జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అందరి మాదిరిగానే చేనేతలను కూడా తీవ్రంగా మోసగించింది.

 యువనేత లోకేష్ ను కలిసి సమస్యలు విన్నవించిన చేనేతలు 

నల్లచెరువు మండల చేనేతలు యువనేత లోకేష్ ను కలిసి సమస్యలను విన్నవించారు.

.నల్లచెరువు మండలంలో 2వేల చేనేత కుటుంబాలు చేనేత వృత్తిపై ఆధారపడి జీవనం సాగిస్తున్నాయి.

చేనేత కార్మికులకు 45 సంవత్సరాలకే పెన్షన్ ఇవ్వాలి.

ప్రతినెలా రేషన్‌(నూలు) సబ్సిడీ మంజూరు చేయాలి.

చేనేత క‌ళాకారుల‌కు ప్రత్యేకంగా చేనేత కాలనీలు ఏర్పాటుచేయడంతోపాటు ఇళ్లు నిర్మించుకోవడానికి రూ.5లక్షలు కేటాయించాలి

ప్రతి చేనేత కార్మికుడికి కరెంటు సబ్సిడీ అందించాలి

చేనేతలకు పనిముట్లు ఉచితంగా పంపిణీ చేయాలి

ప్రతిఒక్క చేనేత కార్మికుడికి మగ్గం కోసం లోన్లు మంజూరు చేయాలి.

చేనేత కార్మికులకు సంవత్సరానికి రూ.30వేలు ఆర్థిక సాయం అందించాలి.

చేనేత కార్మికుల ఉపాధిని దెబ్బతీస్తున్న కరెంటు మగ్గాలను బంద్ చేయాలి.

కదిరి (ప్రజా అమరావతి);

యువనేత లోకేష్ స్పందిస్తూ...

జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అందరి మాదిరిగానే చేనేతలను కూడా తీవ్రంగా మోసగించింది.


నాలుగేళ్లుగా ప్రభుత్వం చేనేత సహకార సంఘాలకు చెల్లించాల్సిన రూ. 80 కోట్ల బకాయిలు ఇంకా విడుదల చేయలేదు.

కరోనా సమయంలో ప్రభుత్వం మాస్కుల కోసం ఆప్కో నుంచి కొనుగోలుచేసిన గుడ్డకు సంబంధించి  ఇంకా సగం బకాయిలు చెల్లించలేదు.

ఆత్మహత్య చేసుకున్న చేనేత కుటుంబాలకు ఎటువంటి పరిహారం అందజేయలేదు.

టిడిపి అధికారంలోకి వచ్చిన వెంటనే చేనేతలకు రావాల్సిన బకాయిలను వెంటనే ఆప్కో ద్వారా విడుదల చేస్తాం.

చేనేతలకు 200 యూనిట్ల ఉచిత విద్యుత్ అందజేస్తాం.

చేనేత వస్త్రాలపై జిఎస్టీని రాష్ట్రప్రభుత్వమే భరించేలా చేస్తాం.

చేనేతలకు కామన్ ఫెసిలిటీ సెంటర్లను ఏర్పాటుచేస్తాం.

చేనేత ఉత్పత్తులను బ్రాండింగ్ చేసి మార్కెటింగ్ సౌకర్యం కల్పిస్తాం.

గత ప్రభుత్వ హయాంలో చేనేత రంగాలకు అందించిన పట్టు సబ్సిడీ, ప్రోత్సాహకాలు, పథకాలన్నింటినీ పునరుద్దరిస్తాం. 

చేనేతరంగం ఎదుర్కొంటున్న సమస్యలపై అధ్యయనం చేసేందుకు చేనేత నాయకులతో ఒక కమిటీని ఏర్పాటు చేస్తాం.

Comments