శ్రీ దుర్గామల్లేశ్వర స్వామి వార్ల దేవస్దానము, ఇంద్రకీలాద్రి,
విజయవాడ (ప్రజా అమరావతి):
రాష్ట్ర ఉపముఖ్యమంత్రివర్యులు మరియు దేవాదాయ శాఖ మంత్రివర్యులు మరియు దేవాదాయశాఖ కమీషనర్ వార్ల ఉత్తర్వుల మేరకు ఆలయ వైదిక కమిటీ సభ్యుల వారి సూచనల మేరకు లోకకళ్యాణార్థం సంకల్పించి ది.02-03-2023 నుండి 06-03-2023 వరకు 5 రోజులపాటు దేవస్థానం నందు జరుగుచున్న “శత చండీ సహిత మహారుద్రయాగం” లో భాగముగా ఈరోజు(5వ రోజు) అనగా ఉదయం 08.00 గం.లకు మంటప పూజలు,రుద్ర హవనము, చండీ హోమం, మూల మంత్ర హవనములు నిర్వహించి అనంతరం ఉ 10.30గం.ల నుండి మహాపూర్ణహుతి, తదనంతరం కలశోద్వాసన చేసి కార్యక్రమ సమాప్తి చేయడం జరిగినది.
ఈ కార్యక్రమం నందు ఆలయ ట్రస్ట్ బోర్డు ఛైర్మన్ కర్నాటి రాంబాబు దంపతులు, కార్యనిర్వాహణాధికారి దర్భముళ్ల భ్రమరాంబ , ట్రస్ట్ బోర్డు సభ్యులు కట్టా సత్తయ్య, కేసరి నాగమణి, బుద్దా రాంబాబు, దేవిశెట్టి బాలకృష్ణ, అనుమోలు ఉదయలక్ష్మి , స్థానాచార్యులు విష్ణుభట్ల శివప్రసాద శర్మ , వైదిక సిబ్బంది కోటా ప్రసాద్ , వేదపండితులు చింతపల్లి ఆంజనేయ ఘనపాటి మరియు ఇతర వేదపండితులు, ఋత్వికులు, అర్చకులు, కార్యనిర్వాహక ఇంజినీర్లు,సహాయ కార్యనిర్వాహనాధికారులు, ఇంజినీరింగ్ సిబ్బంది మరియు ఆలయ సిబ్బంది పాల్గొన్నారు. దేవస్థానమునకు విచ్చేసిన భక్తులందరూ ఈ యాగ కార్యక్రమములను ఆద్యంతం వీక్షించి తీర్థ ప్రసాదములను స్వీకరించారు.
అనంతరం ఆలయ ట్రస్ట్ బోర్డు ఛైర్మన్ శ్రీ కర్నాటి రాంబాబు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం, ఉపముఖ్యమంత్రివర్యులు, దేవాదాయ శాఖ మంత్రివర్యుల వారి, మరియు దేవాదాయశాఖ కమీషనర్ వార్ల ఉత్తర్వుల మేరకు ఆలయ వైదిక కమిటీ సభ్యుల వారి సూచనల మేరకు లోకకళ్యాణార్థం సంకల్పించి శత చండీ సహిత మహారుద్రయాగం ది.02-03-2023 ఉదయం గణపతి పూజతో ప్రారంభమై, ఈరోజు అనగా 06-03-2023 పూర్ణాహుతి, వేదపండితులచే ఆశీర్వచనం తదితర వైదిక కార్యక్రమములతో ముగిసినదని, కార్యక్రమములన్నియూ అర్చక సిబ్బంది శాస్త్రోక్తముగా నిర్వహించడం జరిగినదని, రాష్ట్ర ప్రజలందరూ సుఖ సంతోషములతో ఉండాలని ప్రార్థించినట్లు తెలిపారు.
అనంతరం ఆలయ కార్యనిర్వాహణాధికారి దర్భముళ్ల భ్రమరాంబ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం, ఉపముఖ్యమంత్రి వర్యులు మరియు దేవాదాయశాఖ మంత్రివర్యులు మరియు దేవాదాయశాఖ కమీషనర్ వార్ల ఉత్తర్వుల మేరకు అన్ని దేవాలయంలలోనూ లోకకళ్యాణార్థం కార్యక్రమములు నిర్వహించవలసినదిగా ఆదేశించిన మేరకు శ్రీ అమ్మవారి ఆలయము నందు ఆలయ వైదిక కమిటీ సభ్యుల వారి సూచనల మేరకు శత చండీ సహిత మహారుద్రయాగం ది.02-03-2023 న ప్రారంభించి, ఈరోజు ది.06-03-2023 పూర్ణాహుతి వరకు అన్ని వైదిక కార్యక్రమములు వైదిక సిబ్బంది శాస్త్రోక్తముగా నిర్వహించడదమైనదని తెలిపారు. ఈ యాగం వలన ప్రజలందరికీ మంచి జరగాలని కోరుకుంటున్నట్లు తెలిపారు.
అనంతరం ఆలయ స్థానాచార్యుల వారు మాట్లాడుతూ దేవస్థానం నందు రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రివర్యుల వారి మరియు దేవాదాయశాఖ కమీషనర్ వార్ల ఉత్తర్వుల మేరకు ఆలయ ట్రస్ట్ బోర్డు చైర్మన్, ఆలయ కార్యనిర్వహణాధికారి వార్ల ఆధ్వర్యంలో 5 రోజుల నుండి పాంచాహ్నిక దీక్షా పూర్వక శత చండీ సహిత మహారుద్రయాగం అత్యంత వైభవముగా నిర్వహించడం జరిగినదని, ఈ రోజు మహాపూర్ణాహుతి తో ఈ కార్యక్రమము పరిసమాప్తి అయినదని తెలిపారు. ఈ యాగ కార్యక్రమముల యందు 58 మంది వైదిక, అర్చక సిబ్బంది పాల్గొని అత్యంత దీక్షతో యాగ కార్యక్రమములు నిర్వహించడం జరిగినదని, ఇటువంటి కార్యక్రమముల వలన లోక కల్యాణం జరిగి పాడిపంటలు, సుఖసంతోశాములతో లోకమంతా సుభిక్షముగా ఉంటుందని తెలిపారు.
addComments
Post a Comment