నెల్లూరు (ప్రజా అమరావతి);
రాష్ట్రంలోని మహిళలకు అండగా నిలుస్తూ, వారు ఆర్ధిక స్వాలంబన సాధించేలా రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తున్నద
ని రాష్ట్ర వ్యవసాయ, సహకార, మార్కెటింగ్, ఫుడ్ ప్రాసెసింగ్ శాఖామాత్యులు శ్రీ కాకాణి గోవర్ధన్ రెడ్డి పేర్కొన్నారు.
వైయస్ఆర్ ఆసరా మూడవ విడత రాష్ట్ర వ్యాప్తంగా 7.98 లక్షల మహిళా సంఘాలలోని 78.94 లక్షల అక్క చెల్లెమ్మలకు లబ్ది చేకూరేలా 6,419.89 కోట్ల రూపాయలు నేరుగా మహిళా సంఘాల పొదుపు ఖాతాలలో జమచేసే కార్యక్రమాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ వై. ఎస్. జగన్ మోహన్ రెడ్డి గారు శనివారం ఏలూరు జిల్లా, దెందులూరు నుండి బటన్ నొక్కి జమ చేశారు.
అందులో భాగంగా నెల్లూరు నగరంలోని శ్రీ వెంకటేశ్వర కస్తూరిభా కళాక్షేత్రంలో ఏర్పాటుచేసిన వైయస్సార్ ఆసరా మూడో విడత లబ్ధి పంపిణీ కార్యక్రమాన్ని రాష్ట్ర వ్యవసాయ సహకార మార్కెటింగ్ ఫుడ్ ప్రాసెసింగ్ శాఖ మంత్రివర్యులు శ్రీ గోవర్ధన్ రెడ్డి, జిల్లా పరిషత్ చైర్ పర్సన్ శ్రీమతి ఆనం అరుణమ్మ, శాసన మండలి సభ్యులు శ్రీ చంద్రశేఖర్ రెడ్డి లతో కలసి జ్యోతి ప్రజ్వలన గావించి ప్రారంభించారు.
ఈ సంధర్భంగా మంత్రి శ్రీ గోవర్ధన్ రెడ్డి మాట్లాడుతూ, రాష్ట్రంలోని మహిళలకు అండగా నిలుస్తూ, వారు ఆర్ధిక స్వాలంబన సాధించేలా రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తున్నదన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి గారు తన పాద యాత్ర సమయంలో స్వయం సహాయక సంఘాలలో ఉన్న మహిళల ఆర్థిక ఇబ్బందులను కళ్ళారా చూసి, చలించి, తన ప్రభుత్వం వచ్చిన తక్షణమే అక్క చెల్లెమ్మలకు ఉన్న పొదుపు సంఘాల బ్యాంకు ఋణాల మొత్తాన్ని 4 విడతల్లో పొదుపు సంఘాల ఖాతాల ద్వారా నేరుగా అందిస్తానని తెలియచేయడం జరిగిందన్నారు. ఇచ్చిన మాటకు కట్టుబడి ఇప్పటికే రెండు విడతలుగా చెల్లించడం జరిగిందన్నారు. మూడో విడత నిధులను నేడు పంపిణీ చేయడం జరుగుచున్నదని మంత్రి శ్రీ గోవర్ధన్ రెడ్డి తెలిపారు. ఈ పథకం వల్ల మహిళా సాధికారత మరింత మెరుగుపడి, పేద మహిళల యొక్క ఆర్ధిక పురోగతికి దోహదపడుతుందన్నారు. ఇచ్చిన మాట నిలబెట్టుకుంటూ , ముఖ్యమంత్రి శ్రీ వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి గారు వై.ఎస్.