ఎంఎస్ఎంఈ 5 క్లస్టర్ల నుంచి 30 క్లస్టర్లకు పెంపు

 

                                                                         

ఎంఎస్ఎంఈ 5 క్లస్టర్ల నుంచి 30 క్లస్టర్లకు పెంపు


ఖాయిలా పడ్డ పరిశ్రమల అభివృద్ధికి పెద్దపీట 

నిరుధ్యోగ యువతకు ఉధ్యోగ కల్పన దిశగా అడుగులు వేయాలి

విజయవాడ (ప్రజా అమరావతి):  నష్టాల్లో ఉన్న ఖాయిలా పడ్డ పరిశ్రమలకు ఊతమిచ్చి వాటి అభివృద్ధికి పెద్దపీట వేయటమే ప్రభుత్వ, ఎంఎస్ఎంఈ లక్ష్యమని తిరుమల, తిరుపతి దేవస్థానం బోర్డ్ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి అన్నారు. నిరుధ్యోగ యువతకు ఉధ్యోగ కల్పన దిశగా అడుగులు వేయాలని కోరారు. ఆంధ్రప్రదేశ్ సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పారిశ్రామిక అభివృద్ధి సంస్థ నూతన ఛైర్మన్ గా అడారి ఆనంద కుమార్ శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు. ప్రభుత్వ ప్రింటింగ్ ప్రెస్ మొదటి అంతస్థులో ఉన్న ఎంఎస్ఎంఈ కార్యాలయంలో రాష్ట్ర మంత్రులు, అధికారుల సమక్షంలో వేడుకగా ప్రమాణ స్వీకార కార్యక్రమం వేడుకగా జరిగింది. ప్రమాణ స్వీకార కార్యక్రమానికి టీటిడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి, ఉప ముఖ్యమంత్రి, పంచాయితీ రాజ్ శాఖామాత్యులు బూడి ముత్యాల నాయుడు, ఐటీ శాఖామాత్యులు గుడివాడ అమర్నాథ్,  వైద్య ఆరోగ్య శాఖామాత్యులు విడదల రజనిలు హజరై అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి మాట్లాడుతూ గ్రామ, మండల, పట్టణ స్థాయిలో ఉన్న చిన్న పరిశ్రమల అభివృద్ధికి కృషి చేయాలన్నారు. నిరుధ్యోగ యువతకు అధికంగా ఉధ్యోగ అవకాశాలు కల్పించాలంటే చిన్న పరిశ్రమలకు ఊతమివ్వాలన్నారు. సూక్ష్మ,చిన్న, మధ్య తరహా పరిశ్రమల అభివృద్ధికి నూతన ఛైర్మన్ అడారి ఆనంద కుమార్ ప్రత్యేక శ్రద్ధ తీసుకుని బాధ్యతగా కృషి చేయాలన్నారు. నూతనంగా సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలను పెద్ద సంఖ్యలో ఏర్పాటుకు అవిశ్రాంతంగా కృషి చేయాలన్నారు. అలాగే ప్రస్థతం ఉన్న పరిశ్రమల ఉత్పత్తి లక్ష్యలను అధిగమించేలా చర్యలు తీసుకోవాలన్నారు. పరిశ్రమల నిర్వహణలోని సమస్యల తొలగించటానికి ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలన్నారు. 

      ఉప ముఖ్యమంత్రి, పంచాయితీ రాజ్ శాఖామాత్యులు బూడి ముత్యాల నాయుడు మాట్లాడుతూ సీఎం జగన్ మోహన్ రెడ్డి పరిశ్రమల నిర్వహణలో అనుభవం ఉన్న ఆనంద్ కుమార్ కు బాధ్యతలు అప్పగించటం అభినందనీయమని కొనియాడారు. విశాఖ డైయిరీ నిర్వహణలో తండ్రికి తోట్పాడుగా ఉంటూ సంస్థ అభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తున్న ఆనంద్ కుమార్ ఎంఎస్ఎంఈ ఛైర్మన్ గా సమర్థవంతంగా పనిచేసి ఆర్థికంగా చిన్న పరిశ్రమలు బలోపేతం కావటానికి శాయశక్తులా కృషి చేయాలని కోరారు. 

     ఐటీ శాఖామాత్యులు గుడివాడ అమర్నాథ్, వైద్య ఆరోగ్య శాఖామాత్యులు విడదల రజనిలు మాట్లాడుతూ చిన్న పరిశ్రమలకు మరింత ఊతమివ్వాలని కోరారు. రెండు సంవత్సరాల నుంచి కరోనా విపత్తుతో నష్టాల ఊబిలో కొట్టుమిట్టాడుతున్న చిన్న పరిశ్రమలు నిలదొక్కుకోవటానికి  అవసరమైన చర్యలు తీసుకోవాలని సూచించారు. అనంతరం ఎంఎస్ఎంఈ ఛైర్మన్ గా అడారి ఆనంద్ కుమార్ బాధ్యతలు స్వీకరించిన అనంతరం మాట్లాడుతూ తనపై నమ్మకం ఉంచి ఎంఎస్ఎంఈ ఛైర్మన్ గా బాధ్యతలు అప్పగించిన గౌరవ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి ధన్యవాదాలు తెలిపారు. అలాగే తనకు పదవి రావటానికి కృషి చేసిన ప్రతి ఒక్కరికి పేరుపేరునా ధన్యవాదాలు తెలిపారు. ఖాయిలా పడ్డ పరిశ్రమలపై మొదటగా దృష్టి పెట్టి వారికి అండగా నిలిచి ప్రోత్సహకాలు ఇచ్చి వాటిని వినియోగంలోకి తేవటానికి తన శాయశక్తుల కృషి చేస్తానని హామి ఇచ్చారు. ఎంఎస్ఎంఈలో ప్రస్థుతం 5 క్లస్టర్లు ఉన్నాయని, మరో 25 క్లస్టర్లు పెంచి మొత్తం 30 క్లస్టర్ లు చేయనున్నట్లు తెలిపారు. సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమల ఉన్నతికి పాటుపడతానని తెలిపారు.        అనంతరం ఎంఎస్ఎంఈ ఛైర్మన్ గా నూతనంగా బాధ్యతలు స్వీకరించిన అడారి ఆనంద్ కుమార్ ను పలువురు పూలమాలలు, శాలువాలతో ఘనంగా సత్కరించారు. ముందుగా టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి, మంత్రులను పూలమాలలు, శాలువాలతో అడారి ఆనంద్ కుమార్ సత్కరించి వారి ఆశీర్వాదాలు తీసుకున్నారు.  కార్యక్రమంలో అధికారులు, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, సిబ్బంది పాల్గొన్నారు. 


Comments