నిర్వాసిత రైతులకు న్యాయమైన పరిహారం అందజేయడం జరుగుతుంది జిల్లా కలెక్టర్ బసంత కుమార్

 నిర్వాసిత రైతులకు న్యాయమైన పరిహారం అందజేయడం జరుగుతుంది

జిల్లా కలెక్టర్  బసంత కుమార్పుట్టపర్తి, ఫిబ్రవరి 20 (ప్రజా అమరావతి): నిర్వాసిత రైతులకు న్యాయమైన పరిహారం అందజేయడం జరుగుతుంది

జిల్లా కలెక్టర్  బసంత కుమార్ పేర్కొన్నారు. సోమవారం స్థానిక కలెక్టరేట్లోని స్పందన  వీడియో కాన్ఫరెన్స్ హాలు నందు  ధర్మవరం మండలానికి  రైల్వే లైన్లకు  భూ సేకరణసంబంధించిన  రేగాటిపల్లి పట్టాదారుల రైతులతోDistrict Level Negotiation Meeting “ నిర్వహించారు ఈ కార్యక్రమంలో ధర్మవరం ఆర్డీవో తిప్పినాయక్, తాసిల్దార్ యోగేశ్వర దేవి,రైల్వే అసిస్టెంట్ ఎగ్జిక్యుటివ్ ఇంజనీర్ ఎలీశా గారు మరియు సదరు పట్టా దారు రైతులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూధర్మవరం మండలం మరియు గ్రామము నందు విస్తీర్ణం 2.50 ఎకరములు 8 మంది రైతులు మరియు ధర్మవరం మండలం రేగాటిపల్లి గ్రామం నందు  5 మంది రైతులు, విస్తీర్ణం 0.98 ఎకరములు  భూ సేకరణ నిర్వహించడం జరిగిందని తెలిపారు. భూ సేకరణ నందు భూమిని కోల్పోయిన  రైతులకు  న్యాయమైన పరిహారము అందజేయడం జరుగుతుందని రైతులకు జిల్లా కలెక్టర్ తెలిపారు. సెప్టెంబర్ 2020 సంవత్సరం  నందు  ధర్మవరం- పెనుగొండకు  రైల్వే లైన్లో కొరకు భూ సేకరణ  నిర్వహించడం జరిగింది.

ఈ కార్యక్రమంలో  పట్టాదారు రైతులు తదితరులు పాల్గొన్నారు.

 

Comments