ఆర్ ఆసరా పధకం కింద రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే 2 విడతల్లో 12,758 కోట్ల రూపాయల ఆర్ధిక సహాయాన్ని అందించడం జరిగిందని, నేడు మూడవ విడత కింద రాష్ట్ర వ్యాప్తంగా 7.98 లక్షల మహిళా సంఘాలలోని 78.94 లక్షల అక్క చెల్లెమ్మలకు లబ్ది చేకూరేలా 6,419.89 కోట్ల రూపాయలు నేరుగా మహిళా సంఘాల పొదుపు ఖాతాలలో జమచేస్తున్నట్లు మంత్రి శ్రీ గోవర్ధన్ రెడ్డి వివరించారు. జిల్లాకు సంబంధించి తొలి విడత 2020-21 సంవత్సరంలో 31,569 సంఘాల లోని 3,09,877 మందికి 250.23 కోట్ల రూపాయలను జమ చేయడం జరిగిందని మంత్రి తెలిపారు. 2వ విడతలో 2021-22 సంవత్సరంలో 34,323 సంఘాల లోని 3,28,646 మందికి 285.18 కోట్ల రూపాయలను జమ చేయడం జరిగిందని, నేడు 3వ విడతలో 34,443 సంఘాల లోని 3,29,815 మందికి 290.17 కోట్ల రూపాయలను జమ చేస్తున్నట్లు మంత్రి శ్రీ గోవర్ధన్ రెడ్డి తెలిపారు. రాష్ట్రంలో ఏ పథకం ప్రవేశపెట్టినా ఆ పథకం మహిళలకే చెందేలా అమలుచేయడం జరిగిందన్నారు. అమ్మఒడి, విద్యాదీవెన, వసతిదీవెన, ఆసరా, చేయూతతో పాటు గృహాలను కూడా మహిళల పేరునే మంజూరుచేస్తున్న సంగతిని మంత్రి గుర్తుచేసారు. అన్నీ వర్గాల సంక్షేమాన్ని దృష్టిలో వుంచుకొని ముఖ్యమంత్రి గారు ఇచ్చిన మాట ప్రకారం అమ్మఒడి, వై.యస్.ఆర్ ఆసరా, రైతు భరోసా, జగనన్న చేయూత వంటి అనేక పథకాలను అమలు చేస్తున్నట్లు మంత్రి తెలిపారు. ఆహార భద్రతతో పాటు ఆరోగ్య భద్రత కల్పించాలన్న లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం చిరు ధాన్యాల వినియోగాన్ని పెంచేలా ప్రోత్సహిస్తున్నట్లు మంత్రి తెలిపారు.
జిల్లా పరిషత్ చైర్ పర్సన్ శ్రీమతి ఆనం అరుణమ్మ మాట్లాడుతూ, ముఖ్యమంత్రి శ్రీ వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి గారు తన సుధీర్గమైన పాద యాత్రలో పేద ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలు నెరవేర్చే లక్ష్యంతో నవరత్నాల కార్యక్రమాన్ని తీసుకురావడం జరిగిందన్నారు. అందులో భాగమే వై.ఎస్. ఆర్. ఆసరా పధకమని అన్నారు. ఈ పథకం వల్ల మహిళా సాధికారత మరింత మెరుగుపడి, గ్రామీణ మరియు పట్టణ ప్రాంతాలలోని స్వయం సహాయక సంఘాలలోని పేద మహిళల యొక్క ఆర్ధిక పురోగతికి దోహదపడుతుందన్నారు. ఈ ప్రభుత్వం మహిళా పక్షపాతి ప్రభుత్వమని, మహిళల జీవితాల్లో ఆర్ధిక, సామాజిక, రాజకీయ చైతన్యానికి కృషి చేస్తున్న గౌ.రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు శ్రీ వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి గారికి జిల్లా మహిళల తరుపున ధన్యవాదాలు తెలియచేస్తున్నట్లు చైర్ పర్సన్ శ్రీమతి ఆనం అరుణమ్మ తెలిపారు.
