ఇళ్ల స్థలాలు ఇస్తామని ఆందోళన చెందవద్దని హామీ ఇచ్చారు
ఈ పర్యటనలో మహిళలు మంత్రివర్యులకు హారతులు ఇచ్చి పుష్పగుచ్చాలు అందజేసి శాలువులతో సత్కరించి పుష్పాంజలి ఘటించారు.
ఈ పర్యటనలో గూడూరు ఎంపీపీ సంఘ మధుసూదన్ రావు జడ్పిటిసి వేముల సురేష్ రంగబాబు, మండల పార్టీ అధ్యక్షుడు గొరిపర్తి రవి, వైసీపీ నాయకులు తలుపుల కృష్ణ, స్టేట్ ఫైనాన్స్ కార్పొరేషన్ డైరెక్టర్ కారుమంచి కామేశ్వరరావు, గ్రామ సర్పంచ్ బోర్ర సాంబశివయ్య, ఎంపిపిలు నేతల కుటుంబ రావు, పిచ్చుక గంగాధర రావు, ఎంపీటీసీలు పిట్ల రామిరెడ్డి, మెట్ల సాయి కుమారి, పిఎసిఎస్ చైర్మన్ దాసరి రమేష్,ఆర్ బి కే మండల చైర్మన్ పర్ణం మహాలక్ష్మి నాయుడు, గ్రామ పార్టీ అధ్యక్షులు సోమరౌతు రాంబాబు, వివిధ శాఖల మండల అధికారులు, సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు.
addComments
Post a Comment