ప్రశ్నించిన SFI నాయకుల అరెస్టులను ఖండించండి


*భారత విద్యార్థి ఫెడరేషన్ (ఎస్ఎఫ్ఐ)*

*ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కమిటీ*

విజయవాడ (ప్రజా అమరావతి);


*అధికార పార్టీ గెలుపు కోసం ప్రచారం చేస్తున్న ఆంధ్రా యూనివర్సిటీ విసి ప్రసాద రెడ్డిని విధులు నుండి తొలగించాలి - SFI*


*ప్రశ్నించిన SFI నాయకుల అరెస్టులను ఖండించండి


*

 



ఎన్నికల దుర్వినియోగానికి పాల్పడిన ఆంధ్రా యూనివర్సిటీ విసి ప్రసాద రెడ్డిని తక్షణమే విధులు నుండి తొలగించాలని భారత విద్యార్థి ఫెడరేషన్ (SFI) ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కమిటీ డిమాండ్ చేసింది.


ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ రాష్ట్ర అధ్యక్షుల, కార్యదర్శులు కె. ప్రసన్న కుమార్, ఎ.అశోక్ మాట్లాడుతూ రాష్ట్రంలో ఎమ్మెల్సీ ఎన్నికల జరుగుతున్న నేపథ్యంలో అధికారులు వైసిపి బలపరుస్తున్న నేతలకు మద్దతుగా ఎన్నికల నిబంధనలకు విరుద్ధంగా ప్రచారాన్ని సాగించారు. ఇప్పటికే ఆర్జేడీ ప్రతాప రెడ్డి చేస్తున్న అధికార పార్టీ నేతలా వ్యవహరిమంచడం దుర్మార్గం అని అని ఖండిస్తుంటే అదే తీరులో ఆంధ్రా యూనివర్సిటీ విసి ప్రసాదరెడ్డి నేడు ఎన్నికల నిబంధనలకు విరుద్ధంగా విశాఖ దశపల్ల హోటల్ లో ప్రభుత్వ, ప్రయివేటు డిగ్రీ విద్యా సంస్థల యాజమాన్యాలతో  సమావేశం నిర్వహించి అధికార పార్టీకి మద్దతు ప్రచారం చేయడాన్ని సిగ్గుచేటన్నారు.  గతం నుండి విసి వైసీపీ అనుకూల కార్యక్రమాలు, సీఎం జన్మదినాలు నిర్వహించడం చేశారన్నారు.  ప్రసాద రెడ్డి విసిగా రాజీనామా చేసి వైసిపి పార్టీ కండువా కప్పుకావాలని కోరారు.  తక్షణమే ఎన్నికల కమీషన్ విసిపై చర్యలు తీసుకొని సర్వీసు నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు.


దశపల్లలో జరిగే సమావేశం ఎన్నికలు నిబంధనలకు విరుద్ధమని సమావేశ హాల్ లోపలికి వెళ్లి ప్రశ్నించిన ఎస్ఎఫ్ఐ, ప్రజాసంఘాల నాయకుల అరెస్టులను తీవ్రంగా ఖండిస్తున్నామని తెలిపారు..



Comments