శాసన మండలి సభ్యులు శ్రీ పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి మాట్లాడుతూ, ప్రతి మహిళ కూడా ఆర్ధికంగా పరిపుష్టిగా ఉండాలన్న సంకల్పంతో ఆసరా కార్యక్రమం ద్వారా రాష్ట్ర ప్రభుత్వం ఆర్ధిక తోడ్పాటు అందిస్తున్నట్లు తెలిపారు. మహిళలు అభివృద్ది చెందితేనే ఆ కుటుంబం అభివృద్ది చెంది సమాజానికి మేలు చేకూరుతుందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం విద్యకు కూడా అత్యంత ప్రాధాన్యతను ఇస్తూ అమ్మవడి, ఫీజు రేయింబర్స్ మెంట్, వసతి దీవెన వంటి అనేక కార్యక్రమాలను అమలు చేయడం జరుగుచున్నదన్నారు. ప్రతి కుటుంబం అభివృద్ది చెందాలన్న లక్ష్యంతో అనేక సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తున్న రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి గారికి ప్రతి ఒక్కరూ అండగా నిల్వాల్సిన అవసరం వుందన్నారు. ఈ కార్యక్రమంలో భాగస్వాములు కావడం, పాలు పంచుకోవడం నాకు ఎంతో సంతోషంగా వుందని శ్రీ చంద్ర శేఖర్ రెడ్డి అన్నారు.
జిల్లా గ్రామీణాబివృద్ది సంస్థ ప్రాజెక్ట్ డైరెక్టర్ శ్రీ సాంబశివా రెడ్డి జిల్లాలో వై.ఎస్.ఆర్ ఆసరా పధకం ఉద్దేశ్యాన్ని, మూడు విడతల్లో స్వయం సహాయక సంఘాల సభ్యులకు అందచేసిన ఆర్ధిక సహాయం వివరాలను తెలియచేయడం జరిగింది. ఈ సంధర్భంగా రూపొందించిన ముఖ్యమంత్రి గారి సందేశం కరపత్రాన్ని, స్టిక్కర్ ను మంత్రి శ్రీ గోవర్ధన్ రెడ్డి ఆవిష్కరించారు.
అనంతరం 3వ విడత ఆసరా పధకం క్రింద జిల్లా గ్రామీణాబివృద్ది సంస్థ ద్వారా 2,67,736 మంది స్వయం సహాయక సంఘాల సభ్యులకు 237.96 కోట్ల రూపాయల మెగా చెక్కును, మెప్మా ద్వారా 60,533 స్వయం సహాయక సభ్యులకు 52.41 కోట్ల రూపాయల మెగాచెక్కును మంత్రి శ్రీ గోవర్ధన్ రెడ్డి, జిల్లా పరిషత్ చైర్ పర్సన్ శ్రీమతి ఆనం అరుణమ్మ తో కలసి లబ్ధిదారులకు అందచేశారు.
తొలుత రాష్ట్ర వ్యవసాయ సహకార మార్కెటింగ్ ఫుడ్ ప్రాసెసింగ్ శాఖ మంత్రి శ్రీ కాకాని గోవర్ధన్ రెడ్డి చిరుధాన్యాల మహోత్సవ కార్యక్రమంలో భాగంగా వివిధ ప్రభుత్వ శాఖలు ఏర్పాటుచేసిన ప్రదర్శనశాలలను సందర్శించి పిండివంటలను రుచి చూశారు.
ఈ కార్యక్రమంలో జిల్లా జాయింట్ కలెక్టర్ శ్రీ రోణంకి కూర్మనాద్, బొందిలి కార్పొరేషన్ చైర్మన్ శ్రీ కృష్ణ కిశోర్, కార్పొరేటర్ శ్రీమతి గౌరి, ఐటిడిఎ పిఓ శ్రీమతి మందా రాణి, మెప్మా, ఎపిఎంఐపి పి.డి లు శ్రీ రవీంద్ర , శ్రీ శ్రీనివాసులు, డి.టి.సి శ్రీ చందర్, సోషల్ వెల్ఫేర్ డిడి శ్రీ వెంకటయ్య, స్వయం సహాయక సంఘాల సభ్యులు తదితరులు పాల్గొన్నారు.
addComments
Post a Comment